1➤ హోషేయ గ్రంథ రచయిత ఎవరు?
,=> హోషేయ
2➤ హోషేయ పేరుకు అర్థం ఏమిటి?
,=> ప్రభువు రక్షించును
3➤ హోషేయ తండ్రి ఎవరు?
,=> బెయేరి (1:1)
4➤ ఇశ్రాయేలు రాజైన యరోబాము కాలంలో ఉన్న ప్రవక్త ఎవరు?
,=> హోషేయ (1:1)
5➤ వ్యభిచారం చేయు స్త్రీని భార్యగా చేసుకొమ్మని దేవుడు ఏ ప్రవక్తకు చెప్పాడు?
,=> హోషేయ (1:2)
6➤ హోషేయ భార్య పేరు ఏమిటి?
,=> గోమెరు (1:3)
7➤ గోమెరు తండ్రి ఎవరు?
,=> దిబ్లయీము (1:3)
8➤ హోషేయ మొదటి కుమారుని పేరు ఏమిటి?
,=> యెఱ్ఱయేలు (1:4)
9➤ ఇశ్రాయేలు విల్లును దేవుడు ఎక్కడ విరిచాడు?
,=> యెఱ్ఱయేలు లోయలో (1:5)
10➤ హో షేయ కుమార్తె పేరు ఏమిటి?
,=> లోరూహామా (1:6)
11➤ లోరూహామా పేరు అర్థం ఏమిటి?
,=> జాలినొందనిది (1:6)
12➤ ఎవరి దినం మహా ప్రభావముగల దినంగా ఉంటుంది?
,=> యెత్రేయేలు (1:11)
13➤ ఇశ్రాయేలును ఆకర్షించి అరణ్యానికి తీసుకెళ్ళిన లోయ పేరు ఏమిటి?
,=> ఆకోరు లోయ (2:14,15)
14➤ నిరీక్షణ ద్వారంగా ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన లోయ ఏది?
,=> ఆకోరు లోయ (2:15)
15➤ విమోచింపబడిన ఇశ్రాయేలు దేవుణ్ణి ఏమని పిలుస్తుంది?
,=> భర్త (2:16)
16➤ వ్యభిచార స్త్రీని ప్రేమించిన ప్రవక్త ఎవరు?
,=> హోషేయ (3:1)
17➤ విగ్రహాలతో కలిసింది ఎవరు?
,=> ఎఫ్రాయిము (4:17)
18➤ ఎవరికి దేవుడు చిమ్మట పురుగువలె ఉన్నాడు?
,=> ఎఫ్రాయిము (5:12)
19➤ దేవుడు ఇశ్రాయేలువద్దకు ఎలా వచ్చాడు?
,=> వర్షంవలె (6:3)
20➤ పాపాత్ముల పట్టణంగా పేర్కొనబడింది ఏది?
,=> గిలాదు (6:8)
21➤ ఎవరికోసం దేవుడు కోత కాలాన్ని నియమించాడు?
,=> యూదా (6:11)
22➤ దేవుడు ఇశ్రాయేలువారికి స్వస్థతను కలుగజేసినప్పుడు ఎవరి దోషం, చెడుతనం బయలుపరుచబడుతుంది?
,=> ఎఫ్రాయిము, షోమ్రోను (7:1)
23➤ త్రిప్పివేయబడని అప్పము ఎవరు?
,=> ఎఫ్రాయిము (7:8)
24➤ బుద్ధిలేని పిరికి గుండెగల గువ్వ ఎవరు?
,=> ఎఫ్రాయిము (7:11)
25➤ పాపక్షమాపణ కోసం ఎఫ్రాయిము ఏమి చేసింది?
,=> బలిపీఠాలు కట్టుకొన్నది (8:11)
26➤ ఎగిరే పక్షి వంటిది ఏమిటి?
,=> ఎఫ్రాయిము కీర్తి (9:11)
27➤ విస్తారంగా వ్యాపించిన ద్రాక్షచెట్టుతో సమానం ఎవరు?
,=> ఇశ్రాయేలు (10:1)
28➤ యుద్ధం రోజున బేతర్బేలును పాడు చేసింది ఎవరు?
,=> షల్మాసు (10:14)
29➤ ఇశ్రాయేలు బాలుడై యుండగా అతన్ని ప్రేమించింది ఎవరు?
,=> దేవుడు (11:1)
30➤ గర్భంలో తన సహోదరుని మడిమెను పట్టుకొన్నది ఎవరు?
,=> యాకోబు (12:3)
31➤ తన బలంతో దేవునితో పోరాడినదెవరు?
,=> యాకోబు (12:3)
32➤ దూతతో పోరాడి జయాన్ని పొందుకొన్నదెవరు?
,=> యాకోబు (12:4)
33➤ మరణాన్ని, సమాధిని సవాలు చేసిన ప్రవక్త ఎవరు?
,=> హోషేయ (13:14)
34➤ ఇశ్రాయేలు ఏ పుష్పంవలె ఉంది?
,=> తామర పుష్పం (14:5)
35➤ ఎవరి విశ్వాస ఘాతుకం దేవునిచేత స్వస్థపరచబడుతుంది?
,=> ఇశ్రాయేలు (14:4)
36➤ ఏ చెట్టువలె ఇశ్రాయేలు సౌందర్యంగా ఉంది?
,=> ఒలీవ చెట్టు (14:6)
37➤ దేవుడు ఎలాంటి చెట్టువంటివాడు?
,=> చిగురు పెట్టు సరళ వృక్షం. (14:8)
38➤ దేవుని మార్గాలు ఎలాంటివి?
,=> చక్కనివి (14:9)
39➤ సరియైన మార్గంలో ఎవరు నడుస్తారు?
=> నీతిమంతులు (14:9)