
1➤ మార్కు సువార్త రచయిత ఎవరు?
,=> మార్కు
2➤ మార్కుకు ఉన్న మరో పేరేమిటి?
,=> యోహాను (అపొ.కా. 12:12,25)
3➤ మార్కు సువార్తలో ప్రస్తావించబడిన మొదటి ప్రవక్త ఎవరు?
,=> బాప్తిస్మమిచ్చు యోహాను (1:3)
4➤ మార్కు సువార్త యేసుక్రీస్తును ఎలా చూపిస్తుంది?
,=> సేవకునిగా
5➤ అరణ్యంలో ప్రజలకు బాప్తిస్మం ఇచ్చింది ఎవరు?
,=> బాప్తిస్మమిచ్చు యోహాను (1:4)
6➤ పాపక్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మాన్ని ఎవరు ఇచ్చారు?
,=> బాప్తిస్మమిచ్చు యోహాను (1:4)
7➤ చిన్న సువార్త పుస్తకం ఏది?
,=> మార్కు సువార్త
8➤ వంగి యేసు చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను అని చెప్పిందెవరు?
,=> బాప్తిస్మమిచ్చు యోహాను (1:7)
9➤ పరిశుద్ధాత్మతో ప్రజలకు బాప్తిస్మం ఇచ్చేది ఎవరు?
,=> యేసుక్రీస్తు (1:8)
10➤ యేసును అరణ్యంలోకి త్రోసుకొనిపోయింది ఎవరు?
,=> పరిశుద్దాత్ముడు (1:12)
11➤ అరణ్యంలో యేసు వేటితో కూడా ఉన్నాడు?
,=> అడవి మృగాలతో (1:13)
12➤ యేసు మొదట సువార్తను ఎక్కడ ప్రకటించాడు?
,=> గలిలయ (1:14)
13➤ 'కాలము సంపూర్ణమై యున్నది. దేవుని రాజ్యము సమీపించియున్నది? మారుమనస్సు పొంది సువార్త నమ్ముడి' అని ఎవరు చెప్పారు?
,=> యేసుక్రీస్తు (1:15)
14➤ 'నా వెంబడి రండి. నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదను' అని ఎవరు ఎవరితో చెప్పారు?
,=> పేతురు, అంద్రియతో యేసుక్రీస్తు చెప్పాడు (1:16, 17)
15➤ యేసు పిలిచినప్పుడు తమ వలలను బాగుచేసుకొంటున్నది ఎవరు?
,=> యాకోబు, యోహాను (1:16,17)
16➤ సమాజమందిరానికి వెళ్ళి అధికారం గలవానివలె ప్రసంగించింది ఎవరు?
,=> యేసు (1:22)
17➤ నలుగురు వ్యక్తులు మోసుకొచ్చిన పక్షవాయు రోగిని యేసు ఎక్కడ స్వస్థపరిచాడు?
,=> కపెర్నహూము (2:1)
18➤ 'కుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవి' అని ఎవరితో యేసు చెప్పాడు?
,=> పక్షవాయు రోగితో (2:5)
19➤ మత్తయికి గల మరో పేరు ఏమిటి?
,=> లేవి (2:14)
20➤ ఏపట్టణంలో లేవి పన్నులను తీసుకొంటున్నాడు?
,=> కపెర్నహూము (2:1, 14)
21➤ ధాన్యపు వెన్నులను ఎక్కడినుండి శిష్యులు తెంచారు?
,=> గలిలయ (2:23,27)
22➤ జెబెదయి కుమారులకు యేసు ఏమని పేరు పెట్టాడు?
,=> బోయనేర్లెసు (3:17)
23➤ 'ఉరిమెడువారుగా' పేర్కొనబడింది ఎవరు?
,=> యాకోబు, యోహాను (3:17)
24➤ యేసు పేతురును ఏమని పిలిచాడు?
,=> సీమోను (3:16)
25➤ 'బోయనేర్లెసు' పేరుకు అర్థం ఏమిటి?
,=> ఉరిమెడువారు (3:17)
26➤ 'గాలియు, సముద్రమును ఈయనకు లోబడుచున్నవి' అని ఎవరు చెప్పారు?
,=> శిష్యులు (4:41)
27➤ దయ్యాలచేత పట్టబడిన గెరా సేనుకు చెందిన వ్యక్తి పేరు ఏమిటి?
,=> సేన (5:9)
28➤ యేసు అద్భుతాన్ని గురించి దయ్యంపట్టిన వ్యక్తి ఎక్కడ ప్రకటించాడు?
,=> దెకపోలి (5:20)
29➤ తన కుమార్తె స్వస్థతకోసం యేసువద్దకు వచ్చిన సమాజ మందిరపు అధికారి ఎవరు?
,=> యాయీరు (5:36)
30➤ 'భయపడక నమ్మిక మాత్రముంచుమని' ఎవరితో యేసు చెప్పాడు?
,=> యాయీరు (5:36)
31➤ యాయీరు ఇంటికి యేసు వచ్చినప్పుడు ఆయనతోపాటు లోనికి వచ్చిన శిష్యులు ఎవరు?
,=> పేతురు, యాకోబు, యోహాను (5:37)
32➤ యాయీరు కూతురితో యేసు ఏమన్నాడు?
,=> తలీతాకుమీ (5:41)
33➤ 'తలీతాకుమీ' అనే పదానికి అర్థం ఏమిటి?
,=> చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నాను (5:41)
34➤ ఎక్కడ యేసు బలమైన అద్భుత కార్యాలను చేయలేకపోయాడు?
,=> తన స్వంత ప్రాంతంలో (6:1,5)
35➤ ఎవరినుండి యేసు శక్తిని పొందుకొన్నాడని హేరోదు భావించాడు?
,=> బాప్తిస్మమిచ్చు యోహాను (6:14)
36➤ వ్యభిచారానికి విరుద్ధంగా ప్రసంగించినందుకు ఎవరు చెరసాలలో బంధించబడ్డారు?
,=> బాప్తిస్మమిచ్చు యోహాను (6:17)
37➤ 'ఎప్పతా' అనే మాటకు అర్థం ఏమిటి?
,=> తెరువబడు (7:34)
38➤ బాప్తిస్మమిచ్చు యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడు అని ఏ రాజు చెప్పాడు?
,=> హేరోదు (6:20)
39➤ తన పుట్టిన రోజున విందు చేసుకొంది ఎవరు?
,=> హేరోదు (6:21)
40➤ 'నీకిష్టమైనది ఏదైనను నన్నడుగుము, నేను నీకిచ్చెదను' అని ఎవరితో ఎవరు చెప్పారు?
,=> తన కుమార్తెతో హేరోదు చెప్పాడు (6:22)
41➤ బాప్తిస్మమిచ్చు యోహాను తలను పళ్ళెములో పెట్టి ఇవ్వమని అడిగింది ఎవరు?
,=> హేరోదియ కుమార్తె (6:25)
42➤ చెరసాలలో ఎవరి శిరచ్ఛేదనం చేయబడింది?
,=> బాప్తిస్మమిచ్చు యోహాను (6:27)
43➤ యేసుచేత స్వస్థపడాలని సంత వీధుల్లో రోగులను ఎక్కడ పెట్టారు?
,=> గెన్నేసంతు (6:53,56)
44➤ యేసును ముట్టినవారంతా స్వస్థత పొందింది ఎక్కడ?
,=> గెన్నేసంతు (6:56)
45➤ వేషధారణకు విరోధంగా ప్రవచించిన పాత నిబంధన ప్రవక్త ఎవరు?
,=> యెషయా (7:6)
46➤ 'కొర్బాను' పదానికి అర్థం ఏమిటి?
,=> దేవార్పితం (7:12)
47➤ పిల్లల రొట్టె తీసికొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని' ఎవరితో ఎవరు చెప్పారు?
,=> సురోఫెనికయ గ్రీసు స్త్రీతో యేసు చెప్పాడు (7:26,27)
48➤ మార్కు సువార్తలో మాత్రమే ప్రస్తావించబడిన రెండు అద్భుతాలు ఏవి?
,=> చెవుడు, నత్తిగల వ్యక్తి స్వస్థత; బేత్సయిదా గ్రుడ్డివాని స్వస్థత (7:31-37; 8:22)
49➤ చెవుడుగల నత్తివాన్ని యేసు ఎక్కడ స్వస్థపరిచాడు?
,=> దెకపొలి ప్రాంతంలో (7:31)
50➤ ఎవరిని యేసు జన సమూహంలోనుండి బయటికి తీసుకెళ్ళి స్వస్థపరిచాడు?
,=> చెవుడుగల నత్తివాన్ని (7:33)
51➤ చెవుడుగల నత్తివానికి యేసు ఏమని చెప్పాడు?
,=> ఎప్పతా (7:34)
52➤ యేసు సమస్తమును బాగుగా చేసియున్నాడు అని ఎవరు వ్రాశారు?
,=> మార్కు (7:37)
53➤ నాలుగువేలమంది ప్రజలను యేసు ఎక్కడ పోషించాడు?
,=> దెకపొలి (7:31; 8:9)
54➤ ఆకాశంనుండి సూచక క్రియను చూపమని యేసును ఎవరడిగారు?
,=> పరిసయ్యులు (8:11)
55➤ మనుష్యులు చెట్లవలె నడవడం గ్రుడ్డివానికి ఏ స్థలంలో కనబడింది?
,=> బేత్సయిదా (8:22,24)
56➤ ఎవరికి తెలియకూడదనే ఉద్దేశంతో ఎక్కడ యేసు ప్రయాణం చేశాడు?
,=> గలిలయ (9:30)
57➤ ఒకవేళ నీ కన్ను పాపం చేయడానికి పురికొల్పితే కండ్లను ఏమి చేయాలని యేసు చెప్పాడు?
,=> తీసిపారవేయుము (9:47)
58➤ యేసు మాటల ప్రకారం దేవుని రాజ్యం ఎవరివలె ఉంది?
,=> చిన్న బిడ్డలవలె (10:14)
59➤ ఎవరైనా గొప్పవాడై యుండగోరితే వాడు ఎలా ఉండాలి?
,=> పరిచారకునిగా ఉండాలి (10:43)
60➤ తనవద్దకు యేసు పిలిచిన గ్రుడ్డివాడు ఎవరు?
,=> బర్తిమయి (10:46,49)
61➤ బర్తిమయి తండ్రి ఎవరు?
,=> తీమయి (10:46)
62➤ యేసు బర్తిమయిని ఎక్కడ స్వస్థపరిచాడు?
,=> యెరికో (10:46-52)
63➤ 'బేత్పగే' పదానికి అర్థం ఏమిటి?
,=> ఫలించని అంజూరపు ఇల్లు (11:1)
64➤ యేసు చేసిన అద్భుతాల్లో నాశనకరమైన పని ఏమిటి?
,=> అంజూరపు చెట్టు ఎండిపోవుట (11:12, 14)
65➤ అంజూరపు చెట్టుమీద పండ్లు ఉంటాయేమోనని చూసిందెవరు?
,=> యేసు (11:13)
66➤ ఎండిపోయిన అంజూరపు చెట్టు గురించి ఏ శిష్యుడు తెలియజేశాడు?
,=> పేతురు (11:21)
67➤ సర్వాంగ హోమములకంటే, బలులకంటే అధికమైనది ఏమిటి?
,=> ప్రేమ (12:33)
68➤ కానుక పెట్టెలో బీద విధవరాలు ఎంత డబ్బు వేసింది?
,=> రెండు కాసులు (12:42)
69➤ మందిర కానుక పెట్టెలో తన జీవనమంతా వేసిందెవరు?
,=> బీద విధవరాలు (12:44)
70➤ కుష్ఠరోగియైన సీమోను ఇల్లు ఎక్కడ?
,=> బేతనియ (14:3)
71➤ యేసు తలమీద ఒక స్త్రీ ఎలాంటి అత్తరును పోసింది?
,=> అచ్చజటామాంసి అత్తరు (143)
72➤ తాను అభ్యంతరపడనని ఏ శిష్యుడు యేసుతో చెప్పాడు?
,=> పేతురు (14:29)
73➤ 'నీకు సమస్తమును సాధ్యము ఈ గిన్నె నాయొద్దనుండి తొలగించుము' అని ఎవరు ప్రార్ధించారు?
,=> యేసు (14:36)
74➤ “నీవు యూదుల రాజువా, కాదా' అని యేసును ఎవరు అడిగారు?
,=> పిలాతు (15:2)
75➤ కురేనీయుడైన సీమోను కుమారులు ఎవరు?
,=> అలెక్సంద్రు, రూపు (15:21, 22)
76➤ యేసు అక్రమకారులలో ఒకనిగా ఎంచబడునని ఎవరు ప్రవచించారు?
,=> యెషయా (15:28); (యెషయా 53:12)
77➤ పునరుత్థానం తరువాత యేసు మొదటగా ఎవరికి కనబడ్డాడు?
=> మగ్దలేనే మరియ (16:9)