Lekkaleni Papalu song

 లెక్కలేని పాపాలు (Lekkaleni Paapaalu)

పల్లవి:      లెక్కలేని పాపాలు భారమైన జీవితం 
              నూనెలేని దీపములా సాగుచున్న జీవితం
              పగిలి పోయిన మట్టిపాత్రను నేను నాధా
              మరలా నాకు పునర్జీవిత మొసగుమోనాధా  ||2|| ||లెక్క||
              కరుణ చూపుమా నాపై కనికరించుమా
              పాపిని నేను నాధా పాపినీ నేను ||2||
1.        పూర్వపాపపు శాపము మోయుచుండగా
           వ్యాధియు, బాధలు అధికమాయెను ||2||
దేవా దేవుని ఆత్మ నాలో నీర్జీవమై – పాపం నన్ను పాతాళ త్రోవలో చేర్చే
కరుణ చూపుమా నాపై కనికరించుమా
పాపిని నేను నాధా పాపినీ నేను ||2||
2.        వేంచేసి రావయ్యా మంచి దైవమా
           ప్రేమను కరుణను ఒసగుమో ప్రభువా ||2||
పదిరెట్లు ప్రేమతో తిరిగి నే వచ్చెద
మరల నన్ను నీ రెక్కల నీడలో వుంచు
కరుణ చూపుమా నాపై కనికరించుమా
పాపిని నేను నాధా పాపినీ నేను ||2||
Document

Your download link will appear in 10 seconds.