యోహాను సువార్త పై తెలుగు బైబుల్ క్విజ్
Yohan Suvartha Bible Quiz Answers in Telugu | Telugu Bible Quiz | Telugu Bible Quiz on John Book | Telugu Bible Quiz on John With Answers
1➤ యోహాను సువార్తలో ముఖ్యమైన వాక్యమేది?
2➤ నూతన నిబంధనలోని నాలుగవ గ్రంథమునకు రచయిత ఎవరు?
3➤ ఆదియందున్న వాక్యమేది?
4➤ బప్తిస్మ యోహానును ఎవరు పంపిరి?
5➤ తన్ను అంగీకరించిన వారందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఎవరు అధికారము అనుగ్రహించెను?
6➤ ఆ వాక్యము శరీరధారియై కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను అని చెప్పినదెవరు?
7➤ ఎవరివలన ధర్మశాస్త్రము ఇవ్వబడెను?
8➤ బప్తిస్మ యోహానును గురించి ఎవరు ప్రవచించిరి?
9➤ మేము మెస్సీయాను కనుగొంటిమని మొదటిగా చెప్పినదెవరు?
10➤ నీవు యోహాను కుమారుడవైన సీమోనువు నీవు కెఫా అనబడుదువని యేసు ఎవరి గురించి చెప్పెను?
11➤ కేఫా అను పదమునకు అర్థమేమి?
12➤ ఫిలిప్పు ఏ ప్రాంతమువాడు?
13➤ మోషేయు, ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి అని నతనయేలుతో చెప్పినదెవరు?
14➤ నతనయేలు అను పదమునకు అర్ధమేమి?
15➤ మంచిదేదైనా నజరేతునుండి రాగలదా? అని ఎవరు ప్రశ్నించిరి?
16➤ ఇదిగో యితడు ఇశ్రాయేలీయుడు నిజముగా ఇతనియందు ఏ కపటమును లేదు అని ఎవరిగురించి ఏసు చెప్పెను?
17➤ నిన్ను పిలువకమునుపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూసితినని ఎవరితో చెప్పెను?
18➤ ఏ వివాహమునకు యేసును ఆయన శిష్యులును పిలువబడిరి?
19➤ కానా ఎక్కడ వున్నది?
20➤ యేసు ఏ ప్రాంతమున నీటిని ద్రాక్షారసముగా మార్చెను?
21➤ తన మహిమను బయలుపరచుటకు యేసుచేసిన మొదటి అద్భుతమేది?
22➤ యేసును ఆయన సహోదరులును, తల్లియు, శిష్యులును కానానుండి ఎక్కడకు వెళ్ళిరి?
23➤ యెరూషలేము దేవాలయము కట్టుటకు ఎన్ని సంవత్సరములు పట్టెను?
24➤ యేసునొద్దకు వచ్చిన యూదుల అధికారి పేరు ఏమిటి?
25➤ నికోదేము అను పదమునకు అర్ధమేమి?
26➤ దేవుని రాజ్యము చూచుటకు ఒకడు ఏమి చేయవలసియున్నది?
27➤ ఒకడు నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. యేసు ఈ మాటలు ఎవరితో చెప్పెను?
28➤ యేసునొద్దకు వచ్చిన ఇశ్రాయేలు బోధకుని పేరేమి?
29➤ పరలోకమునకు ఎక్కిపోయినదెవరు?
30➤ అరణ్యములో సర్పమును ఎత్తినదెవరు?
31➤ దేవుని ఏక కుమారునియందు విశ్వాసముంచినవారికి ఏమి దొరుకును?
32➤ యెహోవా దేవుడు తన కుమారుని ఎందుకు ఈలోకమునకు పంపెను?
33➤ ఆయన హెచ్చింపవలసియున్నది. నేను తగ్గవలసియున్నది అని చెప్పినదెవరు?.
34➤ యేసు తన శిష్యులతో ప్రజలకు బప్తీస్మమిచ్చుటకు ఎచ్చటికి వెళ్ళెను?
35➤ యేసు యూదయాలో బాప్తీస్మము పొందుటకు వచ్చినప్పుడు యోహాను ప్రజలకు ఎక్కడ బప్తిస్మమిచ్చుచుండెను?
36➤ యేసునందు విశ్వాసముంచనివానికి ఏమి జరుగును?
37➤ యాకోబు తన కుమారుడికిచ్చిన స్థలము ఎక్కడవున్నది?
38➤ యేసు సమరయస్త్రీతో ఎక్కడ మాట్లాడెను?
39➤ యాకోబు త్రవ్వించిన బావి ఎక్కడ ఉన్నది?
40➤ సమరీయ స్త్రీ యేసుతో మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించిరి అని ఏ పర్వతమును గూర్చి చెప్పెను?
41➤ మెస్సీయ అను పదమునకు అర్థమేమి?
42➤ యేసే రక్షకుడని ఎవరు చెప్పిరి?
43➤ ఎక్కడ యేసు ఒక ప్రధాని కుమారుని స్వస్థతపరచెను?
44➤ యెరూషలేములోని గొట్టెల ద్వారము వద్దనున్న కోనేరు పేరేమి?
45➤ బెత్సతా అను పదమునకు అర్థమేమి?
46➤ వ్యాధిగల ఒక మనుష్యుడు బెత్సతా కోనేరువద్ద ఎన్ని సంవత్సరముల నుండి పడియుండెను?
47➤ బెత్సతా కోనేరులో ఎన్ని ద్వారములున్నవి?
48➤ మృతులు ఎవరి శబ్దమును విందురు?
49➤ తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడైయున్నాడో ఆలాగే కుమారుడు తనంతటతానే జీవముగలవాడై యున్నాడు ఎవరిని గూర్చి అన్నమాట ఇది?
50➤ ఎవరు మండుచు ప్రకాశించుచున్న దీపమైయుండెను?
51➤ ధర్మశాస్త్రము ప్రకారము మన మీద నేరము మోపువారెవరు?
52➤ ఏసు ఎవరితో తాను అయిదువేలమందికి భోజనము పెట్టించుటలో తాను చేయునున్న అద్భుతమును గురించి చర్చించెను?
53➤ జీవాహారము నేనే అన్నది ఎవరు?
54➤ పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమును నేనే, అన్నదెవరు?
55➤ "నీవు నిత్య జీవపుమాటలుగలవాడవు” అని పలికినదెవరు?
56➤ లోకమునకు నిన్ను నీవు బయల్పరుచుకొనుము, ఈ మాటలు యేసుతో అన్నదెవరు?
57➤ నీవు దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నాము. ఈ మాటలు ఎవరు చెప్పిరి?
58➤ యూదులకు ఏడవ పండుగ యేది?
59➤ పర్ణశాలల పండుగకు రహస్యముగా వెళ్ళినదెవరు?
60➤ ఎవడైనను దప్పికగొనినయెడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను అని యేసు ఎప్పుడు చెప్పెను?
61➤ నమ్మినవారి హృదయములలో ఏ నది ప్రవహించును?
62➤ లేఖనముల ప్రకారము యేసు ఎక్కడనుండి వచ్చును?
63➤ యేసుతో వాదించిన యూదుల అధికారి ఎవరు?
64➤ లోకమునకు వెలుగు ఎవరు?
65➤ శరీరమును బట్టి తీర్పు తీర్చువారెవరు?
66➤ మీరు సత్యమును తెలుసుకొనినచో ఆ సత్యము మిమ్ము స్వతంత్రులునుగా చేయును ఈ మాటలు ఎవరు చెప్పిరి?
67➤ ఎవరు అబద్దీకులు?
68➤ ఆదినుండి నరహంతకుడైనవాడెవడు?
69➤ నీవు సమరీయుడవు, దయ్యముపట్టినవాడవు అని యేసుతో పలికినదెవరు?
70➤ దేవుని మాటలు గైకొనినయెడల మన యొద్దకురానిది ఏది?
71➤ రాత్రి వచ్చుచున్నది. అప్పుడెవడును పనిచేయలేడు? అని చెప్పినదెవరు?
72➤ గ్రుడ్డివానికంటి పై బురదవేసి నీవు వెళ్ళి ఏ కోనేటిలో కడుగుకొనుమని ఏసు చెప్పెను?
73➤ సిలోయమనుకొనేటిలో కండ్లుకడుగుకొన్నవాడెవడు?
74➤ సిలోయము అను పదమునకు అర్ధమేమి?
75➤ దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎవరు అనిరి?
76➤ ఎవరి మనవులు దేవుడు ఆలకించడు?
77➤ ఎవరి స్వరమును గొట్టెలు వినును?
78➤ ఎవడు దొంగతనమును, హత్యను నాశనమును చేయుటకు వచ్చును?
79➤ ఎవరు మంచికాపరి?
80➤ తోడేలు వచ్చినప్పుడు గొట్టెలను విడిచి పెట్టిపారిపోవునదెవరు?
81➤ అతను దయ్యము పట్టినవాడు, వెట్టివాడు అని యేసును గూర్చి అనినదెవరు?
82➤ ఆలయ ప్రతిష్ట సమయమందు ఏ మంటపములో యేసు నడచెను?
83➤ ఎవరిని బట్టి బెతానియా గుర్తించబడినది?
84➤ లాజరు నివసించు ఊరు పేరేమి?
85➤ లాజరస్ అను పదమునకు అర్ధమేమి?
86➤ లాజరస్ సహోదరీలు ఎవరు?
87➤ బెతానియా గ్రామములో యేసు ప్రేమించిన వ్యక్తి ఎవరు?
88➤ యేసు తలపై సువాసనగల అత్తరు పూసి తన తలవెంట్రుకలతో ఆయన పాదములను తుడిచినదెవరు?
89➤ ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమపరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చెను ఎవరు ఎవరితో అని చెప్పిరి?
90➤ బెతానియాలో ఎవరి గృహమనిన యేసుకు ఇష్టము?
91➤ తోమాకుగల మరియొక పేరేమి?
92➤ ఆయనతోకూడ చనిపోవుటకు మనమును వెళ్ళుదమని ఏ శిష్యుడు చెప్పెను?
93➤ దేవుని మీరు ఏమి అడిగినను ఆయన మీకనుగ్రహించును అని చెప్పినదెవరు?
94➤ పునరుత్థానమును జీవమును అయినవారెవరు?
95➤ నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును ఈ మాటలు ఎవరివి?
96➤ ఏసు ఎచ్చట కన్నీళ్ళు విడిచెను?
97➤ అతనిని ఏలాగు ప్రేమించెనోచూడుడని ఎవరు అనిరి?
98➤ నీవు నమ్మిన యెడల దేవుని మహిమచూతువు, అని చెప్పినదెవరు?
99➤ ఎప్పుడు యేసు లాజరును లేపెను?
100➤ బంధించి చుట్టబడిన ప్రేత వస్త్రములతో సమాధిలోనుండి బయటకు వచ్చినదెవరు?
101➤ లాజరును సమాధి నుండి లేపినపుడు ప్రధాన యాజకుడెవరు?
102➤ క్రొత్త నిబంధనలో చెప్పబడిన ప్రధాన యాజకుడును మరియు ప్రవక్త ఎవరు?
103➤ చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు ఏసు చావవలసియున్నది. అని చెప్పినదెవరు?
104➤ యూదులు ఏసును చంపుటకు ప్రయత్నిస్తుండగా ఏసు రహస్యముగా ఎక్కడవుండెను?
105➤ ఈ సువాసనగల అత్తరును మూడువందల దీనారములకు అమ్మి బీదలకు ఇవ్వకూడదా అన్నదెవరు?
106➤ ఎవరివద్ద డబ్బు సంచి యున్నది?
107➤ ఏ చెట్టుకొమ్మలను చేత బట్టి ప్రభువు పేరిటవచ్చువాడు (రాజు) స్తుతింపబడునుగాక అని పాటలు పాడిరి?
108➤ ఏసును చూడగోరుచున్నామని గ్రీకులు ఎవరితో చెప్పిరి?
109➤ ఫిలిప్పుతో ఏసును చూడగోరుచున్నామని ఎవరు అడిగిరి?
110➤ ఏసు మహిమను చూచిన పాత నిబంధన ప్రవక్త ఎవరు?
111➤ ఎవరు దేవుని మెప్పుకంటె మనుష్యుల మెప్పును ఎక్కువగా ఆ పేక్షింతురు?
112➤ యూదా ఇస్కారియోతు తండ్రి ఎవరు?
113➤ ఏసును అప్పగించుమని యూదాను ప్రేరేపించినదెవరు?
114➤ శిష్యుల కాళ్ళు కడిగిన యజమానుడెవరు?
115➤ ప్రభువా నా పాదములు మాత్రమేకాక నా చేతులు, నాతల కూడా కడుగుమని ఏసుతో ఎవరుపలికిరి?
116➤ ఏసు తన శిష్యులందరికంటె ఎవరిని ఎక్కువగా ప్రేమించెను?
117➤ ఏసుయొక్క ఏ శిష్యుడు ఆయన రొమ్మున ఆనుకొనుచుండెను?
118➤ ఏసును ఎవరు అప్పగించనున్నారో అడిగి తెలిసికొని తమకు చెప్పమని సైగచేసి అడిగినదెవరు?
119➤ నీవు చేయుచున్నది త్వరగా చేయుమని ఎవరిని ఉద్దేశించి ఏసు అనెను?
120➤ రొట్టె ముక్కను పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళినదెవరు?
121➤ నీకొరకు నా ప్రాణమును పెట్టుదునని ఏసుతో ఎవరు అనిరి?
122➤ మీ హృదయములను కలవరపడనియ్యకుడి అని ఎవరు ఎవరితో అనిరి?
123➤ ఎవరి యింట అనేక నివాసములు మనము గమనించగలము?
124➤ "ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదు” అని ఎవరు అనిరి?
125➤ మార్గమును, సత్యమును, జీవమును అయి ఉన్నవారు ఎవరు?
126➤ ఎవరి ద్వారా ఒకరు తండ్రి యొద్దకు వెళ్ళగలరు?
127➤ ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము మాకంతేచాలును, అని అడిగినదెవరు?
128➤ యేసుక్రీస్తు నామమున పంపబడిన ఆదరణ కర్తఎవరు?
129➤ నా శాంతి మీకనుగ్రహించి వెళ్ళుచున్నాను అని ఎవరు చెప్పిరి?
130➤ “నేను నిజమైన ద్రాక్షావల్లిని” ఎవరు అనిరి?
131➤ ఏసు ద్రాక్షావల్లి, మనమంతా తీగలం మరి మన తండ్రియగు దేవుడేమైయున్నాడు?
132➤ ఎక్కువ ద్రాక్షపండ్లను పొందాలంటే ఏమిచేయవలసియుంటుంది?
133➤ దేవుని వాక్యము ప్రకారము మనము ఎలాయుండాలి?
134➤ నేను లేకుండ మీరేమియు చేయలేరు. ఈ మాటలు ఎవరివి?
135➤ మనము ఎక్కువగా ఫలించాలంటే ఎవరితో అంటుకట్టబడాలి?
136➤ పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు చెప్పేదెవరు?
137➤ సర్వసత్యమునకు మనలను ఎవరు నడిపించును?
138➤ నేను లోకమును జయించి యున్నాను. ఎవరు లోకమును జయించెను?
139➤ జగత్తు పునాది వేయబడకమునుపు నీవు నన్ను ప్రేమించితివి. తండ్రి ఎవరిని ప్రేమించెను?
140➤ నీవు నన్ను పంపితివని లోకము ఎరుగదు అని ఎవరు పలికిరి?
141➤ యేసు తన శిష్యులతో కూడ ఏ వాగును దాటిపోయెను?
142➤ యేసు తన శిష్యులతో కూడ ఏ తోటలోనికి వెళ్ళెను?
143➤ ప్రధానయాజకుని చెవి నరికినదెవరు?
144➤ కుడి చెవి నరకబడిన ప్రధానయాజకుని సేవకుని పేరేమిటి?
145➤ ఏసుని బంధించిన తరువాత మొదట ఆయనను ఎక్కడికి కొనిపోయిరి?
146➤ కైఫా మామ పేరేమి?
147➤ అందరికొరకు ఒకరు చంపబడుట మంచిదని ఎవరు సలహాయిచ్చిరి?
148➤ యేసు శిష్యులలో ఎవరిని గురించి ప్రధానయాజకునికి తెలియును?
149➤ ఏ యిద్దరు శిష్యులు ప్రధాన యాజకుని ఇంట ముంగిటవరకు వచ్చిరి?
150➤ ఎవరు పేతురును లోపలికి తీసుకొనిపోయెను?
151➤ అన్నా యేసును బంధింపబడియున్నట్లుగానే తీర్పు కొరకు ఎవరియొద్దకు పంపెను?
152➤ మీరతనిని తీసికొనిపోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడు అని ఎవరు చెప్పిరి?
153➤ సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని అందు నిమిత్తమే ఈలోకమునకు వచ్చితిని అని చెప్పినదెవరు?
154➤ యేసుకు శిలువ మరణశిక్ష విధించినపుడు పిలాతు ఏ న్యాయ పీఠముపై కూర్చుండెను?
155➤ యేసును సిలువ వేయునపుడు ఏ విధమైన దుస్తులు తొడిగించిరి?
156➤ ఎవరు యేసు తల పైన ముండ్లతో అల్లిన కిరీటమును ఉంచిరి?
157➤ ఇదిగో ఈమనుష్యుడు అని ఎవరు ఎవరిని గురించి అనిరి?
158➤ సిలువ వేయుటకును, విడుదల చేయుటకును ఎవరికి అధికారము కలదు?
159➤ నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపముకలదనెను. ఎవరు ఎవరితో ఈ మాటలు చెప్పిరి?
160➤ గబ్బతా అను మాటకు అర్థమేమి?
161➤ గొల్గొతా అను పదము ఏ భాషకు చెందినది?
162➤ నజరేయుడైన యేసు యూదులరాజు అని ఏభాషలో సిలువపై వ్రాసిరి?
163➤ నేను వ్రాసినదేమో వ్రాసితిని అని అన్నదెవరు?
164➤ వారు యేసు వస్త్రములను చీట్లు వేసి పంచుకొనిరి ఈ విషయమును ప్రవచించినదెవరు?
165➤ క్లోఫాస్ భార్య ఎవరు?
166➤ సిలువపై నుండి యేసు తన తల్లి బాధ్యతను ఎవరికి అప్పగించెను?
167➤ సిలువపై నుండి ఏసు పలికిన చివరిమాట యేది?
168➤ సిలువపై ఇంకను మరణించకవున్న నేరస్థులకాళ్ళు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు ఎవరిని అడిగిరి?
169➤ అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అని ఎవరు ప్రవచించిరి?
170➤ ఎవరు బల్లెముతో ప్రక్కలో పొడవబడిరి?
171➤ యేసు భూస్థాపన కార్యక్రమమునకు హాజరైన పారసీ అధికారి ఎవరు?
172➤ నూట యేబది శేర్ల యెత్తుగల పరిమళ ద్రవ్యమును అత్తరును యేసు శరీరమునకు పూయుటకు తెచ్చినదెవరు?
173➤ ఇంకను చీకటిగా ఉన్నప్పుడు యేసును ఉంచిన సమాధి యొద్దకు వారములో మొదటి రోజు వచ్చినదెవరు?
174➤ యేసు సమాధి వెలుపల నిలబడి విలపించిన స్త్రీ యెవరు?
175➤ ఏసు సమాధి యొద్దకు పరుగెత్తుకొనివచ్చిన ఇద్దరు శిష్యులు ఎవరు?
176➤ నా ప్రభువును ఎవరో ఎత్తుకొనిపోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు అని చెప్పినదెవరు?
177➤ ఏ శిష్యుడు మొదటిగా సమాధిలోనికి ప్రవేశించెను?
178➤ యేసు పునరుత్థానుడైన పిదప ఎవరికి మొదటిగా కనిపించెను?
179➤ రబ్బూని అను పదమునకు అర్థమేమి?
180➤ నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అని యేసు ఎవరితో అనెను?
181➤ యేసు పునరుత్థానుడైన తరువాత యేసును చూడని శిష్యుడెవరు?
182➤ నే నాయన చేతులలో మేకులగుర్తును చూచి నా లు ఆయన గాయములలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేకాని నమ్మను అనిన శిష్యుడెవరు?
183➤ నీ చెయ్యి చాచి ప్రక్కలో ఉంచి అవిశ్వాసివికాక విశ్వాసివై యుండుమని యేసు ఎవరితో అనెను?
184➤ యేసుని పునరుత్థానము తరువాత ఏ శిష్యుడు చేపలు పట్టుటకు వెళ్ళెను?
185➤ “పిల్లలారా, భోజనమునకు మీయొద్ద ఏమైన ఉన్నదా? అని యేసు ఎవరిని అడిగెను?
186➤ యేసును చూచి వస్త్రహీనుడై ఉన్నందున పై బట్టవేసుకొని సముద్రములో దూకినది ఎవరు?
187➤ యేసు మాటవిని వలలు వేసిన శిష్యులకు ఎన్ని చేపలు లభించెను?
188➤ మూడవమారు యేసు శిష్యులకు ఎక్కడకనబడెను?
189➤ నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అని యేసు ఎవరిని ప్రశ్నించెను?
190➤ ఏ ప్రశ్నను యేసు ముమ్మారు పేతురును అడిగెను?
191➤ నీవు యవ్వనస్తుడవైనప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి! అని యేసు ఎవరిని గూర్చి చెప్పెను?