1➤ ప్రింటింగ్ ప్రెస్ లో మొదటగా ప్రచురింపబడిన పుస్తకం ఏది?
,=> గుటెన్ బర్గ్ బైబుల్
2➤ ప్రింట్ చేయబడిన పుస్తకాల్లో ఏ పుస్తకం చాలా ఎక్కువ ధరకు అమ్ముడైంది?దాని వెల ఎంత?
,=> గుటెన్ బర్గ్ బైబుల్ పాత నిభందన (5.39 మిలియన్ USడాలర్లు)
3➤ అతి ప్రాచీన మైన బైబుల్ ప్రతులు ఎక్కడ కనుగొనబడ్డాయి?
,=> యెరూషలేములోని స్కాటిష్ చర్చి క్రింద దొరికాయి (అవి క్రీ.పూ. 587 కాలానికి చెందినవి)
4➤ అతి పురాతన బైబుల్ ప్రచురణ కర్త పేరు ఏమిటి?
,=> జెనీవా లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటి ప్రెస్
5➤ ప్రపంచంలోనే అతి పెద్ద బైబుల్ ఏది?
,=> ది వాటికన్ బైబుల్
6➤ ప్రపంచంలోనే అతి పెద్ద బైబుల్ ఏ భాషలో వ్రాయబడింది?
,=> హెబ్రీ భాష
7➤ ప్రపంచంలోనే అతి పెద్ద బైబుల్ బరువు ఎంత?
,=> 320 పౌండ్లు (145.5 కి.గ్రా.)
8➤ హిబ్రీ పాత నిభందన ఎలా విభజింపబడింది?
,=> 1)తోరా(ధర్మ శాస్త్రం) 2 ) నాబీమ్ (ప్రవక్తలు) 3) కేతుబీమ్ (వ్రాతలు)
9➤ మన పాత నిభందనలో 39 పుస్తకాలున్నాయి అయితే హెబ్రీ పాత నిభందనలో ఎన్ని పుస్తకాలున్నాయి?
,=> 24
10➤ "తలితాకుమీ" అనే మాట ఏ భాషకు చెందినది?
,=> అరామిక్
11➤ 'మమ్మోను' ఇది ఏ భాషో మీరు గుర్తించగలరా?
,=> అరామిక్
12➤ 'మరనాత' అనే ఈ పదం ఏ భాషనుండి వచ్చింది?
,=> అరామిక్
13➤ 'కెనాను' అనే పదానికి అక్షరార్థమేమిటో వ్రాయండి?
,=> రెల్లు
14➤ 'కెనాను' అనే పదానికి సహజంగా (వర్తించిన) అర్థం ఏమిటి?
,=> ప్రామాణికం, సూత్రం
15➤ 'అపోక్రిపా' అనే పదం ఎక్కడనుండి తీసుకోబడింది? దాని అర్థమేమిటి?
,=> అపోక్రిప్టో నుంచి సంగ్రహించబడిన దాని అర్థం 'దాగియుండుట'
16➤ మృత సముద్ర ప్రతులను ఎప్పుడు కనుగొన్నారు?
,=> 1947
17➤ బైబిలుకోసం ప్రాణాలర్పించిన తొలి హతసాక్షి, ఆంగ్ల బైబిలు పితామహుడు ఎవరు?
,=> విలియం టిండేల్
18➤ బ్రిటిష్ అండ్ ఫారెన్ బైబిలు సొసైటీ ఎప్పుడు రూపొందింది?
,=> 1804
19➤ మొట్టమొదటి పూర్తి తెలుగు బైబిలు ఏ సంవత్సరంలో ప్రచురించబడింది?
,=> 1854
20➤ నేడు బాగా వాడుకలో ఉన్న పునఃసమీక్షించబడిన తెలుగు బైబిలును బైబిలు సొసైటీ ఆఫ్ ఇండియా ఎప్పుడు ప్రచురించింది?
,=> 1953
21➤ మృత సముద్ర ప్రతులు ఎంత పెద్దవి?
,=> 24 అడుగుల పొడవు, 10 అంగుళాల వెడల్పు
22➤ మానవాళికి ఊయలగా పేర్కొనబడిందేమిటి?
,=> బబులోను
23➤ యేసు కాలంలో పాలస్తీనా వారి సామాన్య భాష ఏమిటి?
,=> అరామిక్
24➤ సిరియా ప్రాచీన భాష ఏమిటి?
,=> అరామిక్
25➤ పాత నిబంధనపై వ్రాయబడిన యూదుల సాంప్రదాయాలు, వ్యాఖ్యానాల సమాహారం ఏమిటి?
,=> టాల్మడ్
26➤ 'రాజ్య సువార్త'గా పేర్కొనబడిన బైబిలు గ్రంథం ఏది?
,=> మత్తయి సువార్త
27➤ చరిత్ర ప్రకారం పేతురు భార్య ఎవరు?
,=> కాన్ కోర్డియా లేక పెర్ పెట్యూ
28➤ ప్రాచీన సంఘంలో 'యాత్రికుని ప్రయాణంగా' గుర్తింపు పొందిన పుస్తకం ఏది?
,=> షెపర్డ్స్ ఆఫ్ హెర్మాస్
29➤ బంగారు నోరున్న వానిగా పేర్కొనబడిన సంఘ పితరుడు ఎవరు?
,=> జాన్ క్రిసోస్టమ్
30➤ లాటిన్ క్రైస్తవ్యానికి పితామహుడు ఎవరు?
,=> కార్రేజ్ వాడైన తెర్తూల్లియన్
31➤ సంఘ చరిత్ర పితామహునిగా ఎవరు పేర్కొనబడ్డారు?
,=> యూసీబియస్
32➤ పవిత్ర ఇశ్రాయేలు దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ముస్లింలపై క్రైస్తవులు చేసిన యుద్ధాలకు ఏ పేరు పెట్టబడింది?
,=> క్రూసేడ్లు
33➤ సంఘసంస్కరణ వేగుచుక్కగా పేరుపొందినది ఎవరు?
,=> జాన్
34➤ ప్రాచీన ఐగుప్తు భాషకు మూలం ఏమిటి?
,=> రోసెట్టా స్టోన్
35➤ 'బబులోను ఆదాము'గా పేర్కొనబడింది ఎవరు?
,=> ఆడాపా
36➤ అస్సిరియాలజీకి పితామహునిగా పేర్కొనబడింది ఎవరు?
,=> సర్ ఆస్టిన్ హెన్రీ లైర్డ్
37➤ ఇశ్రాయేలు పతనమైన కాలం?
,=> క్రీ.పూ. 722
38➤ యూదా పతనమైన కాలం?
,=> క్రీ.పూ. 586
39➤ చెర కాలంలో మొదలైన యూదుల ఆరాధన వ్యవస్థ ఏమిటి?
,=> సమాజ మందిరం (కలసి కూడుకోవడం అని అర్థం)
40➤ హెబ్రీ క్యాలెండరులో ఎన్ని రోజులున్నాయి?
,=> 354 రోజులు
41➤ ఉత్తర రాజ్యం (ఇశ్రాయేలు)నుండి వచ్చిన ప్రవక్తలు ఎవరు?
,=> హోషేయ, యోనా
42➤ చెర తరువాత ఉన్న ప్రవక్తలు ఎవరు?
,=> హగ్గయి, జెకర్యా, మలాకీ
43➤ మెల్కీసెదెకు ఎక్కడ నుండి వచ్చాడు?
,=> షాలోము
44➤ హాగరు ఎక్కడనుండి వచ్చింది?
,=> ఐగుప్తు
45➤ కన్ ఫెషన్స్: ఇది ఎవరి స్వీయ జీవిత చరిత్ర?
,=> హిప్పోకు చెందిన సెయింట్ అగస్టీన్
46➤ ఇంగ్లాండులోని జాతీయ సంఘం వ్యవస్థాపకుడు ఎవరు?
,=> రెండవ కింగ్ హెన్రీ
47➤ ప్రముఖ స్విస్ సంస్కరణవాది పేరు తెలియజేయండి?
,=> జాన్ కాల్విన్
48➤ మెథడిస్టు చర్చి వ్యవస్థాపకుల్లో ఒక వ్యక్తి ఎవరు?
,=> జాన్ వెస్లీ
49➤ చైనా ఇలాండ్ మిషను స్థాపించిన మిషనరీ ఎవరు?
,=> హడ్సన్ టేలర్
50➤ ఏ దినం పరిశుద్ధుల దినంగా పేర్కొనబడింది?
,=> నవంబరు 1
51➤ ఇంగ్లాండు చర్చికి ఉన్న మరో పేరేమిటి?
,=> ది ఆంగ్లికన్ చర్చి
52➤ రోమన్ క్యాథలిక్ చర్చి సాంప్రదాయం ప్రకారం మొదటి పోపు ఎవరు?
,=> సెయింట్ పీటర్ (పేతురు)
53➤ పునరుత్థాన సిద్ధాంతం ఏ వేదాంత శాఖ క్రిందికి వస్తుంది?
,=> ఎస్కటాలజీ (అంత్య సంగతులు)
54➤ 'వాట్ ఏ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్' అనే ఆంగ్ల పాట రచయిత ఎవరు?
,=> జోసెఫ్ స్టీవెన్
55➤ 'అమేజింగ్ గ్రేస్' అనే ఆంగ్ల పాట రచయిత ఎవరు?
,=> జాన్ న్యూటన్
56➤ 'బ్లెస్సెడ్ అష్యూరెన్స్' అనే ఆంగ్ల పాట రచయిత ఎవరు?
,=> ఫ్యానీ జె. క్రాస్బి
57➤ “దేర్ షల్ బి షావర్స్ ఆఫ్ బ్లెస్సింగ్' అనే పాట రచయిత ఎవరు?
,=> ఫ్యానీ క్రాస్సి
58➤ ఎవరి హింసలలో పేతురు, పౌలు హతసాక్షులైనారు?
,=> నీరో చక్రవర్తి
59➤ పోలీకార్ప్ హతసాక్షిగా మారినప్పుడు ఎవరు పాలిస్తున్నారు?
,=> హేడియన్ చక్రవర్తి
60➤ నైసియన్ క్రీడ్ ఎప్పుడు రూపొందించబడింది?
,=> క్రీ.శ 325
61➤ అకుల వృత్తి ఏమిటి?
,=> గుడారాలు కుట్టే వృత్తి
62➤ 'లాజరు' వృత్తి గురించి మీకు తెలిసిందేమిటి?
,=> బిచ్చగాడు
63➤ బైబిలులో మొదటగా పరదేశానికి మిషనరీగా వెళ్ళిందెవరు?
,=> యోనా
64➤ 'బైబిలు' అనే పదానికి అర్థం ఏమిటి?
,=> పుస్తకం
65➤ బైబిలు పదం ఏ గ్రీకు పదంనుండి తీసుకోబడింది?
,=> బిబ్లియో
66➤ బైబిలు అసలు ఏయే భాషల్లో వ్రాయబడింది?
,=> హెబ్రీ, అరామిక్, గ్రీకు
67➤ పాత నిబంధన ఏ భాషలో వ్రాయబడింది?
,=> హెబ్రీ
68➤ క్రొత్త నిబంధన ఏ భాషలో వ్రాయబడింది?
,=> గ్రీకు
69➤ బైబిలును ఆంగ్లంలోకి తర్జుమా చేసిందెవరు?
,=> జాన్ విక్లిఫ్
70➤ జర్మన్ భాషలోకి బైబిలును తర్జుమా చేసిందెవరు?
,=> మార్టిన్ లూథర్
71➤ పాత నిబంధన గ్రీకు తర్జుమాను ఏమని పిలుస్తారు?
,=> సెఫ్యూజింట్
72➤ బైబిలును మొదట ముద్రించిందెవరు?
,=> గుటెన్ బర్గ్
73➤ 'ఐఎస్ఆర్' పూర్తి రూపం ఏమిటి?
,=> ఈసస్ నజరేనస్ రెక్స్ యూదియోరం
74➤ బైబిలులో ఎన్ని వచనాలున్నాయి?
,=> 31,072
75➤ పాత నిబంధనలో ఎన్ని అధ్యాయాలున్నాయి?
,=> 929
76➤ క్రొత్త నిబంధనలో ఎన్ని అధ్యాయాలున్నాయి?
,=> 260
77➤ పాత నిబంధనలో ఎన్ని వచనాలున్నాయి?
,=> 20663
78➤ బైబిలు పుస్తకాలను అధ్యాయాలుగా విభజించిందెవరు?
,=> కార్డినల్ హ్యూగో
79➤ బైబిలు అధ్యాయాలను వచనాలుగా విభజించిందెవరు?
,=> రాబర్ట్ స్టీఫెన్
80➤ బైబిలులో అతి పెద్ద అధ్యాయమేది?
,=> కీర్తన 119
81➤ బైబిల్లో అతి పెద్ద వచనమేది?
,=> ఎస్తేరు 8:9
82➤ బైబిలులో అతి చిన్న అధ్యాయమేది?
,=> కీర్తన 117
83➤ పాత నిబంధనలోని ఏ పుస్తకంలో ఒకే ఒక అధ్యాయం ఉంది?
,=> ఓబద్యా
84➤ బైబిలులో మధ్యలోనున్న పుస్తకమేది?
,=> మీకా
85➤ బైబిలులో మధ్యలోనున్న అధ్యాయమేది?
,=> కీర్తన 117
86➤ బైబిలులో మధ్యలోనున్న వచనమేది?
,=> కీర్తన 118:8
87➤ పాత నిబంధనలో అతి చిన్న వచనం ఏది?
,=> 1 దిన. 1:1
88➤ క్రొత్త నిబంధనలో అతి చిన్న వచనం ఏది?
,=> యోహాను 11:35
89➤ స్త్రీల పేర్లతో పేర్కొనబడిన రెండు పుస్తకాలేమిటి?
,=> రూతు, ఎస్తేరు
90➤ ఒకే విధంగా ఉన్న రెండు కీర్తనలు ఏవి?
,=> 14, 53 కీర్తనలు
91➤ ఏ పత్రిక 'పత్రికల్లో రాణి'గా పిలువబడింది?
,=> ఎఫెసీ పత్రిక
92➤ "దేవుని" పేరును వాడని రెండు పుస్తకాలేవి?
,=> ఎస్తేరు, పరమగీతములు
93➤ పంచగ్రంథముగా పేర్కొనబడిన బైబిలు పుస్తకాలేవి?
,=> ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము
94➤ అతి పెద్ద సువార్త పుస్తకం ఏది?
,=> లూకా సువార్త
95➤ యూదుల బైబిలు ఏది?
,=> పాత నిబంధన
96➤ లాటిన్ భాషలో తర్జుమా చేయబడిన బైబిలును మనం ఏమని పిలుస్తాము?
,=> వరేట్
97➤ పంచగ్రంథ ( ధర్మశాస్త్ర) పుస్తకాల రచయిత ఎవరు?
,=> మోషే
98➤ హెబ్రీయుల పాటల పుస్తకంగా పేర్కొనబడిన బైబిలు గ్రంథం ఏది?
,=> కీర్తనలు
99➤ యొర్దాను నది ఎన్నిసార్లు చీల్చబడింది?
,=> మూడుసార్లు (యెహోషువ 3:15-17; 2 రాజులు 2:8, 14)
100➤ సండే స్కూలును మొదలుపెట్టిందెవరు?
,=> రాబర్ట్ రీక్స్
101➤ 'రబ్బీ' అను పదానికి అర్థం ఏమిటి?
,=> బోధకుడు
102➤ సంఘ సంస్కరణల కాలంగా పేర్కొనబడిన శతాబ్దం ఏది?
,=> 16వ శతాబ్దం.
103➤ భారతదేశంలో ప్రొటెస్టంటు మిషన్ కార్యక్రమాలు ఎప్పుడు మొదలైనాయి?
=> 1706