1. మీ పితరుడైన "అబ్రాహామును" నది అద్దరి నుండి తోడుకొని వచ్చితినని యెహోవా ఎవరి ద్వారా తన జనులకు చెప్పెను?
2. నీ స్నేహితుడైన "అబ్రాహాము"యొక్కసంతతికి కనాను దేశమును శాశ్వతముగా ఇచ్చినవాడవు నీవే అని ఎవరు యెహోవాతో అనెను?
3. అబ్రాముకు "అబ్రాహాము"అని పేరు పెట్టినవాడవు నీవే అని ఎవరు యెహోవాతో అనెను?
4. యెహోవా తన సేవకుడైన "అబ్రాహామును" జ్ఞాపకము చేసుకొని తన ప్రజలను ఎలా రప్పించెనని కీర్తనాకారుడు అనెను?
5. జనముల యొక్క ఎవరు "అబ్రాహాము"యొక్క దేవునికి జనులై కూడుకొనియున్నారని కోరహుకుమారులు అనెను?
6. నా స్నేహితుడైన "అబ్రాహాము"సంతానమా, అని యెహోవా ఎవరి ద్వారా యాకోబును పిలిచెను?
7. దేనిని అనుసరించి నడుచుకొనుచు యెహోవాను వెదకు వారికి మీ తండ్రియైన "అబ్రాహాము"సంగతి ఆలోచించమని ఆయన చెప్పెను?
8. "అబ్రాహాముతో" తాను చేసిన దేనిని యెహోవా జ్ఞాపకము చేసుకొనునని కీర్తనాకారుడు అనెను?
9. "అబ్రాహాము" కుమారుడు ఎవరని మత్తయి వ్రాసెను?
10. అబ్రాహాముకు దేవుడు వేటి వలన పిల్లలను పుట్టింపగలడని యోహాను జనులతో అనెను?
11. సాతాను బంధించిన "అబ్రాహాము"కుమార్తెయైన స్త్రీని విశ్రాంతి దినమున కట్లనుండి విడిపింప తగదా అని యేసు ఎవరితో అనెను?
12. ఇతడు "అబ్రాహాము" కుమారుడే అని యేసు ఎవరి గురించి అనెను?
13. మెసపటోనియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు "అబ్రాహాముకు "ప్రత్యక్షమయ్యెనని ఎవరు అనెను?
14. విశ్వాసమునందు "అబ్రాహాము"బలహీనుడు కాలేదని పౌలు ఏ సంఘముకు చెప్పెను?
15. "అబ్రాహాము దేవుని నమ్మెను" అది అతనికి నీతిగా ఎంచబడెనను లేఖనము నెరవేర్చబడినదని ఎవరు అనెను?
Result: