1➤ మోషే మరణం గురించి దేవుడు ఎవరితో మాట్లాడాడు?
,=> యెహోషువతో (1:1)
2➤ 'ఏ మనుష్యుడును నీయెదుట నిలువలేక యుండును' అని దేవుడు ఎవరితో చెప్పాడు?
,=> యెహోషువ (1:5)
3➤ ఎవరి ఇంట్లో వేగులవారు/గూఢచారులు సమయం గడిపారు?
,=> రాహాబు (2:1)
4➤ మొర్దాను నది నీళ్ళు చీలి ఒక రాశివలె ఎక్కడ నిలబడ్డాయి?
,=> ఆదాము పురం (3:16)
5➤ కనాను దేశంలో ఇశ్రాయేలీయులు మొదట ఎక్కడ శిబిరం వేసుకొన్నారు?
,=> గిల్లాలు (4:19)
6➤ ఎర్ర సముద్రంవలె ఏ నదిని ఇశ్రాయేలీయులు ఎండిపోయేలా చేసి దాటారు?
,=> యొర్దాను నది (5:1)
7➤ ఇశ్రాయేలీయులనుండి ఐగుప్తు అవమానాన్ని దేవుడు ఎక్కడ దొర్లించాడు?
,=> గిల్గాలు (5:9)
8➤ ఎక్కడ ఇశ్రాయేలీయులు మన్నాను చివరిసారిగా పొందుకొన్నారు?
,=> గిల్గాలు (5:12)
9➤ శపించబడిన వస్తువులను తీసుకొన్నదెవరు?
,=> ఆకాను (7:1)
10➤ శపింపబడిన వస్తువులను ఆకాను ఎక్కడ దాచి పెట్టాడు?
,=> డేరా మధ్యలో (7:21)
11➤ ఎవరి పాపంవలన కుటుంబమంతా శిక్షించబడింది?
,=> ఆకాను (7:25)
12➤ ఇశ్రాయేలీయులు ఎవరిని రాళ్ళ గుట్టతో సమాధి చేశారు?
,=> ఆకాను (7:26)
13➤ ఆకాను ఎక్కడ చంపబడ్డాడు?
,=> ఆకోరు లోయ (7:26)
14➤ యొర్దాను నదిని దాటిన తరువాత యెహోషువ మొదటి బలిపీఠాన్ని ఎక్కడ నిర్మించాడు?
,=> ఏబాలు కొండ
15➤ ఎవరి పేరుమీద ధర్మశాస్త్రం పేర్కొనబడింది?
,=> మోషే (8:31)
16➤ సూర్యుణ్ణి, చంద్రుణ్ణి నిలిపిందెవరు?
,=> యెహోషువ (10:12)
17➤ సూర్యుడు అలాగే నిలిచింది ఎక్కడ?
,=> గిబియోను (10:12)
18➤ చంద్రుడు అలాగే నిలిచింది ఎక్కడ?
,=> అయ్యాలోను (10:12)
19➤ ఏ గుహలో ఐదుగురు రాజులు దాక్కొన్నారు?
,=> మక్కేదా గుహ (10:16)
20➤ అనేక అన్య రాజుల నాయకుడు ఎవరు?
,=> యాబీను (11:1)
21➤ లేవీయులకు దేవుడిచ్చిన స్వాస్థ్యం ఏమిటి?
,=> ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా (13:33)
22➤ కాలేబు తండ్రి ఎవరు?
,=> యెఫున్నె (14:6)
23➤ హెబ్రోను పదానికి అర్థమేమిటి?
,=> సహవాసం
24➤ కాలేబు సహోదరుని పేరేమిటి?
,=> కనజు (15:17)
25➤ కాలేబు కుమార్తె ఎవరు?
,=> అక్సా (15:16)
26➤ యూదయ ప్రాంతంలోని ఒక స్థలం పేరు మరియు ఆదాము కుమారుని పేరు ఒక్కటే. ఆ పేరేమిటి?
,=> కయీను (15:55)
27➤ తన తండ్రిని ఆశీర్వాదం కోసం అడిగిన కుమార్తె ఎవరు?
,=> అక్సా (15:19)
28➤ బేతేలుకు అంతకుముందున్న పేరేమిటి?
,=> లూజు (16:3) (ఆది 28:19)
29➤ స్వాధీనపరచుకొన్న దేశాన్ని పొందిన గోత్రం ఏది?
,=> దాను (19:47)
30➤ యెహోషువ తండ్రి పేరు మరియు హెబ్రీ భాషలోని ఒక అక్షరం ఒక్కటే. అదేమిటి?
,=> నూను (19:49)
31➤ ఇశ్రాయేలీయులతోపాటు స్వాస్థ్య భాగాన్ని పొందుకొన్న నాయకుని పేరు ఏమిటి?
,=> యెహోషువ (19:49)
32➤ ఆరు ఆశ్రయ పురాలు ఏవి?
,=> కెదెషు, షెకెము, హెబ్రోను, బేసెరు, రామోతు,గోలాను (20:7,8)
33➤ రెండు గోత్రాలవారు నిర్మించిన బలిపీఠం పేరేమిటి?
,=> ఏద (సాక్షి) (22:34)
34➤ ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలోకి ప్రవేశించక ముందు గతంలో కనానులో జీవించిన పితరుడు ఎవరు?
,=> అబ్రాహాము (24:3)
35➤ ఇశ్రాయేలును విడిపించడానికి దేవుడు ఎలాంటి పురుగులను పంపాడు?
,=> కందిరీగలు (24:12)
36➤ 'నేనునునాయింటివారును యెహోవాను సేవించెదము' అని ఎవరు చెప్పారు?
,=> యెహోషువ (24:15)
37➤ ఆకాను ఎక్కడ చంపబడ్డాడు?
,=> ఆకోరు లోయ (7:26)
38➤ యొర్దాను నదిని దాటిన తరువాత యెహోషువ మొదటి బలిపీఠాన్ని ఎక్కడ నిర్మించాడు?
,=> ఏబాలు కొండ
39➤ యెహోషువ ఇశ్రాయేలుతో ఎక్కడ నిబంధన చేశాడు?
,=> షెకెము (24:25)
40➤ యెహోషువ మరణించినప్పుడు అతని వయస్సు ఎంత?
,=> 110 సంవత్సరాలు (24:29)
41➤ యెహోషువ మృతదేహం ఎక్కడ సమాధి చేయబడింది?
,=> తిమ్న తెరహు (24:30)
42➤ ఐగుప్తునుండి ఇశ్రాయేలీయులు కనానుకు తిరిగొచ్చినప్పుడు వారు ఎవరి ఎముకలను తెచ్చారు?
,=> యోసేపు (24:32)
43➤ యోసేపు ఎముకలు ఎక్కడ పాతి పెట్టబడ్డాయి?
=> షెకెము (24:32)