1. బైబిల్ నందు "అయిదవ" అను పదము ఎన్నిసార్లు కలదు?
2. బైబిల్ పరముగా "అయిదు "అనగా అర్ధమేమిటి?
3. హెబ్రీ భాషలో "అయిదు" అనగా అర్ధము తెల్పుము?
4. "అయిదవ"దినమున దేవుడు ఏమి సృజించెను?
5. "అయిదవ "దినమున యెహోవాకు ఆర్పణము తెచ్చిన గోత్రమేది?
6. దేశాంతరము వెళుతున్న ఎవరు మొదటి వానికి "అయిదు"తలాంతులు ఇచ్చెను?
7. "అయిదుగురు" బుద్ధిలేని కన్యకలు తమ దివిటీలతో పాటు ఏమి తెచ్చుకోలేదు?
8. "అయిదవ" నెలలో ఇశ్రాయేలు పెద్దలు ఎవరి యొద్దకు వచ్చెను?
9. తాను గర్భవతినని ఎరిగి ఎవరు "అయిదు" నెలలు దాగెను?
10. యెహోవా స్వాస్థ్యము "అయిదవ" వంతు చీటీ ఏ గోత్రమునకు వచ్చెను?
11. దేని మేడగది దక్షిణదిక్కున ఖాళీస్థలము "అయిదు "మూరలుండెను?
12. ఎవరు సువార్త ప్రకటించినపుడు "అయిదువేల" " మంది పురుషులు యేసును నమ్మిరి?
13. "అయిదు " రొట్టెలను యేసు ఎన్ని వేలమంది పురుషులకు పంచెను?
14. దాదాపు "అయిదు "గంటల వేళ కూడా ఎవరు పనివారిని కూలీకి పిలచెను?
15. మందిరగుడార ద్వారమునకు "అయిదు" వేటిని చేసెను?
Result: