1➤ యిర్మీయా స్వస్థలం ఎక్కడ?
,=> అనాతోతు (1:1)
2➤ యిర్మీయా తండ్రి ఎవరు?
,=> హిల్కీయా (1:1)
3➤ యూదా రాజైన యోషీయా కాలంలో ఉన్న ప్రవక్త ఎవరు?
,=> యిర్మీయా (1:2)
4➤ తల్లి గర్భంలో ఉండగానే ప్రవక్తగా నియమించబడిన వ్యక్తి ఎవరు?
,=> యిర్మీయా (1:5)
5➤ 'నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదు' అని దేవునితో ఎవరు చెప్పారు?
,=> యిర్మీయా (1:6)
6➤ నశింపజేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు నియమించబడిన ప్రవక్త ఎవరు?
,=> యిర్మీయా (1:10)
7➤ బాదాము చెట్టు కొమ్మ దర్శనం ఎవరికి కలిగింది?
,=> యిర్మీయా (1:11)
8➤ మసలుతున్న కుండ (బాస) దర్శనం ఎవరికి కలిగింది?
,=> యిర్మీయా (1:13)
9➤ దేవుడు ఎవరిని ఇనుప స్తంభముగా, ఇత్తడి గోడగా చేశాడు?
,=> యిర్మీయా (1:18)
10➤ వునికి ప్రథమ ఫలము ఎవరు?
,=> ఇశ్రాయేలు (2:3)
11➤ జీవజలముల ఊటయైన దేవున్ని ఎవరు విడిచిపెట్టారు?
,=> ఇశ్రాయేలు (2:13)
12➤ 'నీవే నన్ను పుట్టించితివి' అని ఇశ్రాయేలు దేనితో ఒప్పుకొంది?
,=> రాయి (2:26)
13➤ ఇశ్రాయేలు సహోదరి ఎవరు?
,=> యూదా (3:7)
14➤ నిరాకారంగా, శూన్యంగా ఉన్న భూమి దర్శనం ఎవరికి కలిగింది?
,=> యిర్మీయా (4:23)
15➤ మానవులనుండి దేవుడు వెదికేది ఏమిటి?
,=> యథార్ధత (5:1,3)
16➤ సముద్రానికి సరిహద్దు ఏమిటి?
,=> ఇసుక (సముద్రతీరం) (5:22)
17➤ ప్రజల మధ్యలో పరీక్షించువానిగా మరియు లోహపు తుంటగా దేవుడు ఎవరిని నియమించాడు?
,=> యిర్మీయా (6:27)
18➤ దేవుడు తన నామాన్ని నిలిపిన నివాస స్థలం ఏది?
,=> షిలోహు (7:12)
19➤ దేవుడు ఎవరిని తన సన్నిధినుండి వెళ్ళగొట్టాడు?
,=> ఎఫ్రాయిము (7:15)
20➤ ఏ దేవతకు ఇశ్రాయేలీయులు పిండి వంటలు చేశారు?
,=> ఆకాశరాణి దేవత (7:18)
21➤ బసకోసం ఆశించిన ప్రవక్త ఎవరు?
,=> యిర్మీయా (9:2)
22➤ గూటికి తిరిగి రావాల్సిన కాలం తెలిసిన పక్షులేమిటి?
,=> సంకుబుడి కొంగ, తెల్లగువ్వ, మంగలకత్తి పిట్ట, ఓదెకొరుకు (8:7)
23➤ 'నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక' అని ఆశించింది ఎవరు?
,=> యిర్మీయా (9:1)
24➤ కిటికీలగుండా భవంతుల్లోకి ప్రవేశించిందేమిటి?
,=> గిలాదు (8:22)
25➤ కాళ్ళు ఎక్కడ తడబడుతాయి?
,=> చీకటి కొండలలో (13:16)
26➤ కరువు కాలాన్ని గురించిన యెహోవా వాక్కును కలిగియున్న ప్రవక్త ఎవరు?
,=> యిర్మీయా (14:1)
27➤ 'కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుత పులి తన మచ్చలను మార్చుకొనగలదా?' అని అడిగింది ఎవరు?
,=> యిర్మీయా (13:23)
28➤ 'అయ్యో, నాకు శ్రమ, నా తల్లీ' అని మొరపెట్టిందెవరు?
,=> యిర్మీయా (15:10)
29➤ నక్కలవలె గాలి పీల్చే జంతువు ఏది?
,=> అడవి గాడిద (14:6)
30➤ వడ్డీకి బదులియ్యకుండ, ప్రజల దగ్గర వడ్డీకి బదులు తీసుకోకుండ ఉన్న ప్రవక్త ఎవరు?
,=> యిర్మీయా (15:10)
31➤ దేవుని మాటలు దొరకగా వాటిని తిన్నాను అని చెప్పిందెవరు?
,=> యిర్మీయా (15:16)
32➤ 'యుక్తిగల యోచన చేతము రండి'. ఎవరి గురించి?
,=> యిర్మీయా (18:18)
33➤ ఎగతాళి చేసేవారి సమూహంలో కూర్చొని సంతోషించనిది ఎవరు?
,=> యిర్మీయా (15:17)
34➤ ఎవరి పాపాలను దేవుడు ఇనుప గంటముతో వ్రాశాడు?
,=> యూదా (17:1)
35➤ పెట్టని గుడ్లను పొదిగే పక్షి ఏది?
,=> కౌజు పిట్ట (17:11)
36➤ న్యాయంగా ఆస్తిని సంపాదించుకోని వ్యక్తికి ఏ పక్షి సాదృశ్యం?
,=> కౌజు పిట్ట (17:11)
37➤ దేవునినుండి తొలగిపోయేవారి పేర్లు ఎక్కడ వ్రాయబడుతాయి?
,=> ఇసుకమీద (17:13)
38➤ కుమ్మరి ఇంటికి వెళ్ళిన ప్రవక్త ఎవరు?
,=> యిర్మీయా (18:3)
39➤ ఇశ్రాయేలు మేలుకోసం మాట్లాడాలని యెహోవా ముందు నిలబడినదెవరు?
,=> యిర్మీయా (18:20)
40➤ మట్టి కూజాను (కుండ) కొనాల్సింది ఎవరు?
,=> యిర్మీయా (19:1)
41➤ యాజకులతో, పెద్దలతో కలిసి యిర్మీయా బయటికి వెళ్ళిన గుమ్మం పేరు ఏమిటి?
,=> హర్సీతు గుమ్మం (19:2)
42➤ యిర్మీయా కాలంలో ఉన్న యాజకుడు ఎవరు?
,=> పషూరు (20:1)
43➤ యిర్మీయా ప్రవక్తను కొట్టిన యాజకుడు ఎవరు?
,=> పషూరు (20:2)
44➤ ఏ ప్రవక్తను చెరసాలలో బంధించారు?
,=> యిర్మీయా (20:2)
45➤ పషూరుకు యిర్మీయా ఇచ్చిన కొత్త పేరేమిటి?
,=> మాగోర్ మిస్సాబీబ్ (20:3)
46➤ యిర్మీయాకు విరోధంగా ఉన్న యాజకుని పేరు మరియు రాకుమారుని పేరు ఒక్కటే. ఆ పేరేమిటి?
,=> పషూరు (20:2; 21:1)
47➤ అబద్ద ప్రవచనాలు చెప్పినందుకు చెరలోకి వెళ్ళిన యాజకుడు ఎవరు?
,=> పషూరు (20:6)
48➤ తన పుట్టుక దినాన్ని శపించిన ప్రవక్త ఎవరు?
,=> యిర్మీయా (20:14)
49➤ సిద్కియా రాజుచేత యిర్మీయావద్దకు పంపబడిన యాజకుని పేరు ఏమిటి?
,=> జెఫన్యా (21:1)
50➤ తమకోసం ప్రార్థించమని యిర్మీయాను అడిగిన యాజకుడు ఎవరు?
,=> జెఫన్యా (21:1,2)
51➤ యెహోయాహాజు రాజును యిర్మీయా ఏమని పిలిచాడు?
,=> షల్లూఘు (22:11)
52➤ గాడిద పాతి పెట్టబడిన విధంగా ఏ రాజు పాతి పెట్టబడ్డాడు?
,=> యెహోయాకీము (22:18,19)
53➤ 'పనికిమాలిన ఘటము'గా పోల్చబడిందెవరు?
,=> కొన్యా (22:28)
54➤ అగ్ని, సుత్తేవలె ఏది ఉంటుంది?
,=> దేవుని వాక్యం (23:29)
55➤ యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన రెండు గంపల అంజూరపు పండ్ల దర్శనం ఏ ప్రవక్తకు కలిగింది?
,=> యిర్మీయా (24:1)
56➤ శిల్పకారులను, కంసాలులను చెరలో తీసుకొనిపోయింది ఎవరు?
,=> నెబుకద్నెజరు రాజు (24:1)
57➤ 'చేను దున్నబడునట్లు సీయోను దున్నబడును' అని ఎవరు ప్రవచించారు?
,=> మీకా (26:18)
58➤ హిజ్కియా కాలంలో యూదా ప్రజలకు ప్రవచించిన ప్రవక్త పేరు ఏమిటి?
,=> మీకా (26:18)
59➤ యిర్మీయావలె ప్రవచించిన ప్రవక్త ఎవరు?
,=> ఊరియా (26:20)
60➤ ఊరియా ప్రవక్తను చంపడానికి ప్రయత్నించిన రాజు ఎవరు?
,=> యెహోయాకీము (26:21)
61➤ సామాన్య ప్రజల సమాధిలో ఏ ప్రవక్త మృతదేహం పడేయబడింది?
,=> ఊరియా ప్రవక్త (26:23)
62➤ ఊరియా ప్రవక్తను చంపిందెవరు?
,=> యెహోయాకీము (26:23)
63➤ కాడిని, పలుపులను చేయించుకొని తన మెడకు తగిలించుకొన్నదెవరు?
,=> యిర్మీయా (27:2)
64➤ యిర్మీయాకు ఎవరు ప్రవచించారు?
,=> హనన్యా (28:1-4)
65➤ ఆమేన్ (ఆలాగున జరుగునుగాక) అని హనన్యా ప్రవక్తకు చెప్పిందెవరు?
,=> యిర్మీయా (28:6)
66➤ యిర్మీయా మెడమీద ఉన్న కాడిని తీసిందెవరు?
,=> హనన్యా (28:10)
67➤ అబద్ధ ప్రవచనానికి స్పందించకుండానే బయటికి వెళ్ళిపోయింది ఎవరు?
,=> యిర్మీయా (28:11)
68➤ యూదా ప్రజలమెడలమీద ఇనుప కాడిని ఉంచింది ఎవరు?
,=> యెహోవా (28:14)
69➤ యెహోవా అతన్ని పంపలేదని యిర్మీయా ఎవరితో చెప్పాడు?
,=> హనన్యా (28:15)
70➤ 'భూమిమీదనుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను' అని ఎవరిగురించి యిర్మీయా చెప్పాడు?
,=> హనన్యా (28:16)
71➤ బబులోను చెరలో ఉన్నవారికి పత్రికలను పంపిన ప్రవక్త ఎవరు?
,=> యిర్మీయా (29:2,3)
72➤ ఇశ్రాయేలు రాజు పేరు మరియు అబద్ద ప్రవక్త పేరు ఒక్కటే. అదేమిటి?
,=> ఆహాబు (29:21)
73➤ ఆహాబు రాజభవనంలో ఉన్న అబద్ద ప్రవక్త పేరు ఏమిటి?
,=> సిద్కియా (29:21; 1 రాజులు 22:11)
74➤ బబులోను రాజుచేత అగ్నిలో పడేయబడిన ప్రవక్తలు ఎవరు?
,=> సిద్కియా, ఆహాబు (29:23)
75➤ యిర్మీయాకు విరోధంగా ఉన్న అబద్ద ప్రవక్త ఎవరు?
,=> షెమయా (29:24,32)
76➤ తన స్వంత పేరుతో యాజకులందరికి పత్రికలను పంపిన అబద్ద ప్రవక్త ఎవరు?
,=> షేమయా (29:26)
77➤ పిచ్చిగా ప్రవచిస్తున్నాడని ఎవరి గురించి షెమయ చెప్పాడు?
,=> యిర్మీయా (29:26)
78➤ చెరకాలం సుదీర్ఘంగా ఉంది గనుక అక్కడే కాపురముండి ఇండ్లు కట్టుకొమ్మని సూచించినదెవరు?
,=> యిర్మీయా (29:28)
79➤ నేను నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక పుస్తకంలో వ్రాసియుంచుమని దేవుడు ఏ ప్రవక్తకు చెప్పాడు?
,=> యిర్మీయా (30:2,3)
80➤ దేవుడు తన ప్రజలకు సిద్ధపరచిన మేలును చూడలేని ప్రవక్త ఎవరు?
,=> షేమయ (29:32)
81➤ మహా రోధన ధ్వని, ఏడ్పు ఎక్కడనుండి వస్తుంది?
,=> రామా (31:15)
82➤ 'ప్రసవ వేదనపడు స్త్రీలవలె పురుషులందరును నడుముమీద చేతులుంచు కొనుటయు ... నాకు కనబడుచున్నదేమి?' అని ఎవరు అన్నారు?
,=> యిర్మీయా (30:6)
83➤ తన పిల్లలను గురించి ఏడుస్తున్నదెవరు?
,=> రాహేలు (31:15)
84➤ 'అతనిగూర్చి నా కడుపులో చాలావేదనగా నున్నది' ఎవరి గురించి?
,=> ఎఫ్రాయిము (31:20)
85➤ ఎక్కడ యిర్మీయా పొలాన్ని కొన్నాడు?
,=> అనాతోతు (32:8,9)
86➤ యిర్మీయా ప్రవక్తను చెరసాలలో వేసిన రాజు ఎవరు?
,=> సిద్కియా (32:2,5)
87➤ పొలాన్ని కొనమని ఏ ప్రవక్తకు తెలియజేయబడింది?
,=> యిర్మీయా (32:8)
88➤ పొలానికి సంబందించిన క్రయపత్రాన్ని యిర్మీయా ఎవరికి ఇచ్చాడు?
,=> బారూకు (32:12)
89➤ యెరూషలేముకు ఉన్న క్రొత్త పేరు ఏమిటి?
,=> యెహోవాయే మన నీతి (33:16)
90➤ యెహోవా సందేశాన్ని యిర్మీయా ఏ కుటుంబానికిచ్చాడు?
,=> రేకాబీయుల కుటుంబం (35:2)
91➤ యెహోవా మందిరంలోని ప్రక్క గదిలో త్రాగడానికి ద్రాక్షారసాన్ని ఇచ్చిన ప్రవక్త ఎవరు?
,=> యిర్మీయా (35:2)
92➤ ద్రాక్షారసం త్రాగడాన్ని తృణీకరించిన కుటుంబం ఏది?
,=> రేకాబు కుటుంబం (35:6)
93➤ ఎవరి కుటుంబంలో ఇండ్లు కట్టుకోవడంగాని, ద్రాక్షా వనాలుగాని, పొలాలు గాని లేవు?
,=> రేకాబు కుటుంబం (35:9)
94➤ యిర్మీయా పలికిన మాటలను వ్రాసినదెవరు?
,=> బారూకు (36:4)
95➤ యెహోవా మందిరంలోకి వెళ్ళకుండా నిర్భందించబడినది ఎవరు?
,=> యిర్మీయా (36:5)
96➤ తనకు బదులు యెహోవా మందిరానికి యిర్మీయా ఎవరిని పంపాడు?
,=> బారూకు (36:6)
97➤ ఎవరికి దూరంగా యిర్మీయా, బారూకులు దాక్కొన్నారు?
,=> యెహోయాకీము (36:19,30)
98➤ ఎవరి గదిలో లేఖనాలను వ్రాసిన పుస్తకం చుట్టను వారు పెట్టారు?
,=> ఎలీషామా గది (36:20)
99➤ యిర్మీయా పుస్తకాన్ని అగ్నిలో వేసి కాల్చిందెవరు?
,=> యెహోయాకీము (36:23)
100➤ దేవుడే దాచిన ప్రవక్త మరియు సేవకుని పేరు ఏమిటి?
,=> యిర్మీయా మరియు బారాకు (36:26)
101➤ ఎవరి శవం బయట పడవేయబడి పగలు ఎండపాలు, రాత్రి మంచుపాలైంది?
,=> యెహోయాకీము (36:30)
102➤ పాత గ్రంథం స్థానంలో యిర్మీయా వివరించిన ఆదేశాలు గల క్రొత్త గ్రంథాన్ని ఉత్పత్తి చేసిందెవరు?
,=> బారూకు/యిర్మీయా (36:32)
103➤ ప్రజల మధ్య స్వేచ్ఛగా వస్తూపోతూ సంచరించిన ప్రవక్త ఎవరు?
,=> యిర్మీయా (37:4)
104➤ తన స్వంత ఆస్థిని తీసుకోవడానికి తన ప్రజలవద్దకు ఎవరు వెళ్ళారు?
,=> యిర్మీయా (37:12)
105➤ బెన్యామీను గుమ్మానికి కావలివారి అధిపతి ఎవరు?
,=> ఇరీయా (37:13)
106➤ బెన్యామీను అధిపతులు ఏ ప్రవక్తను కొట్టారు?
,=> యిర్మీయా (37:15)
107➤ చెరసాల గోతిలో అనేక రోజులు ఉన్న ప్రవక్త పేరు ఏమిటి?
,=> యిర్మీయా (37:16)
108➤ 'యెహోవాయొద్దనుండి ఏ మాటనైనా వచ్చెనా?' అని రహస్యంగా అడిగిన రాజు ఎవరు?
,=> సిద్కియా (37:17)
109➤ రోజుకు ఒక రొట్టె ముక్కతోనే జీవించిన ప్రవక్త ఎవరు?
,=> యిర్మీయా (37:21)
110➤ సైనికులను నిరుత్సాహపరచువాడు అనే ఆరోపణను ఎదుర్కొన్నదెవరు?
,=> యిర్మీయా (88:4)
111➤ పెద్దలకు విరోధమైనదేది రాజు చేయడని పెద్దలకు చెప్పింది ఎవరు?
,=> సిద్కియా రాజు (38:5)
112➤ బురదమాత్రమే గల గోతిలోకి ఏ ప్రవక్తను దింపారు?
,=> యిర్మీయా (38:6)
113➤ ఏ రాజ కుమారునికి గోతి ఉంది?
,=> మల్కీయా (38:6)
114➤ యిర్మీయాను గోతిలో పడేశారనే సంగతిని రాజుకు తెలియజేసిందెవరు?
,=> ఎబెద్మెలెకు (38:7,8)
115➤ గోతిలోనుండి యిర్మీయాను రక్షించిందెవరు?
,=> ఎబెద్మెలెకు (38:12-14)
116➤ ఎక్కడ సిద్కియాను కల్దీయులు పట్టుకొన్నారు?
,=> యెరికో దగ్గరున్న మైదానములో (39:5)
117➤ యిర్మీయాను కాపాడటానికి రాజు ఎవరిని నియమించాడు?
,=> గెదర్య (39:14)
118➤ తన ప్రజల మధ్య నివాసం చేయడానికి యిర్మీయాకు ఏ రాజు అనుమతి నిచ్చాడు?
,=> నెబుకద్నెజరు (39:14)
119➤ యిర్మీయాను గోతిలోనుండి రక్షించినందుకు తన చెరనుండి మరియు బబులోను రాజునుండి తప్పించుకొన్న నపుంసకుడు ఎవరు?
,=> ఎబెద్మెలెకు (39:16)
120➤ చెరనుండి యిర్మీయాను విడుదల చేసినదెవరు?
,=> నెబూజరదాను (40:2)
121➤ తన తిరుగు ప్రయాణానికి బత్తెము, బహుమానము పొందినదెవరు?
,=> యిర్మీయా (40:5)
122➤ యూదా పట్టణాలమీదగవర్నరుగా బబులోను రాజు ఎవరిని నియమించాడు?
,=> గెదల్యా (40:5)
123➤ ఇష్మాయేలు తండ్రి ఎవరు?
,=> నెతన్యా (40:14)
124➤ యూదా పట్టణాలమీద గవర్నరైన గెదల్యా ఎక్కడ జీవించాడు?
,=> మిస్పా (40:6)
125➤ గెదల్యా తండ్రి ఎవరు?
,=> అహీకాము (40:6)
126➤ ఎవరితోపాటు యిర్మీయా ప్రజల మధ్యలో జీవించాడు?
,=> గెదల్యా (40:6)
127➤ గెదల్యాను హత్యచేయడానికి ఏ అమ్మోనీయ రాజు ప్రజలను పంపాడు?
,=> బయలీసు (40:14)
128➤ మిస్పాలో గెడల్యాతో రహస్యంగా మాట్లాడినదెవరు?
,=> యోహానాను (40:15)
129➤ రాజ వంశస్థుడు మరియు రాజు యొక్క ప్రధానుడైన వ్యక్తి ఎవరు?
,=> ఇష్మాయేలు (41:1)
130➤ నీతిమంతులను చంపి గోతిలో పడవేసిందెవరు?
,=> ఇష్మాయేలు (41:7)
131➤ రాజు కుమార్తెలను తీసుకెళ్ళిందెవరు?
,=> ఇష్మాయేలు (41:10)
132➤ కల్దీయులకు భయపడేలా యూదా ప్రజలను పురికొల్పినదెవరు?
,=> ఇష్మాయేలు (41:18)
133➤ మా అందరికోసం ప్రార్థించమని యూదా ప్రజలు ఏ ప్రవక్తను అడిగారు?
,=> యిర్మీయా (42:2)
134➤ “మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు” అని యిర్మీయాతో ఎవరు అన్నారు?
,=> యోహానాను (43:2)
135➤ ఐగుప్తుకు వెళ్ళమని యిర్మీయాను ఎవరు బలవంతం చేశారు?
,=> యోహానాను (43:6,7)
136➤ మట్టిలో పెద్దరాళ్ళని దాచిపెట్టిన ప్రవక్త ఎవరు?
,=> యిర్మీయా (43:9)
137➤ యిర్మీయా దాచిపెట్టిన రాయి మీదనే తన రాజ సింహాసనాన్ని ఉంచిన దెవరు?
,=> నెబుకద్నెజరు (43:10)
138➤ ఐగుప్తులో తన రాజ సింహాసనాన్ని పెట్టింది ఎవరు?
,=> నెబుకద్నెజరు (43:10)
139➤ గొర్రెల కాపరి తన వస్త్రాన్ని చుట్టుకొన్నట్లుగా నిరాటంకంగా ఐగుప్తు దేశాన్ని తనకు చుట్టుకొన్న రాజు ఎవరు?
,=> నెబుకద్నెజరు (43:12)
140➤ ఐగుప్తు గుళ్ళను అగ్నితో కాల్చినది ఎవరు?
,=> నెబుకద్నెజరు (43:13)
141➤ నెబుకద్నెజరు చేతికి దేవుడు అప్పగించిన ఐగుప్తు రాజు ఎవరు?
,=> ఫరోహోఫ్ర (44:30)
142➤ 'నాకు నెమ్మది దొరకదాయెను' అని యిర్మీయాతో ఎవరు చెప్పారు?
,=> బారూకు (45:3)
143➤ గొప్పవాటిని వెదకవద్దు అని యిర్మీయా ఎవరికి సలహానిచ్చాడు?
,=> బారూకు (45:5)
144➤ తన ప్రాణాన్ని బహుమానంగా పొందినదెవరు?
,=> బారూకు (45:5)
145➤ 'విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే. నీకు చికిత్స కలుగదు' అని ఏ దేశంతో దేవుడు చెప్పాడు?
,=> ఐగుప్తు (46:11)
146➤ 'యుక్త సమయాన్ని పోగొట్టుకొన్నాడని' ఏ రాజు గురించి చెప్పబడింది?
,=> ఐగుప్తు (46:17)
147➤ నివాసులు లేకుండా పాడైపోయిన దేశం ఏది?
,=> నొపు (46:19)
148➤ యిర్మీయాచేత అందమైన పెయ్యగా పిలువబడిన ప్రాంతం ఏది?
,=> ఐగుప్తు (46:20)
149➤ బోడితనం ఏ దేశంమీదికి వచ్చింది?
,=> గాజా (47:5)
150➤ యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు ఏమవుతాడు?
,=> శాపగ్రస్తుడవుతాడు (48:10)
151➤ తాను కక్కిన దాంట్లో పొర్లిన దేశం ఏది?
,=> మోయాబు (48:26)
152➤ కొండపేటు సందులలో గూడు కట్టుకొన్న పక్షి పేరేమిటి?
,=> గువ్వ (పావురం) (48:28)
153➤ ఏ పట్టణం నక్కలకు నివాస స్థలంగా మారుతుంది?
,=> హాసోరు (49:33)
154➤ ఒకరు వెదకినా ఎవరి దోషాలు కనబడకుండా పోతాయి?
,=> యూదా (50:20)
155➤ సర్వభూమిని కొట్టుతున్న సమ్మెటగా గుర్తింపు పొందిన దేశం ఏది?
,=> బబులోను (50:23)
156➤ ఇక ఎన్నడూ మేల్కోలేని శాశ్వత నిద్రను దేవుడు ఏ దేశానికిచ్చాడు?
,=> బబులోను (51:39)
157➤ యిర్మీయా గ్రంథాన్ని రాయితో కట్టి దాన్ని నదిలో పడేసినది ఎవరు?
=> శెరాయా (51:63)