Bible Quiz in Telugu Topic wise: 102 || తెలుగు బైబుల్ క్విజ్ ("అపొల్లో "అనే అంశముపై బైబిల్ క్విజ్)

1. "అపొల్లో" ఏ ప్రాంతమునకు చెందినవాడు?
ⓐ గలిలయ
ⓑ బెరయ
ⓒ అలెక్సంద్రియ
ⓓ సిరియ
2. "అపొల్లో" ఏ గోత్రికుడు?
ⓐ యూదుడు
ⓑ సమరయుడు
ⓒ గ్రీకుడు
ⓓ ఏథెన్సీయుడు
3. "అపొల్లో" అనగా అర్ధము ఏమిటి?
ⓐ మంచివాడు
ⓑ నాశకుడు
ⓒ గొప్పవాడు
ⓓ ఐశ్వర్యవంతుడు
4. అపొల్లో వేటి యందు ప్రవీణుడై యుండెను?
ⓐ విద్య యందు
ⓑ సంగీతమందు
ⓒ లేఖనముల యందు
ⓓ మాట్లాడుట యందు
5. "అపొల్లో" యొక్క తండ్రి పేరేమిటి?
ⓐ దియోనూసి
ⓑ దేమోత్రేతు
ⓒ దేమీనోతు
ⓓ దియోత్రేఫే
6. "అపొల్లో" ప్రభువు మార్గము విషయమై ఏమి పొందెను?
ⓐ ఉపదేశము
ⓑ సందేశము
ⓒ అనుభవము
ⓓ వరము
7. "అపొల్లో" ఏమియై యుండెను?
ⓐ గాయకుడు
ⓑ విద్వాంసుడు
ⓒ లేఖికుడు
ⓓ ఉపదేశకుడు
8. "అపొల్లో" దేని యందు తీవ్రపడెను?
ⓐ మనస్సు
ⓑ హృదయము
ⓒ ఆత్మ
ⓓ అంతరంగము
9. ఎవరి బాప్తిస్మము మాత్రమే తెలిసికొనిన వాడైన అపొల్లో యేసును గూర్చి ధైర్యముగా బోధించెను?
ⓐ పేతురు
ⓑ యాకోబు
ⓒ ఫిలిప్పు
ⓓ యోహాను
10. ఎవరు "అపొల్లోను"చేర్చుకొని దేవుని మార్గము గురించి విశదపరచిరి?
ⓐ ప్రిస్కిల్ల : ఆకుల
ⓑ ఫిలిప్పు; యోహాను
ⓒ పేతురు; యాకోబు
ⓓ పౌలు; సీల
11. ఎక్కడ "అపొల్లో" సమాజమందిరములో ధైర్యముగా మాటలాడ నారంభించెను?
ⓐ ఆకయలో
ⓑ ఎఫెసులో
ⓒ బెరయలో
ⓓ అంతియొకయలో
12. తరువాత "అపొల్లో" ఎక్కడికి పోదలచెను?
ⓐ సిరియకు
ⓑ కుప్రకు
ⓒ ఆకయకు
ⓓ లుస్త్రకు
13. "అపొల్లోను"చేర్చుకొనవలెనని సహోదరులు ఆకయలో ఎవరికి వ్రాసిరి?
ⓐ పెద్దలకు
ⓑ పరిచారకులకు
ⓒ సంఘముకు
ⓓ శిష్యులకు
14. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా దృష్టాంతపరచి "అపొల్లో" దేనిని బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను?
ⓐ యూదుల ఆచారములను
ⓑ యూదుల వేషములను
ⓒ యూదుల వాదమును
ⓓ యూదుల నియమమును
15. యూదులు "అపొల్లోను"ఎలా చంపిరి?
ⓐ ఖడ్గముచేత
ⓑ వేడినూనెలో వేసి
ⓒ ఉరితీసి
ⓓ కొండపై నుండి త్రోసి
Result: