1➤ 1 తిమోతి పత్రిక రచయిత ఎవరు?
,=> పౌలు
2➤ విశ్వాసాన్నిబట్టి పౌలుకు నిజమైన కుమారుడు ఎవరు?
,=> తిమోతి (1:2)
3➤ 'పూర్వము దూషకుడు, హింసకుడు, హానికరుడునైన' వ్యక్తి ఎవరు?
,=> పౌలు (1:13)
4➤ పాపులలో ప్రధానుడైన అపొస్తలుడు ఎవరు?
,=> పౌలు (1:15)
5➤ మనస్సాక్షిని త్రోసివేసి విశ్వాస విషయంలో ఓడ బద్ధలైపోయిన వారివలె చెడిపోయినదెవరు?
,=> హుమెనై, అలెక్సంద్రు (1:19,20)
6➤ విశ్వాస, సత్యముల విషయములో అన్యజనులకు బోధకునిగా నియమించ బడిన అపొస్తలుడు ఎవరు?
,=> పౌలు (2:7)
7➤ 'శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును' అని చెప్పిందెవరు?
,=> పౌలు (4:8)
8➤ బహిరంగ లేఖన పఠనానికి తన్నుతాను సమర్పించుకొమ్మని పౌలు ఎవరికీ చెప్పాడు?
,=> తిమోతి (4:13)
9➤ సమస్త కీడులకు మూలం ఏమిటి?
,=> ధనాపేక్ష (6:10)
10➤ 'దైవజనుడా' అని పౌలు ఎవరిని సంబోధించాడు?
,=> తిమోతి (6:11)
11➤ ఎవరిముందు యేసు ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చాడు?
,=> పొంతి పిలాతు (6:13)
12➤ శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ఎవరు?
=> యేసుక్రీస్తు (6:15)