1➤ కనానీయులపై పోరాడటానికి మొదట ఏ గోత్రం వెళ్ళింది?
,=> యూదా గోత్రం (1:2)
2➤ ఇశ్రాయేలీయులు ఏ రాజు కాలి బొటన వేళ్ళను కోశారు?
,=> అదోనీ బెజెకు (1:6)
3➤ డెబ్బైమంది రాజుల కాలి బొటన వేళ్ళను కోసిన రాజు ఎవరు?
,=> అదోనీ బెజెకు (1:7)
4➤ తనకు ఒక భాగాన్ని ఇవ్వమని తన తండ్రిని అడుగడానికి కాలేబు కుమార్తె దేనిమీద ప్రయాణించి వచ్చింది?
,=> గాడిద (1:14)
5➤ తనకు స్వాస్థ్యంగా కాలేబు పొందిన పట్టణం ఏది?
,=> హెబ్రోను (1:20)
6➤ ఎక్కడ ఇశ్రాయేలీయులు కన్నీళ్ళతో అర్పణను అర్పించారు?
,=> బోకీము (2:1,5)
7➤ 'ఏడ్పు' అనే అర్థమిచ్చే పదం ఏది?
,=> బోకీము (2:5)
8➤ దేవుడు ఇశ్రాయేలును ఎవరికి అమ్మాడు?
,=> కూష-నిషాతాయిము (3:8)
9➤ ఇశ్రాయేలులో మొదటి న్యాయాధిపతి ఎవరు?
,=> ఒల్నీయేలు (3:9)
10➤ ఎడమ చేతి వాటంగల రెండవ న్యాయాధిపతి ఎవరు?
,=> ఏహూదు (3:15)
11➤ మునుకోల కర్రతో 600 మంది ఫిలిష్తియులను చంపిన న్యాయాధిపతి ఎవరు?
,=> షమ్లరు (3:30)
12➤ దెబోరా భర్త ఎవరు?
,=> లప్పీదోతు (4:4)
13➤ ఇశ్రాయేలుకు న్యాయం దీర్చిన ప్రవక్తిని ఎవరు?
,=> దెబోరా (4:4,5)
14➤ సరళ వృక్షం క్రింద కూర్చొని ఇశ్రాయేలుకు న్యాయం దీర్చిన వ్యక్తి ఎవరు?
,=> దెబోరా (4:5)
15➤ యాబీను సేనాధిపతి ఎవరు?
,=> సీసెరా (42)
16➤ సీసెరా ఇంట్లోకి వెళ్ళి అతన్ని మేకులతో చంపిందెవరు?
,=> యావేలు (4:21)
17➤ ఇశ్రాయేలులో గాయని మరియు ప్రవక్తిని ఎవరు?
,=> దెబోరా (4:4, 5:1)
18➤ యెహోవాముందు పెల్లుబికిన పర్వతం ఏది?
,=> సీనాయి (5:5)
19➤ మరణ భయం లేకుండా ప్రాణాన్ని తృణీకరించుకొన్న జనం ఎవరు?
,=> జెబూలూను (5:18)
20➤ నక్షత్రాలు ఎవరికి విరోధంగా యుద్ధం చేశాయి?
,=> సీసెరా (5:20)
21➤ ఏ వాగు ప్రాచీన వాగుగా పేర్కొనబడింది?
,=> కీషోను వాగు (5:21)
22➤ 'బలముతో ఉదయించు సూర్యునివలె నుందురు' అని ఎవరి గురించి చెప్పబడింది?
,=> దేవుని ప్రేమించువారు (5:31)
23➤ గిద్యోను ఎవరి కుమారుడు?
,=> యోవాషు (6:11)
24➤ సూచనకోసం దేవుని అడిగిన న్యాయాధిపతి ఎవరు?
,=> గిద్యోను (6:17)
25➤ గిద్యోను చేసిన బలిపీఠానికి పెట్టబడిన పేరేమిటి?
,=> యెహోవా షాలోము (యెహోవా సమాధానకర్త) (6:24)
26➤ 'యెహోవా షాలోము' పదానికి అర్థం ఏమిటి?
,=> యెహోవా నా సమాధాన కర్త (6:24)
27➤ గిద్యోనుకు గల మరో పేరేమిటి?
,=> యెరుబ్బయలు (6:31,32)
28➤ భయపడి వణకుచున్నవారు ఏ కొండను విడిచి తిరిగి వెళ్ళాలి?
,=> గిలాదు కొండ (7:3)
29➤ గిద్యోను పనివాడు ఎవరు?
,=> పూరా (7:10)
30➤ బేతనికి అర్థం ఏమిటి?
,=> అంజూరపు ఫలాల ఇల్లు
31➤ గిద్యోను సహోదరులు ఎక్కడ చంపబడ్డారు?
,=> తాబోరు (8:18)
32➤ తమ రాజుగా ఉండాలని ఇశ్రాయేలీయులు ఆశించిన న్యాయాధిపతి పేరు ఏమిటి?
,=> గిద్యోను (8:22)
33➤ ఇశ్రాయేలుకు నిజమైన అధిపతి ఎవరు?
,=> యెహోవా (8:23)
34➤ తన స్వంత తండ్రి సమాధిలో పాతి పెట్టబడిన న్యాయాధిపతి ఎవరు?
,=> గిద్యోను (8:32)
35➤ అబీమెలెకు తండ్రి ఎవరు?
,=> యెరుబ్బయలు (9:1)
36➤ తన డెబ్బైమంది అబీమెలెకు సహోదరులను చంపిందెవరు?
,=> అబీమెలెకు (9:4, 5)
37➤ చెట్లతో తమ రాజును అభిషేకించినట్లుగా చెట్టును అభిషేకించే కథను గురించి చెప్పిందెవరు?
,=> యోతాము (9:7,8)
38➤ దేవదారు చెట్లకు ఏ ప్రాంతం పేరుగాంచింది?
,=> లెబానోను (9:15)
39➤ తలమీద తిరుగటి రాతిని పడేయడంవలన చనిపోయిందెవరు?
,=> అబీమెలెకు (9:53)
40➤ వేశ్య కుమారుడు, పరాక్రమంగల బలాఢ్యుడైన న్యాయాధిపతి ఎవరు?
,=> యెఫ్తా (11:1)
41➤ యెఫ్తా పేరుకు అర్థం ఏమిటి?
,=> తెరచువాడు
42➤ తన ఏకైక కుమార్తెను దేవునికి దహనబలిగా ఇవ్వాలని నిర్ణయించుకొన్నది ఎవరు?
,=> యెఫ్తా (11:39)
43➤ “నేను యెహోవాకు మాట యిచ్చి యున్నాను గనుక వెనుక తీయలేను”అని చెప్పిందెవరు?
,=> యెఫ్తా (11:35)
44➤ తన అరవైమంది పిల్లల పెండ్లికి ఏర్పాట్లు చేసిందెవరు?
,=> ఇబ్బాను (12:8,9)
45➤ సమ్సోను తండ్రి ఎవరు?
,=> మానోహ (13:2)
46➤ నాజీరు చేయబడిన న్యాయాధిపతి ఎవరు?
,=> సమ్సోను (13:7)
47➤ “మనము దేవున్ని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుము” అని చెప్పిందెవరు?
,=> మానోహ (13:21, 22)
48➤ సమ్సోను కొదమ సింహాన్ని ఎక్కడ చంపాడు?
,=> తిమ్నాతు (14:5, 6)
49➤ సింహం కళేబరంనుండి తేనెను తీసిందెవరు?
,=> సమ్సోను (14:8)
50➤ తన భర్త ముందు ఏడు రోజులపాటు ఏడ్చిందెవరు?
,=> సమ్సోను భార్య (14:17)
51➤ నక్కలతో ఫిలిప్తీయుల గోధుమ చేలను నాశనం చేసిందెవరు?
,=> సమ్సోను (15:4,5)
52➤ ఏ బండ సందులో సమ్సోను నివసించాడు?
,=> ఏతాము (15:8)
53➤ గాడిదయొక్క పచ్చి దవడ ఎముకతో ఫిలిష్తియులను చంపిందెవరు?
,=> సమ్సోను (15:15)
54➤ పూర్ణ హృదయంతో సమ్సోను ప్రేమించిన స్త్రీ పేరేమిటి?
,=> దెలీలా (16:4)
55➤ ఎవరి కండ్లను ఫిలిప్తీయులు ఊడదీశారు?
,=> సమ్సోను (16:21)
56➤ బ్రదికున్నప్పటి కంటే తాను చనిపోయే సమయంలో ఎక్కువ మందిని చంపిందెవరు?
,=> సమ్సోను (16:30)
57➤ తన స్వంత తల్లి డబ్బును అపహరించిన కుమారుడు ఎవరు?
,=> మీకా (17:1,2)
58➤ తన తండ్రికి యాజకునిగా మారిందెవరు?
,=> మీకా కుమారుడు (17:5)
59➤ న్యాయాధిపతుల కాలంలో యెహోవాముందు పరిచర్య చేసిందెవరు?
,=> ఫీనెహాసు (20:28)
60➤ ఏ గోత్రం ఇశ్రాయేలీయులలోనుండి కొట్టివేయబడింది?
=> బెన్యామీను (21:6)