1➤ సంఖ్యాకాండాన్ని వ్రాసిందెవరు?
,=> మోషే
2➤ సంఖ్యాకాండంలో ఎన్ని వచనాలున్నాయి?
,=> 1288
3➤ ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ లెక్కించబడ్డారు?
,=> సీనాయి అరణ్యం (1:19)
4➤ ఇశ్రాయేలీయుల్లో లెక్కించబడని గోత్రం ఏది?
,=> లేవీగోత్రం (1:47)
5➤ లేవీయుల పని ఏమిటి?
,=> ప్రత్యక్ష గుడారంలో పరిచర్య (1:50-54)
6➤ యూదాకు నాయకుడు ఎవరు?
,=> నయస్సోను (2:3)
7➤ ఇశ్శాఖారు గోత్రానికి నాయకుడు ఎవరు?
,=> నెతనేలు (2:5)
8➤ జెబూలూను గోత్రానికి నాయకుడు ఎవరు?
,=> ఏలీయాబు (2:7
9➤ దాను గోత్రానికి నాయకుడు ఎవరు?
,=> అహీయెజెరు (2:25)
10➤ ఏ పుస్తకంలో 'ఆమేన్' అనే పదం మొదటిసారిగా వాడబడింది?
,=> సంఖ్యాకాండం (5:22)
11➤ తలవెండ్రుకలను కత్తిరించడంనుండి నిషేధించబడినవారెవరు?
,=> నాజీరు వ్రతము చేసేవారు (6:1-5)
12➤ జ్యేష్ఠ పుత్రునికి బదులు అహరోను, అతని కుమారులకు ఇవ్వబడిన గోత్రం ఏమిటి?
,=> లేవీ గోత్రం (8:17-19)
13➤ దేవునికోసం ప్రత్యేకించబడి ఎన్నుకోబడిన గోత్రం ఏది?
,=> లేవీగోత్రం (8:12)
14➤ ఇశ్రాయేలీయులు దూర ప్రయాణంలో ఉన్నాకూడా ఆచరించాల్సిన పండుగ ఏది?
,=> యెహోవా పస్కా పండుగ (9:10)
15➤ ప్రత్యక్ష గుడారంతో ఇశ్రాయేలీయులు తమ ప్రయాణాన్ని ఎక్కడ మొదలు పెట్టారు?
,=> సీనాయి అరణ్యం (10:13)
16➤ సీనాయినుండి మొదలైన తరువాత మేఘం ఎక్కడ ఆగింది?
,=> పారాను అరణ్యం (10:12)
17➤ 'నీవు మాకు కన్నులవలె ఉందువు' అని ఎవరి గురించి మోషే చెప్పాడు?
,=> హోబాబు (10:31
18➤ ఇశ్రాయేలీయులకు విశ్రాంతి స్థలాన్ని చూడటానికి వారి ముందు ఏమి వెళ్ళింది?
,=> యెహోవా నిబంధన మందసం (10:33)
19➤ శిబిరానికి బయట అగ్ని కొందరిని దహించింది ఎక్కడ?
,=> తబేరా అనే స్థలంలో (11:1-3)
20➤ ఆరంభంనుండి మోషేకు పరిచారకుడు ఎవరు?
,=> యెహోషువ (11:28)
21➤ మోషే గురించిన దేవుని సాక్ష్యం ఏమిటి?
,=> నమ్మకమైనవాడు (12:7)
22➤ కూషు దేశపు స్త్రీని తన భార్యగా కలిగియున్నందుకు మోషేకు విరోధంగా సణిగినదెవరు?
,=> అహరోను, మిర్యాము (12:1)
23➤ కనాను దేశాన్ని చూడటానికి మోషే ఎక్కడనుండి ప్రజలను పంపాడు?
,=> పారాను అరణ్యం (13:3)
24➤ కనాను దేశంలో సంచరించి చూడటానికి వారు ఎన్ని రోజులు తీసుకొన్నారు?
,=> 40 రోజులు (13:25)
25➤ కనాను దేశాన్ని పరిశీలించడానికి వెళ్ళిన వారిలో మంచి వార్తను తెచ్చిన ఇద్దరు వ్యక్తులు ఎవరు?
,=> యెహోషువ, కాలేబు (14:6,7)
26➤ అనాకీయుల సంతానం ఎక్కడ నివసిస్తుంది?
,=> హెబ్రోను (13:22)
27➤ పాలు, తేనెలు ప్రవహించే దేశంగా పేర్కొనబడిన స్థలం ఏది?
,=> కనాను (13:27)
28➤ ఇశ్రాయేలీయులు దేవున్ని ఎన్నిసార్లు పరిశోధించారు?
,=> పదిసార్లు (14:22)
29➤ 'మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించాడు' అనే మాట ఎవరి గురించి చెప్పబడింది?
,=> కాలేబు (14:24)
30➤ ఇరవై సంవత్సరాలకు పైబడిన వయస్సుగలవారిలో ఐగుప్తునుండి వచ్చి కనాను దేశంలోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులెవరు?
,=> యెహోషువ, కాలేబు (14,29,30)
31➤ “ఒక్క గాడిదనైనను వారియొద్ద నేను తీసికొనలేదు” అని ఎవరు చెప్పారు?
,=> మోషే (16:15)
32➤ బ్రతికుండగానే భూమిచేత మ్రింగబడిన వారెవరు?
,=> కోరహు, అతని సంబంధులు (16:31,32)
33➤ అగ్ని మధ్యలోనుండి ధూపారులను తీసినదెవరు?
,=> ఎలియాజరు (16:36)
34➤ బ్రతికినవారికి, చనిపోయినవారికి మధ్య ఎవరు నిలబడితే తెగులు ఆగింది?
,=> అహరోను (16:47,48)
35➤ ఎవరి కర్ర చిగిర్చి బాదాం చెట్టుగా మొలిసింది?
,=> అహరోను కర్ర (17:8)
36➤ తిరుగబడిన ప్రజలకు ఇవ్వబడిన సూచన ఏమిటి?
,=> అహరోను మొలిచిన కర్ర (17:10)
37➤ ఎవరికి యాజకత్వం ఒక వరంగా ఇవ్వబడింది?
,=> అహరోను సంతానానికి (18:7)
38➤ దశమ భాగంలో దశమభాగం ఇచ్చింది ఎవరు?
,=> లేవీయులు (18:26)
39➤ మిర్యాము ఎక్కడ చనిపోయి సమాధి చేయబడింది?
,=> కాదేషు (20:1)
40➤ ఒక కర్రతో రాయిని కొట్టినప్పుడు దానినుండి వచ్చిన నీళ్ళకు ఇవ్వబడిన పేరేమిటి?
,=> మెరీబా జలం (20:13)
41➤ అహరోనుకు బదులుగా ప్రధాన యాజకునిగా నియమించబడింది ఎవరు?
,=> ఎలియాజరు (20:26)
42➤ అహరోను ఎక్కడ మరణించాడు?
,=> హోరు కొండ (20:27,28)
43➤ ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి బాలాకు ఎవరిని తెచ్చాడు?
,=> బిలాము (22:5)
44➤ బాలాకు తండ్రి ఎవరు?
,=> సప్పోరు (22:2)
45➤ బిలాము తండ్రి ఎవరు?
,=> బెయోరు (22:5)
46➤ ఏ జంతువు మనిషివలె మాట్లాడింది?
,=> గాడిద (22:28)
47➤ 'నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు శపించబడుననియు నేనెరుగుదును' అని ఎవరన్నారు?
,=> బాలాకు (22:6)
48➤ 'ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే' అని ఎవరు ఎవరితో చెప్పారు?
,=> బాలాకుతో బిలాము చెప్పాడు (23:8)
49➤ 'ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును. జనములలో లెక్కింపబడరు' అని ఎవరిగురించి చెప్పబడింది?
,=> ఇశ్రాయేలు (23:9)
50➤ 'రేణువులను ఎవరు లెక్కించెదరు, అని ఎవరిగురించి చెప్పబడింది?
,=> యాకోబు (23:10)
51➤ 'నీతిమంతుల మరణమువంటి మరణము నాకు లభించునుగాక' అని ఎవరు చెప్పారు?
,=> బిలాము (23:10)
52➤ దుర్గంమీద నివాసస్థలాన్ని కట్టుకొన్నదెవరు?
,=> కేనీయులు (24:21)
53➤ ఒక ఇశ్రాయేలీయునిచేత చంపబడిన స్త్రీ ఎవరు?
,=> కొబ్బీ (25:14, 15)
54➤ నిత్యమైన యాజకత్వంకోసం ఎవరికి దేవుడు సమాధాన నిబంధనను ఒక ఆదేశంగా ఇచ్చాడు?
,=> ఫీనెహాసు (25:10-13)
55➤ మోషే కనానులో ఎందుకు ప్రవేశించలేకపోయాడు?
,=> మెరీబా నీళ్ళవద్ద తిరుగుబాటు చేసినందుకు (27:14)
56➤ మోషే మరణం తరువాత ఇశ్రాయేలుకు నాయకుడు ఎవరు?
,=> యెహోషువ (27:18)
57➤ యుద్ధానికి వెళ్ళిన యాజకుని పేరు చెప్పండి?
,=> ఫీనెహాసు (31:6)
58➤ యెహోవాను పూర్ణ మనస్సుతో అనుసరించిన వారెవరు?
,=> యెహోషువ, కాలేబు (32:11,12)
59➤ ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు సంచరించారు?
,=> 40 సంవత్సరాలు (32:13)
60➤ ఆశ్రయ పురాలు ఎన్ని? అవి దేనికోసం?
=> ఆరు. యాదృచ్ఛికంగా హత్యానేరం చేసినవాళ్ళని రక్షించడానికి (35:6)