1➤ జెకర్యా పేరుకు అర్థం ఏమిటి?
,=> యెహోవా జ్ఞాపకం చేసుకొనును
2➤ జెకర్యా తండ్రి ఎవరు?
,=> బెరక్యా (1:1)
3➤ ఏ రాజు కాలంలో జెకర్యా ప్రవచించాడు?
,=> దర్యావేషు (1:1)
4➤ జెకర్యా తాత ఎవరు?
,=> ఇదొకు (1:1)
5➤ ఎర్రని గుర్రాన్ని ఎక్కి స్వారీ చేస్తున్న మనిషి దర్శనాన్ని ఏ ప్రవక్త చూశాడు?
,=> జెకర్యా (1:8)
6➤ ఇశ్రాయేలు వారిని, యెరూషలేము వారిని చెదరగొట్టిన నాలుగు కొమ్ముల దర్శనాన్ని ఎవరు చూశారు?
,=> జెకర్యా (1:18, 19)
7➤ నలుగురు కంసాలుల దర్శనం ఎవరికి కలిగింది?
,=> జెకర్యా (1:20)
8➤ తన చేతిలో కొలనూలు పట్టుకొన్న వ్యక్తి దర్శనాన్ని ఎవరు చూశారు?
,=> జెకర్యా (2:1)
9➤ మనుష్యులు, పశువులు విస్తారంగా ఉన్నందున ప్రాకారం లేని మైదానంగా ఉన్న పట్టణం ఏది?
,=> యెరూషలేము (2:4)
10➤ ఏ పట్టణానికి దేవుడు అగ్ని ప్రాకారంగా ఉంటాడు?
,=> యెరూషలేము (2:5)
11➤ ఏ ప్రధాన యాజకుని గురించి సాతాను యెహోవా దూత ఎదుట ఫిర్యాదు చేశాడు?
,=> యెహోషువ (3:1)
12➤ కాలుతున్న కట్టెవలె అగ్నిలోనుండి తీయబడిన వ్యక్తి ఎవరు?
,=> యెహోషువ (3:2)
13➤ యెహోవా దూత ఎదుట మురికి వస్త్రాలతో నిలబడిన ప్రధాన యాజకుడు ఎవరు?
,=> యెహోషువ (3:3)
14➤ ఎలాంటి వస్త్రాలతో దూత యెహోషువాను అలంకరించాడు?
,=> ప్రశస్త వస్త్రాలు (3:4,5)
15➤ తన నిద్రనుండి మేల్కొన్న వ్యక్తివలె మేల్కొన్నది ఎవరు?
,=> జెకర్యా (4:1)
16➤ 'శక్తిచేతనైనను, బలముచేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగును' అనే సందేశాన్ని ఎవరు పొందుకొన్నారు?
,=> జెకర్యా (4:7)
17➤ ఎవరికి పర్వతం అడ్డంగా ఉంది?
,=> జెరుబ్బాబెలు (4:7)
18➤ కృప కలుగునుగాక అనే కేకలతో పైరాయిని తెచ్చేది ఎవరు?
,=> జెరుబ్బాబెలు (4:7)
19➤ ఎవరి చేతిలో గుండు నూలు ఉండుట చూసి ప్రజలు సంతోషించారు?
,=> జెరుబ్బాబెలు (4:10)
20➤ ఎగిరే పుస్తక దర్శనం ఎవరికి కలిగింది?
,=> జెకర్యా (5:1)
21➤ భూమియంతటి మీదికి వెళ్ళే శాపాన్ని ఎవరు చూశారు?
,=> జెకర్యా (5:3)
22➤ కొలిచే తూము దర్శనం ఎవరికి కలిగింది?
,=> జెకర్యా (5:6)
23➤ జెకర్యా దర్శనంలో ఏ పక్షి రెక్కవలె ఇద్దరు స్త్రీలకు రెక్కలున్నాయి?
,=> కొంగ (5:9)
24➤ జెకర్యా దర్శనంలో చూసిన స్త్రీలకు ఇల్లు (సాల) ఎక్కడ కట్టబడింది?
,=> షీనారు దేశం (5:11)
25➤ రెండు ఇత్తడి పర్వతాల దర్శనం ఎవరికి కలిగింది?
,=> జెకర్యా (6:1)
26➤ ఎవరి ఇంటికి వెళ్ళమని దేవుడు జెకర్యాను ఆదేశించాడు?
,=> యోషీయా (6:10)
27➤ యోషీయా తండ్రి ఎవరు?
,=> జెఫన్యా (6:10)
28➤ కిరీటాన్ని ఎవరు చేశారు?
,=> జెకర్యా (6:11)
29➤ జెకర్యా తయారుచేసిన కిరీటం ఎవరి తలమీద పెట్టబడింది?
,=> యెహోషువ (6:11)
30➤ 'చిగురు' అని ఎవరి గురించి జెకర్యా చెప్పాడు?
,=> జెరుబ్బాబెలు (6:12)
31➤ యోషీయాకు ఉన్న మరో పేరు ఏమిటి?
,=> హేను (6:10,14)
32➤ హెబ్రీ క్యాలెండరులో తొమ్మిదవ నెల ఏమిటి?
,=> కిస్లేవు (7:1)
33➤ యెరూషలేము యొక్క క్రొత్త పేరు ఏమిటి?
,=> సత్యమును అనుసరించు పట్టణం (8:3)
34➤ యెహోవా పర్వతం ఏమని పిలువబడుతుంది?
,=> పరిశుద్ధ పర్వతం
35➤ 'మనుష్యులకు కూలి దొరకక యుండెను. పశువుల పనికి బాడిగ దొరకక పోయెను' అని ఎవరు చెప్పారు?
,=> జెకర్యా (8:10)
36➤ సిరియాలో ఏ ప్రాంతానికి విరోధంగా దేవోక్తి వచ్చింది?
,=> హద్రాకు (9:1)
37➤ ఇసుక రేణువులవలె వెండిని, వీదుల్లోని దుమ్మువలె బంగారాన్ని విస్తారంగా సమకూర్చుకొన్న దేశం ఏది?
,=> తూరు దేశం (9:3)
38➤ ఏ దేశంలో సంకర జనం (మిశ్రమ ప్రజలు) స్థిరపడుతారు?
,=> అదు (9:6)
39➤ యెహోవా పాలించినప్పుడు ఎ.నువారు ఎవరివలె ఉంటారు?
,=> యెబూసీయులవలె (9:7)
40➤ దేవుడు గాడిద నెక్కి వస్తాడని ఎవరు ప్రవచించారు?
,=> జెకర్యా (9:9)
41➤ యవ్వన పురుషులు, యవ్వన స్త్రీలు దేనిచేత ఆకర్షించబడుతారు?
,=> ధాన్యం మరియు క్రొత్త ద్రాక్షారసం (9:17)
42➤ కడవరి వాన కాలంలో దేవుడు ఏమి పుట్టిస్తాడు?
,=> మెరుపులు (10:1)
43➤ సమస్త ప్రజలకు బరువైన రాయిగా దేవుడు దేన్ని చేస్తాడు?
,=> యెరూషలేము (12:3)
44➤ 'కట్టెల క్రింది నిప్పులుగాను, పనల క్రింది దివిటీగాను' ఎవరిని దేవుడు చేస్తాడు?
,=> యూదా అధికారులను (12:6)
45➤ యెహోవా ఏ ఇంటివారిని మొదట రక్షిస్తాడు?
,=> యూదా ఇంటివారిని (12:7)
46➤ శక్తిహీనులైన ప్రజలు ఎవరివలె ఉంటారు?
,=> దావీదువలె (12:8)
47➤ దావీదు సంతతివారు ఎవరివలె ఉంటారు?
,=> దేవునివలె (12:8)
48➤ ఏ దేశ ప్రలాపాల (ఏడ్పులు)వలె యెరూషలేము ప్రలాపాలుంటాయి?
,=> హదద్రిమ్మోను (12:11)
49➤ హదద్రిమ్మోను ఏడ్పులు ఎక్కడ చోటుచేసుకొంటాయి?
,=> మెగిద్దాను (12:11)
50➤ యెహోవా ఎక్కడికి వచ్చును?
,=> ఒలీవ కొండమీదికి (14:4)
51➤ గుర్రాల యొక్క కళ్ళెములమీద ఏమి వ్రాయబడియుంది?
,=> యెహోవాకు ప్రతిష్ఠితము (14:20)
52➤ ఏ రాజు కాలంలో భూకంపం సంభవించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు భయపడి పారిపోయారు?
,=> ఉజ్జియా (14:5)
53➤ యెహోవా మందిరంలో ఎవరు ఉండరు?
=> కనానీయుడు (14:21)