Q ➤ 1.“అక్కడ రాజసంరక్షక సేనాధిపతికి దాసుడైయుండిన యొక హెన్రీ పడుచువాడు ఉండెను" - ఎవరితడు?
Q ➤ 2. "వాడు బాల్యమునుండి యుద్ధాభ్యాసము చేసినవాడు."
Q ➤ 3. బేత్లహేములో కాపురమున్న "అతడు చాలా ఆస్తిపరుడు."
Q ➤ 4. ఒక ప్రసిద్ధిగాంచిన రాజుకు తండ్రియైన ఇతడు - " భాగ్యవంతుడగు ఒక బెన్యామీనియుడు."
Q ➤ 5. 'పరాక్రమశాలియైన యౌవనుడు" - ఎవరితడు?
Q ➤ 6. దావీదుకు బంధువైన ఒకనిగూర్చి ఇలా చెప్పబడింది - "వివేకముగల ఆలోచనకర్తయై యుండెను గనుక అతడు శా శాస్త్రిగా నియమింపబడెను."
Q ➤ 7. “ఒక చిన్న ఆడు గొఱ్ఱపిల్ల తప్ప ఏమియు లేని" - ఓ పేదవాడు!
Q ➤ 8. ఎవరు “పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభము" - అని ప్రభువైన యేసు చెప్పాడు?
Q ➤ 9. "ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడైయుండెను" అని ప్రభువైన యేసునుగూర్చి ఎవరు సాక్ష్యము చెప్పారు?
Q ➤ 10. ఈ "మనుష్యులు దుష్టులును యెహోవా దృష్టికి బహు పాపులునై యుండిరి" అని ఎవరినిగూర్చి చెప్పబడింది?
Q ➤ 11. మెలితే ద్వీపమునందు ముఖ్యుడు ఎవరు?
Q ➤ 12. యెరూషలేము సమావేశము పౌలు, బర్నబాలతో అంతియొకయకు ఇరువురు మనుష్యులను పంపినది. ఎవరువారు?
Q ➤ 13. "వాడు మంచివాడు, శుభవర్తమానము తెచ్చుచున్నాడు" - అని దావీదు ఎవరినిగూర్చి చెప్పాడు?
Q ➤ 14. “ఇతడు ఘనులైనవారిలో ఒకని కుమారుడు" అని నెహెమ్యా గ్రంథములో ఒకానొక ప్రధాని ప్రస్తావింపబడ్డాడు. ఎవరితడు?
Q ➤ 15. "మరణకాలమున అతడు చంపినవారి శవముల లెక్క జీవితకాల మందు అతడు చంపినవారి లెక్కకంటే ఎక్కువాయెను" అని ఓ మనుష్యునిగూర్చి చెప్పబడింది. ఎవరా మనుష్యుడు?