1➤ ద్వితీయోపదేశకాండం రచయిత ఎవరు?
,=> మోషే
2➤ ఆకాశాన్ని తాకే ఎతైన పట్టణాలు ఎవరివి?
,=> అనాకీయులు (1:28)
3➤ అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలీయులు ఎక్కువ సేపు ఎక్కడ గడిపారు?
,=> కాదేషు (1:46)
4➤ ఇశ్రాయేలీయులు తమ ప్రయాణంలో అనేక రోజులపాటు ఏ పర్వతం చుట్టూ తిరిగారు?
,=> శేయీరు పర్వతం (2:1)
5➤ ఆహారాన్ని, నీళ్ళను కొనడానికి దేవుడు ఏ ప్రజల వద్దకు ఇశ్రాయేలీయులను నడిపించాడు?
,=> శేయీరు ప్రజలు (2:5-6)
6➤ ఉప్పు సముద్రానికి ఉన్న మరో పేరేమిటి?
,=> అరాబా సముద్రం (3:17)
7➤ సీయోను కొండకుగల మరో పేరేమిటి?
,=> హెర్మోను (4:48)
8➤ ఇశ్రాయేలులో ఏ గోత్రానికి భాగం గాని లేక స్వాస్థ్యంగాని లేదు?
,=> లేవీ (10:9)
9➤ జ్ఞానుల కన్నులకు గుడ్డితనం కలుగజేసేదేమిటి?
,=> లంచం (16:19)
10➤ ఏ జంతువు మూతికి చిక్కము వేయవద్దు?
,=> నూర్చే యెద్దు (25:4)
11➤ కనాను దేశంలోకి ప్రవేశించిన తరువాత మొదట ఇశ్రాయేలీయులు ఏమి చేశారు?
,=> దేవుని ధర్మశాస్త్ర వాక్యాలు వ్రాసివున్న పెద్ద రాళ్ళను పాతారు (27:2,3)
12➤ 'ఈ యొర్దానును నీవు దాటవు' అని దేవుడు ఎవరితో చెప్పాడు?
,=> మోషే (31:2)
13➤ ఆజ్ఞలు వ్రాసివున్న రాళ్ళను ఇశ్రాయేలీయులు ఎక్కడ నిలబెట్టారు?
,=> ఏబాలు కొండమీద (27:4)
14➤ దేవుడు ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యంగా ఇచ్చిన కనాను దేశాన్ని మోషే ఎక్కడనుండి చూశాడు?
,=> పిల్లె కొండ దగ్గర నెబో శిఖరం (34:1,2)
15➤ పారాను కొండనుండి ప్రకాశించినది ఎవరు?
,=> యెహోవా (33:2)
16➤ 'అతడు యెహోవాకు ప్రియుడు' అనే ప్రశంసను పొందుకొన్నదెవరు?
,=> బెన్యామీను (33:12)
17➤ మోషే ఎక్కడ మరణించాడు?
,=> మోయాబు దేశం (34:5)
18➤ మోషే శవాన్ని ఎవరు పాతి పెట్టారు?
,=> యెహోవా (34:6)
19➤ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన ప్రవక్త ఎవరు?
=> మోషే (34:10-12)