1➤ యెషయా తండ్రి ఎవరు?
,=> ఆమోజు (1:1)
2➤ తన యజమాని దొడ్డి ఏ జంతువుకు తెలుసు?
,=> గాడిద (1:3)
3➤ తన యజమానెవరో తెలిసిన గృహ జంతువు ఏది?
,=> ఎద్దు (1:3)
4➤ 'రండి, మన వివాదము తీర్చుకొందము' అని ఎవరు ఇశ్రాయేలును పిలిచారు?
,=> యెహోవా (1:18)
5➤ ఎలా సీయోనుకు విమోచన కలుగుతుంది?
,=> నీతితో (1:27)
6➤ తమ పాపాన్ని మరుగుచేయకుండా బయలుపరిచేది ఎవరు?
,=> యెరూషలేము, యూదా (3:8,9)
7➤ ఇశ్రాయేలు ప్రజలను చెరకు నడిపించిందేమిటి?
,=> జ్ఞాన లోపం (5:13)
8➤ ఒక రాజు మరణించిన సంవత్సరంలోనే యెషయా దర్శనాన్ని చూశాడు. ఆ రాజు ఎవరు?
,=> ఉజ్జీయా (6:1)
9➤ సెరాపుకు ఎన్ని రెక్కలున్నాయి?
,=> సెరాపుకు ఎన్ని రెక్కలున్నాయి?
10➤ 'అపవిత్రమైన పెదవులు గలవాడను' అని ఏ ప్రవక్త చెప్పాడు?
,=> యెషయా (6:5)
11➤ 'నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవును?' అని దేవుడు ఎవరితో చెప్పాడు?
,=> యెషయా (6:8)
12➤ ఆహాజు రాజును ఎదుర్కోవడానికి యెషయాతోపాటు ఎవరు వచ్చారు?
,=> షెయార్యాషూబు (7:3)
13➤ ఆహాజుకు బదులుగా సిరియా రాజు ఎవరిని రాజుగా నియమించాలనుకున్నాడు?
,=> టాబెయేలు కుమారుణ్ణి (7:5,6)
14➤ “నీ దేవుడైన యెహోవావలన సూచన నడుగుము. అది పాతాళమంత లోతై నను సరే ఊర్ధ్వ లోకమంత ఎత్తైనను సరే” అని దేవుడు ఎవరితో చెప్పాడు?
,=> ఆహాజు (7:11)
15➤ 'నేను అడుగను. యెహోవాను శోధింపను' అని ఏ రాజు చెప్పాడు?
,=> ఆహాజు (7:12)
16➤ 'కన్యక గర్భవతియై కుమారుని కనును'. దేవుడు ఈ సూచన ఎవరికి ఇచ్చాడు?
,=> ఆహాజుకు (7:12,14)
17➤ క్రీస్తు జననం గురించి ప్రవచించినది ఎవరు?
,=> యెషయా (7:14)
18➤ పెరుగు, తేనె తిని జీవించేదెవరు?
,=> ఇమ్మానుయేలు (7:15)
19➤ ఇశ్రాయేలుకు విరోధంగా యెహోవా ఎక్కడనుండి జోరీగలను ఈలగొట్టి పిలిచాడు?
,=> ఐగుప్తు (7:18)
20➤ ఇశ్రాయేలుకు విరోధంగా కందిరీగలను యెహోవా ఎక్కడనుండి ఈ లగొట్టి పిలిచాడు?
,=> అష్నూరు (7:18)
21➤ యెహోవా కూలికి (అద్దెకు) ఏమి తీసుకొన్నాడు?
,=> మంగల కత్తి (7:20)
22➤ గొప్ప పలకను తీసుకొమ్మని దేవుడు ఏ ప్రవక్తతో చెప్పాడు?
,=> యెషయా (8:1)
23➤ పలకమీద యెషయా ఏమి వ్రాశాడు?
,=> మహేరు షాలాల్ హాష్ బజ్ (8:1)
24➤ బైబిలులో అతి పెద్ద పేరు ఏది?
,=> మహేరు షాలాల్ హాష్ బజ్ (8:1)
25➤ నరుకబడిన తరువాత కూడా మొద్దు మిగిలియుండే చెట్లు ఏవి?
,=> సింధూర, మస్తకి చెట్లు (6:13)
26➤ దేవుని కోపానికి సాధనమైన దండం ఎవరు?
,=> అష్నూరు (10:5)
27➤ పక్షిగూటివలె ప్రజల ఆస్తిని చిక్కించుకొన్న రాజు ఎవరు?
,=> అష్నూరు రాజు (10:14
28➤ ఏ బండవద్ద మిద్యానీయులు హతం చేయబడ్డారు?
,=> ఓరేబు బండ (10:26)
29➤ తన యుద్ధ సామాగ్రిని అష్వూరు రాజు పెట్టిన స్థలం పేరు ఏమిటి?
,=> మిక్మము (10:28)
30➤ ఏ రాజుయొక్క ప్రాంతం పారిపోయింది?
,=> సౌలు గిబ్యా (10:29)
31➤ ఎర్ర సముద్రాన్ని యెషయా ఏమని పిలిచాడు?
,=> ఐగుప్తు సముద్రం (11:15)
32➤ రాజ్యాలకు భూషణము మరియు కల్దీయులకు అతిశయాస్పదమైనది ఏది?
,=> బబులోను (13:19)
33➤ 'మేఘ మండలము మీది కెక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును' అని ఎవరు చెప్పారు?
,=> లూసిఫరు (14:12, 14)
34➤ పాడైపోయిన రెండు మోయాబు పట్టణాల పేర్లు ఏవి?
,=> ఆర్మోయాబు, కీర్మోయాబు (15:1)
35➤ ప్రలాపించడానికి వీలుగా ఎత్తైన దుర్గాలుగా మారిన పట్టణాల పేర్లను చెప్పండి?
,=> దీబోను, మేదెబా (15:2)
36➤ ఎడారులుగా మారిన నీటి సరస్సు ఏది?
,=> నిట్రము (15:6)
37➤ దేని నీళ్ళు రక్తంతో నిండుతాయి?
,=> దీమోను జలములు (15:9)
38➤ బహు గర్వంగల దేశంగా పేర్కొనబడిన దేశమేది?
,=> మోయాబు (16:6)
39➤ నాశనమను చీపురు కట్టతో తుడిచిపెట్టుకొని పోయే దేశం ఏది?
,=> బబులోను (14:22,23)
40➤ ఎవరు స్త్రీలవలె అవుతారు?
,=> ఐగుప్తీయులు (19:16)
41➤ ఎవరు దేవుని స్వాస్థ్యం?
,=> ఇశ్రాయేలు (19:25)
42➤ కాళ్ళకు చెప్పులు లేకుండా దిగంబరిగా నడచుకొంటూ వెళ్ళిన ప్రవక్త ఎవరు?
,=> యెషయా (20:2)
43➤ ఐగుప్తుకు, కూషుకు సూచనగా, సాదృశ్యంగా ఉన్న ప్రవక్త ఎవరు?
,=> యెషయా (20:3)
44➤ “కావలివాడా, రాత్రి ఎంత వేళైంది?” అనే పిలుపు ఎక్కడనుండి వస్తుంది?
,=> శేయీరు (21:11)
45➤ 'ఒక యేడాది లోగానే ... ప్రభావమంతయు నశించిపోవును' అని దేవుడు ఎవరితో చెప్పాడు?
,=> కేదారు (21:16)
46➤ యెషయాచేత గద్దింపబడిన రాజ భవంతి గృహ నిర్వాహకుడు ఎవరు?
,=> షెబ్నా (22:15,17)
47➤ 'యెహోవా కోవా నిన్ను వడిగా విసరివేయును' అని ఏ ప్రవక్త చెప్పాడు?
,=> యెషయా (22:17)
48➤ యూదా వంశస్థులకు తండ్రిగా ఎవరుంటారు?
,=> ఎల్యాకీము (22:20,21)
49➤ డెబ్బై సంవత్సరాలపాటు మరువబడిన పట్టణం ఏది?
,=> తూరు (23:15)
50➤ ఏది మత్తునివలె తూలుతున్నది?
,=> భూమి (24:20)
51➤ కర్రచేత దుళ్ళగొట్టబడేది ఏది?
,=> నల్లజీలకర్ర (28:27)
52➤ 'రాజు నీతినిబట్టి రాజ్య పరిపాలన చేయును' అని ఎవరు ప్రవచించారు?
,=> యెషయా (32:1)
53➤ ఏ పక్షిగూడు కట్టుకొని, గుడ్లు పెట్టి పొదిగి, నీడలో వాటిని పెడుతుంది?
,=> చిత్తగూబ (34:15)
54➤ గోడతట్టు తన ముఖాన్ని త్రిప్పి ప్రార్థించింది ఎవరు?
,=> హిజ్కియా (38:2)
55➤ రోగం నుండి కోలుకొన్న తరువాత పాట వ్రాసిందెవరు?
,=> హిజ్కియా (38:9)
56➤ 'మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను' అని చెప్పిందెవరు?
,=> హిజ్కియా (38:17)
57➤ హిజ్కియా పుండుమీద ఏమి పూయబడింది?
,=> అంజూరపు పండ్ల ముద్ద (38:21)
58➤ హిజ్కియా పుండుమీద అంజూరపు పండ్ల ముద్దను పూయమని ఎవరు చెప్పారు?
,=> యెషయా (38:21)
59➤ హిజ్కియా తన రోగం నుండి నయమైన తరువాత అతనికి ఎవరు పత్రికల ను, కానుకలను పంపారు?
,=> మరోదక్బలదాను (39:1)
60➤ 'నిశ్చయముగా జనులు గడ్డివంటివారే' అని ఏ ప్రవక్త చెప్పాడు?
,=> యెషయా (40:7)
61➤ ఎవరు నూతన బలాన్ని పొందుకొంటారు?
,=> యెహోవాకొరకు ఎదురు చూచువారు (40:31)
62➤ ఏ పక్షిబలం పొందుకొని రెక్కలతో పైకి ఎగురాలని ఎదురుచూస్తుంది?
,=> పక్షిరాజు (40:31)
63➤ అబ్రాహామును దేవుని స్నేహితునిగా పిలిచిన ప్రవక్త ఎవరు?
,=> యెషయా (41:8)
64➤ దేవుడు దేన్ని విరువడు?
,=> నలిగిన రెల్లును (42:3)
65➤ ద్వీపములు దేనికోసం కనిపెట్టుకొంటాయి?
,=> దేవుని బోధకోసం (42:4)
66➤ ఇశ్రాయేలుకు గల మరో పేరు ఏమిటి?
,=> యెషూరూను (44:2)
67➤ దేవుడు పాపాన్ని ఎలా తుడిచి పెడుతాడు?
,=> దట్టమైన మేఘంవలె (44:22)
68➤ 'నా మంద కాపరీ' అని దేవుడు ఎవరి గురించి చెప్పాడు?
,=> కోరేషు (44:28)
69➤ దేవునిచేత అభిషేకించబడిన పారసీక రాజు పేరేమిటి?
,=> కోరేషు (45:1)
70➤ రాజుల నడికట్లను విప్పడానికి దేవుడు ఎవరిని లేపాడు?
,=> కోరేషు (45:1)
71➤ దేవునిచేత బిరుదు ఇవ్వబడిన పారసీక రాజు పేరు ఏమిటి?
,=> కోరేషు (45:4)
72➤ దేవుడు భూమిని విస్తారంగా తెరచినప్పుడు భూమిమీద ఏమి ఫలించింది?
,=> రక్షణ (45:8)
73➤ 'దీర్ఘదేహులుగా పిలువబడిన ప్రజలు ఎవరు?
,=> సెబాయీయులు (45:14)
74➤ ఇశ్రాయేలును పరీక్షించడానికి దేవుడు వాడిన కొలిమి ఏమిటి?
,=> ఇబ్బంది కొలిమి (48:10)
75➤ ఇశ్రాయేలునుండి దేవుడు తీసివేసిన పాత్ర ఏమిటి?
,=> తూలిపడజేయుపాత్ర (51:22)
76➤ పర్వతంమీద ఎవరి పాదాలు సుందరములైనవి?
,=> సువార్తను ప్రకటించు వారి పాదాలు (52:7)
77➤ లేత మొక్కవలె ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలె పెరిగింది ఎవరు?
,=> క్రీస్తు (53:2)
78➤ గొడ్రాలికి దేవుడిచ్చే అద్భుతమైన వాగ్దానం ఏమిటి?
,=> పెండ్లి అయిన స్త్రీ పిల్లలకంటే ఎక్కువమంది పిల్లలు (54:1)
79➤ ఏ నిబంధన శాశ్వత నిబంధనగా ఉంటుంది?
,=> సమాధాన విషయమైన నిబంధన (54:10)
80➤ “మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి”. ఎవరిని వెదకాలి?
,=> యెహోవా (55:6)
81➤ “నా తలంపులు మీ తలంపులవంటివి కావు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు” అని చెప్పిందెవరు?
,=> యెహోవా దేవుడు (55:8)
82➤ నిష్ఫలంగా దేవుని వద్దకు తిరిగి రానిదేమిటి?
,=> దేవుని వాక్యం (55:11)
83➤ “నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును” ఇలా భావించేలా చేసేదేమిటి?
,=> మత్తునిచ్చే మద్యం (56:12)
84➤ వినయంగలవారి ప్రాణానికి, నలిగినవారి ప్రాణానికి దేవుడు ఏమి ఇస్తాడు?
,=> ఉజ్జీవానికి కావాల్సిన బలాన్ని (57:15)
85➤ ఎన్నడూ నెమ్మదిగా ఉండనిదేమిటి?
,=> కదులుతున్న సముద్రం (57:20)
86➤ కదులుతున్న సముద్రంవలె ఎవరున్నారు?
,=> భక్తిహీనులు (57:20)
87➤ వరదవలె ఎవరు వస్తారు?
,=> శత్రువు (59:19)
88➤ దేవుని ప్రజలు ఎలా ఎగిరిపోతారు?
,=> గువ్వ (పావురం)వలె (60:8)
89➤ 'యెహోవా నాటిన చెట్లు' అనే పేరు ఎవరికి పెట్టబడింది?
,=> సీయోనులో దుఃఖించువారికి (61:3)
90➤ తాను విమోచించిన ప్రజలకు ధరింపజేయడానికి దేవుడు ఎలాంటి వస్త్రాన్ని వాడుతాడు?
,=> నీతి అను పైబట్ట (61:10)
91➤ సమస్త ప్రజలముందు దేవుడు మొలిపింపజేసేది ఏమిటి?
,=> నీతి, స్తోత్రం (61:11)
92➤ దుర్జీతిపరుల నీతి క్రియలు ఎలా ఉన్నాయి?
,=> మురికిగుడ్డలవలె (64:6)
93➤ పశువులు పండుకొనే లోయ ఏది?
,=> ఆకోరు లోయ (65:10)
94➤ ఏది దేవుని సింహాసనం?
=> ఆకాశం (66:1)