1➤ ఈ పుస్తక రచయిత ఎవరు?
,=> దానియేలు
2➤ మందిరంలో శేషించిన ఉపకరణాలను తెచ్చి నెబుకద్నెజరు ఎక్కడ పెట్టాడు?
,=> షీనారు దేశం (1:2)
3➤ నెబుకద్నెజరు రాజు నపుంసకుల అధిపతి ఎవరు?
,=> అప్పెనజు (1:3)
4➤ రాజ కోటలో సేవించడానికి యూదులనుండి ఎవరు ఎన్నుకోబడ్డారు?
,=> దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా (1:6)
5➤ యూదుల యవ్వనస్థుల పేర్లను మార్చింది ఎవరు?
,=> అప్పెనజు (1:3,7)
6➤ దానియేలుకివ్వబడిన క్రొత్త పేరు ఏమిటి?
,=> బెత్తెషాజరు (1:7)
7➤ హనన్యా క్రొత్త పేరు ఏమిటి?
,=> షద్రకు (1:7)
8➤ మిషాయేలుకివ్వబడిన క్రొత్త పేరేమిటి?
,=> మేషాకు (1:7)
9➤ అజర్యా క్రొత్త పేరేమిటి?
,=> అబేద్నెగో (1:7)
10➤ తనను తాను అపవిత్రపరచుకోకూడదని తన హృదయంలో ఉద్దేశించిన దెవరు?
,=> దానియేలు (1:8)
11➤ యూదు యవ్వనస్థులమీద గృహనిర్వాహకునిగా నియమించబడినది ఎవరు?
,=> నియామకుడు (1:11)
12➤ దానియేలు, మిగతా యవ్వనస్థులు ఎలాంటి ఆహారం అడిగారు?
,=> శాఖాహారం (1:12)
13➤ శాఖాహారంతో యూదు యవ్వనస్థులు ఎన్ని రోజులు పరీక్షించబడ్డారు?
,=> పది రోజులు (1:14)
14➤ సకల విధములైన దర్శనాలు, స్వప్నభావాలను గ్రహించు తెలివిగలవాడు ఎవరు?
,=> దానియేలు (1:17)
15➤ ఏ రాజు కాలంవరకు దానియేలు జీవించాడు?
,=> కోరేషు (1:21)
16➤ తనకు కలిగిన కలవలన ఎవరి మనస్సు కలత చెందింది?
,=> నెబుకద్నెజరు (2:1)
17➤ జ్ఞానులను చంపాలని ఎవరు ఆదేశించారు?
,=> నెబుకద్నెజరు (2:13)
18➤ బబులోను జ్ఞానులను చంపడానికి ఎవరు వెళ్ళారు?
,=> అర్యోకు (2:14)
19➤ రాజు దేహ సంరక్షకుల అధిపతికి జ్ఞానయుక్తంగా జవాబు ఇచ్చింది ఎవరు?
,=> దానియేలు (2:14)
20➤ రాత్రి దర్శనంలో దేవుడు మర్మాలను ఎవరికి బయలుపరిచాడు?
,=> దానియేలు (2:19)
21➤ మర్మాలను బయలుపరిచేది ఎవరు?
,=> దేవుడు (2:28)
22➤ బ్రహ్మాండమగు ఒక ప్రతిమ దర్శనం ఎవరికి కలిగింది?
,=> నెబుకద్నెజరు (2:31)
23➤ బ్రహ్మాండమైన ప్రతిమయొక్క బంగారు శిరస్సు అర్థమేమిటి?
,=> బబులోను (2:32)
24➤ బ్రహ్మాండమైన ప్రతిమయొక్క రొమ్ము, భుజాల అర్థమేమిటి?
,=> మాదీయ-పారసీక (2:32,39)
25➤ బ్రహ్మాండమైన ప్రతిమయొక్క ఉదరం, తొడ ఏ దేశాన్ని సూచిస్తున్నాయి?
,=> గ్రీసుదేశం (2:32,39)
26➤ ప్రతిమయొక్క పాదాలు ఏ రాజ్యానికి సాదృశ్యం?
,=> రోమా (2:33,40)
27➤ దానియేలుకు నైవేద్య ధూపాలను పెట్టమని ఆజ్ఞాపించినదెవరు?
,=> నెబుకద్నెజరు (2:46)
28➤ బబులోను ప్రధానిగా ఉన్నత పదవికి చేరిన ప్రవక్త ఎవరు?
,=> దానియేలు (2:48)
29➤ దానియేలు ఎక్కడ జీవించాడు?
,=> రాజు సముఖమున (2:49)
30➤ బంగారు ప్రతిమను చేయించినదెవరు?
,=> నెబుకద్నెజరు (3:1)
31➤ రాజు తయారుచేయించిన ప్రతిమ ఎత్తు ఎంత?
,=> అరవై మూరలు (3:1)
32➤ ఆ ప్రతిమను ఎక్కడ నిలబెట్టారు?
,=> దూరా మైదానములో (3:1)
33➤ రాజు ప్రతిమను ఆరాధించని వారికి శిక్ష ఏమిటి?
,=> తక్షణమే అగ్ని గుండంలో పడవేయబడుట (3:6)
34➤ అగ్ని గుండంలోకి ఎవరు పడేయబడ్డారు?
,=> షడ్రకు, మేషాకు, అబెద్నగో (3:22)
35➤ అగ్ని గుండంలోని నాలుగవ వ్యక్తి ఎవరు?
,=> దేవుని కుమారుడు (3:25)
36➤ బబులోను అధిపతులుగా పదోన్నతి పొందినది ఎవరు?
,=> షద్రకు, మేషాకు, అబేద్నగో (3:30)
37➤ దేవుని అద్భుత క్రియలను గురించి ఏ రాజు ప్రకటించాడు?
,=> నెబుకద్నెజరు (4:1,2)
38➤ దానియేలును నెబుకద్నెజరు ఎలా సంబోధించాడు?
,=> శకునగాండ్ర అధిపతి (4:9)
39➤ భూమి మధ్యలో గొప్ప చెట్టు దర్శనం ఎవరికి కలిగింది?
,=> నెబుకద్నెజరు (4:10)
40➤ పరిశుద్ధ దేవుని ఆత్మ ఎవరిలో ఉంది?
,=> దానియేలు (4:18)
41➤ నెబుకద్నెజరు ఆలోచనలతో విస్మయము నొందినదెవరు?
,=> దానియేలు (4:19)
42➤ తన స్వశక్తితో, తన ఘనతకోసం నిర్మించుకొన్న నివాస స్థలాన్ని నెబుకద్నెజరు ఏమని పిలిచాడు?
,=> మహా బబులోను (4:30)
43➤ తన గర్వంవలన తన రాజ్యాన్ని కోల్పోయింది ఎవరు?
,=> నెబుకద్నెజరు (4:31)
44➤ పశువువలె గడ్డి తిన్నదెవరు?
,=> నెబుకద్నెజరు (4:32,33)
45➤ ఏ చక్రవర్తి దేహం ఆకాశ మంచుతో తడిసింది?
,=> నెబుకద్నెజరు (4:33)
46➤ ఏ రాజుకు మళ్ళీ బుద్ధి వచ్చింది?
,=> నెబుకద్నెజరు (4:36)
47➤ పరలోక దేవున్ని స్తుతించి కొనియాడిన చక్రవర్తి ఎవరు?
,=> నెబుకద్నెజరు (4:37)
48➤ నెబుకద్నెజరు వారసుడు ఎవరు?
,=> బెల్టస్సరు (5:1,2)
49➤ తన వెయ్యిమంది అధిపతులకు గొప్ప విందును ఏర్పాటు చేసిన రాజు ఎవరు?
,=> బెల్టస్సరు (5:1)
50➤ యెరూషలేము మందిరంనుండి తెచ్చిన బంగారు పాత్రల్లో ద్రాక్షారసాన్ని సేవించింది ఎవరు?
,=> బెల్టస్సరు (5:3)
51➤ గోడమీద ఒక చెయ్యి వ్రాయడం ఎవరు చూశారు?
,=> బెల్టస్సరు (5:5)
52➤ ఏ రాజు ఆలోచనతో మనస్సు కలవరపడింది?
,=> బెల్టస్సరు (5:6)
53➤ ఏరాజు నడుము కీళ్ళు వదులై, మోకాళ్ళు గడగడ వణుకుతు కొట్టుకొన్నాయి?
,=> బెల్టస్సరు (5:6)
54➤ రాజ కోట గోడమీద వ్రాయబడినది ఏమిటి?
,=> మెనే మెనే టెకెల్ ఉఫార్సీన్ (5:25)
55➤ ఏ రాజు దేవుని త్రాసులో తూచబడ్డాడు?
,=> బెల్టస్సరు (5:27)
56➤ ఎవరి రాజరికాన్ని లెక్కించినప్పుడు, అది తక్కువగా కనబడింది?
,=> బెల్టస్సరు (5:26,27)
57➤ ఏ ప్రవక్త ఊదారంగు వస్త్రాన్ని తొడుక్కొన్నాడు?
,=> దానియేలు (5:29)
58➤ దానియేలుకు ఊదారంగు వస్త్రాన్ని తొడిగి మెడకు బంగారు హారాన్ని వేయమని ఆదేశించింది ఎవరు?
,=> బెల్టస్సరు (5:29)
59➤ బబులోను రాజ్యంలో మూడవ అధికారిగా పదోన్నతి పొందింది ఎవరు?
,=> దానియేలు (5:29)
60➤ బబులోను మూడవ అధికారిగా దానియేలు పదోన్నతి పొందిన రాత్రే చంపబడినది ఎవరు?
,=> బెల్టస్సరు (5:30)
61➤ బెల్టస్సరు ఏ దేశం రాజు?
,=> కల్దీయులు (5:30)
62➤ బెల్టస్సరు తరువాత ఎవరు రాజైనారు?
,=> దర్యావేషు (5:31)
63➤ దర్యావేషు ఏ దేశం రాజు?
,=> మాదీయ దేశం (5:31)
64➤ దేశాన్ని పాలించడానికి అధిపతులను, ప్రధానులను ఏ రాజు నియమించాడు?
,=> దర్యావేషు (6:1)
65➤ ఎంతమంది అధిపతులను దర్యావేషు నియమించాడు?
,=> నూట ఇరవైమంది అధిపతులు (6:1)
66➤ ముగ్గురు ప్రధానుల్లోని ప్రవక్త ఎవరు?
,=> దానియేలు (6:2)
67➤ ప్రధానులు, అధిపతులందరిలోకెల్లా తన్నుతాను బుద్ధిగలవానిగా కనబరుచు కొన్నదెవరు?
,=> దానియేలు (6:3)
68➤ దేవుని పద్దతి విషయమందే గాని మరి ఏ విషయమందును లోపము కనుగొనబడలేని ప్రధాని పేరు ఏమిటి?
,=> దానియేలు (6:5)
69➤ రాజుకు ప్రార్థించని వారికి విధించే శిక్ష ఏమిటి?
,=> సింహం బోనులో పడేయబడుట (6:7)
70➤ రోజుకు మూడుసార్లు ప్రార్థించే అలవాటుగల ప్రవక్త ఎవరు?
,=> దానియేలు (6:10)
71➤ దానియేలు గురించి బహుగా వ్యాకులపడిన రాజు ఎవరు?
,=> దర్యవేషు (6:14)
72➤ సింహం గుహలో పడేయబడిన ప్రవక్త ఎవరు?
,=> దానియేలు (6:16)
73➤ ఒక ప్రవక్తవలన తన నిద్రను కోల్పోయిన రాజు ఎవరు?
,=> దర్యావేషు (6:18)
74➤ ప్రవక్తకోసం ఉపవాసంతో ప్రార్థించిన రాజు ఎవరు?
,=> దర్యావేషు (6:18)
75➤ దానియేలు యొక్క దేవునికి భయపడి ఆయన సముఖమున వణకాలని తన రాజ్యంలోని సకల ప్రజలకు ఉత్తరం వ్రాసిన రాజు ఎవరు?
,=> దర్యావేషు (6:26)
76➤ ఎవరి కాలంలో దానియేలుకు దర్శనం కలిగింది?
,=> బెల్టస్సరు (7:1)
77➤ సింహాసనాల దర్శనం ఏ ప్రవక్తకు కలిగింది?
,=> దానియేలు (7:9)
78➤ దానియేలు దర్శనంలో పక్షిరాజు రెక్కలు గల జంతువు పేరేమిటి?
,=> సింహం (7:4)
79➤ మానవ మనస్సు ఏ జంతువుకు ఇవ్వబడింది?
,=> సింహం (7:4)
80➤ దానియేలు దర్శనంలో మూడు ప్రక్కటెముకలను తన నోట్లో కలిగియున్న జంతువు ఏది?
,=> ఎలుగుబంటి (7:5)
81➤ 'కోట్ల కొలది మనుష్యులు ఆయనయెదుట నిలిచిరి' ఎవరి ఎదుట?
,=> మహా వృద్ధునియెదుట (7:9,10)
82➤ మహా పృద్ధుని ముందు ప్రవహించిన నది పేరేమిటి?
,=> అగ్నివంటి ప్రవాహం (7:10)
83➤ దర్శనాలవలన ఆత్మలో కలవరపడి దుఃఖపడిన ప్రవక్త ఎవరు?
,=> దానియేలు (7:15)
84➤ దేవుణ్ణి మహావృద్ధునిగా ఎవరు పిలిచారు?
,=> దానియేలు (7:21, 22)
85➤ దానియేలుకు ఎక్కడ దర్శనం కలిగింది?
,=> షూషను నగరులో (8:2,3)
86➤ దర్శనంలో దానియేలు ఏ నది తీరాన నిలబడ్డాడు?
,=> ఊలయి నది (8:3)
87➤ నది తీరాన రెండు కొమ్ములు కలిగి నిలబడిన రెండు పొట్టేళ్ళ దర్శనాన్ని ఎవరు చూశారు?
,=> దానియేలు (8:3)
88➤ కాళ్ళు నేలమీద మోపకుండా పడమటినుండి ఏ రకమైన జంతువు వచ్చింది?
,=> మేకపోతు (8:5)
89➤ ఒక పరిశుద్ధుడు మరొక పరిశుద్ధునితో మాట్లాడుతున్న స్వరాన్ని విన్నది ఎవరు?
,=> దానియేలు (8:13)
90➤ దర్శనంలో దానియేలు చూసిన దూత పేరు ఏమిటి?
,=> గాబ్రియేలు (8:16)
91➤ దూత దానియేలుతో ఎక్కడ మాట్లాడాడు?
,=> ఊలయి నది తీరాన (8:16)
92➤ దూత మాట్లాడుతున్నప్పుడు గాఢ నిద్రలోకి జారుకొన్నది ఎవరు?
,=> దానియేలు (8:18)
93➤ అనేకులను నీతిమార్గంలో త్రిప్పువారు ఎలా ప్రకాశిస్తారు?
,=> నక్షత్రాలవలె (12:3)
94➤ అంత్యకాలంవరకు ఏ గ్రంథం ముద్రవేయబడాలి?
,=> దానియేలు గ్రంథం (12:4)
95➤ నారబట్టలు వేసుకొని నీళ్ళ పైన ఆడుతున్న వ్యక్తిని ఎవరు చూశారు? ?
,=> దానియేలు (12:6)
96➤ దానియేలు గ్రంథంలో ఏ కాలం ముద్రించబడింది?
,=> 1290 రోజులు (12:11)
97➤ 'నీవు అంత్యకాలమువరకు నిలకడగా ఉండినయెడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు' అని ఎవరికి చెప్పబడింది?
=> దానియేలు (12:3)