Bible Quiz in Telugu Topic wise: 107 || తెలుగు బైబుల్ క్విజ్ ("అరణ్యము" అనే అంశము పై బైబిల్ క్విజ్)

1. అరణ్యములో కాపురముండి విలుకాడు అయినదెవరు?
ⓐ షేతు
ⓑ హాము
ⓒ ఇష్మాయేలు
ⓓ ఇస్సాకు
2. అరణ్యము తమను మూసి వేసెనని ఎవరు అనుకొందురని యెహోవా అనెను?
ⓐ ఫరో
ⓑ ఫరోసేవకులు
ⓒ ప్రధానులు
ⓓ ఇశ్రాయేలీయులు
3. ఎర్రసముద్రము నుండి ఏ అరణ్యములోనికి జనులు సాగిపోయిరి?
ⓐ షూరు
ⓑ సీనాయి
ⓒ జీపు
ⓓ సీను
4. ఏలీముకు సీనాయికు మధ్యనున్న అరణ్యము పేరేమిటి?
ⓐ మెగిద్దోను
ⓑ సీను
ⓒ మిగ్దోలు
ⓓ షూరు
5. దేవుడు దేనికి కాలిన అరణ్యములో మనలను స్నేహించెను?
ⓐ అగ్నికి
ⓑ కోపమునకు
ⓒ మహాయెండకు
ⓓ ఆగ్రహమునకు
6. అరణ్యమును, ఎండిన భూమి ఏమి చేయును?
ⓐ గంతులేయును
ⓑ ఊరుకును
ⓒ ఎగురును
ⓓ సంతోషించును
7. ప్రభురాజ్యము సమీపించియున్నది, మారుమనస్సుపొందుమని ఎవరు అరణ్యములో ప్రకటించుచుండెను?
ⓐ ఏలీయా
ⓑ యోహాను
ⓒ ఎలీషా
ⓓ తీతు
8. సౌలుకు భయపడి దావీదు ఏ అరణ్యములోని ఒక పర్వతమందు నివసించుచుండెను?
ⓐ సీనాయి
ⓑ షూరు
ⓒ మిలెతేను
ⓓ జీపు
9. అరణ్యమందు ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరములు ఉండెను?
ⓐ ఇరువది
ⓑ ముప్పది
ⓒ యాబది
ⓓ నలువది
10. అరణ్యములో దేవుడు ఏమి కలుగజేయుచున్నాడు?
ⓐ త్రోవ
ⓑ దారి
ⓒ వెలుగు
ⓓ మార్గము
11. యెరూషలేము నుండి గాజాకు పోయి అరణ్యమార్గమున కలుసుకొమ్మని,ప్రభువు దూత ఎవరికి చెప్పెను?
ⓐ యోహాను
ⓑ ఫిలిప్పు
ⓒ యాకోబు
ⓓ ఎలీషా
12. ఏ నెలలో ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యమునకు వచ్చిరి?
ⓐ రెండవ
ⓑ ఐదవ
ⓒ మూడవ
ⓓ నాలుగవ
13. ప్రాణము విసికించు ఎవరితో కాపురము చేయుటకంటే ఆరణ్యభూమిలో నివసించుట మేలు?
ⓐ గయ్యాళి
ⓑ మొండి
ⓒ మూర్ఖురాలు
ⓓ జగడగొ౦డి
14. ఎవరి మీద ఆనుకొని అరణ్యమార్గమున ప్రియురాలు వచ్చుచున్నది?
ⓐ సంఘము
ⓑ తల్లిఇల్లు
ⓒ ప్రియుని
ⓓ గృహము
15. అరణ్యము దేనికి సాదృశ్యముగా నున్నది?
ⓐ చెట్లు
ⓑ జంతువులు
ⓒ పక్షులు
ⓓ లోకము
Result: