1. "FISH" అనగా ఏమిటి?
2 . మత్స్యములను దేవుడు ఎన్నవ దినమున సృజించెను?
3 . ఎన్ని దినములు యోనా మత్స్యము కడుపులో ఉండెను?
4 . ఏమి లేని చేపలతో దేవుడు నరులను సమానులుగా చేసెను?
5 . సముద్రపు చేపలన్నియు యెహోవాకు భయపడి ఏమిచేయును?
6 . చేపలు ఎటువంటి వలయందు చిక్కుబడును?
7 .------- మానక చేయు దేని వలన సముద్రమత్స్యములు కూడా గతించిపోవుచున్నవి?
8 . ఏది సముద్రములో నానావిధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది?
9 . దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు వల వేయుడని యేసు ఎవరితో చెప్పెను?
10 . ఏడు రొట్టెలును కొన్ని చిన్నచేపలును యేసు వడ్డించమనగా అవి తినిన వారిలో ఎంతమంది పురుషులు కలరు?
11 . సముద్ర మత్స్యములను దేవుడు మనుష్యుని యొక్క దేని క్రింద యుంచెను?
12 . తండ్రిని తన కుమారుడు చేపను అడిగితే అతను దానికి ప్రతిగా దేని నిచ్చునా? అని యేసు అనెను?
13 . దోనె కుడిప్రక్కను వల వేయుమని యేసు తన శిష్యులతో చెప్పగా ఎన్ని చేపలు పడెను?
14 . మహాసముద్రములో నున్నట్లు ఏ చేపలును బహు విస్తారముగా నుండును?
15 . తినుటకు చేపలు లేవని ఏడ్చినదెవరు?
Result: