Bible Quiz in Telugu Topic wise: 104 || తెలుగు బైబుల్ క్విజ్ ("అభ్యాసము" అను అంశముపై బైబిల్ క్విజ్)

1. "Habitude"అనగా అర్ధము ఏమిటి?
ⓐ అభ్యాసము
ⓑ ఆలవాటు
ⓒ వాడుక
ⓓ పైవన్నియు
2. ఎవరికి "అభ్యాసము" చేయవలెనని దావీదు సౌలు యోనాతానుల గురించి ధనుర్ణీతమొకటి చేసెను?
ⓐ ఇశ్రాయేలీయులకు
ⓑ బెన్యామీనీయులకు
ⓒ యూదావారికి
ⓓ రేకాబీయులకు
3. దేవుడు మానవులు "అభ్యాసము" నొందవలెనని చేసిన ప్రయాసము ఏమైనది?
ⓐ బహుకష్టతరమైనది
ⓑ బహు కఠినమైనది
ⓒ బహు వింతైనది
ⓓ బహు వ్యర్ధమైనది
4. అబద్ధములాడుట ప్రతివాడు తమ యొక్క దేనికి "అభ్యాసము"చేసియున్నారు?
ⓐ నాలుకలకు
ⓑ కంఠముకు
ⓒ పెదవులకు
ⓓ మనస్సుకు
5. ఎవరు వ్యభిచారక్రియలు "అభ్యాసము" చేయుదురని యెహోవా అనెను?
ⓐ యూదావారు
ⓑ ఎఫ్రాయిమీయులు
ⓒ ఇశ్రాయేలీయులు
ⓓ కెహెతీయులు
6. నరులు "అభ్యాసము" పొందవలెనని దేవుడు వారికి ఏమి పెట్టియుండెను?
ⓐ శ్రమానుభవము
ⓑ నష్టానుభవము
ⓒ కష్టానుభవము
ⓓ దు:ఖానుభవము
7. జనులు దేని "అభ్యాసము" చేసెదరని యెహోవా అనెను?
ⓐ దుర్మార్గత
ⓑ దుష్టత్వము
ⓒ అపవిత్రము
ⓓ మోసము
8. నాకు అందనివాటియందైనను గొప్పవాటి యందైనను నేను "అభ్యాసము"చేసికొనుట లేదని ఎవరు అనెను?
ⓐ దావీదు
ⓑ హిజ్కియా
ⓒ యోబు
ⓓ జెకర్యా
9. ఎఫ్రాయిము నూర్పునందు "అభ్యాసము" గలదై కంకులను త్రొక్కగోరు దేనివలె నున్నదని యెహోవా అనెను?
ⓐ ఆవు
ⓑ పెయ్య
ⓒ ఎద్దు
ⓓ గోవు
10. అధికమైనజ్ఞాన "అభ్యాసము"చేత విస్తారమైన ఏమి కలుగును?
ⓐ శోకము
ⓑ ఆయాసము
ⓒ దుఃఖము
ⓓ కోపము
11. ఎల్లప్పుడు మా మనస్సాక్షి ఎలా యుండునట్లు "అభ్యాసము"చేసికొనుచున్నామని పౌలు అనెను?
ⓐ నిష్కళంకమైనదిగా
ⓑ పవిత్రమైనదిగా
ⓒ శుద్ధమైనదిగా
ⓓ నిర్దోషమైనదిగా
12. వయస్సు వచ్చినవారు "అభ్యాసము"చేత ఏమి వివేచించుటకు జ్ఞానేంద్రియములు కలిగియున్నారు?
ⓐ మేలు కీడులను
ⓑ మంచి చెడులను
ⓒ తారతమ్యములను
ⓓ గొప్ప పేదవిచక్షణను
13. ప్రస్తుతమందు సమస్త శిక్షయందు "అభ్యాసము" కలిగిన వారికి అది ఏమైన ఫలమిచ్చును?
ⓐ న్యాయము సత్యము
ⓑ నీతియు సమాధానము
ⓒ ధర్మము ఉపకారము
ⓓ వెలుగు మహిమయు
14. యెహోవా యందు ఏమి కలిగియుండుట జ్ఞాన "అభ్యాసము"నకు సాధనము?
ⓐ వినయవిధేయత
ⓑ దీనత్వ తగ్గింపు
ⓒ భయభక్తులు
ⓓ విశ్వాసనమ్మకము
15. "అభ్యాసము" అనగా నేమి?
ⓐ క్రమము
ⓑ వెదకుట
ⓒ బెత్తము
ⓓ శిక్షణము
Result: