Bible Quiz in Telugu Topic wise: 127 || తెలుగు బైబుల్ క్విజ్ ("అల్లరి" అను అంశము పై బైబిల్ క్విజ్)

1. ఎవరు "అల్లరి" రేపుచున్నారని కీర్తనాకారుడు అనెను?
ⓐ అన్యజనులు
ⓑ మూర్ఖజనము
ⓒ వక్రజనము
ⓓ భూజనులు
2. నీ శత్రువులు "అల్లరి"చేయుచున్నారని దేవునితో ఎవరు అనెను?
ⓐ నాతాను
ⓑ ఆసాపు
ⓒ హిజ్కియా
ⓓ ఆమోసు
3. ఏమి చేయువారి "అల్లరి" నుండి నన్ను దాచుమని దావీదు దేవునితో అనెను?
ⓐ చెడ్డపనులు
ⓑ దురాలోచనలు
ⓒ దుష్టక్రియలు
ⓓ మూర్ఖచర్యలు
4. ఎవరు చేయు "అల్లరిని "నెబుకద్నెజరు చేత మాన్పించెదనని యెహోవా అనెను?
ⓐ ఇశ్రాయేలీయులు
ⓑ తూరీయులు
ⓒ ఎదోమీయులు
ⓓ ఐగుప్తీయులు
5. పట్టణమునందు నుండి వినబడు దేనిని విని ఈ "అల్లరి"యేమని యోవాబు అడిగెను?
ⓐ బాకానాదము
ⓑ సితారస్వరము
ⓒ పిల్లనగ్రోవి శబ్ధము
ⓓ వీణాగానము
6. టోబు దేశమున నివసించుచున్న ఎవరి యొద్దకు "అల్లరి"జనము వచ్చెను?
ⓐ గిద్యోను
ⓑ యోతాము
ⓒ బారాకు
ⓓ యెఫ్తా
7. యెహోవా జనముల "అల్లరిని"ఏమి చేయువాడు?
ⓐ తగ్గించువాడు
ⓑ అణచువాడు
ⓒ చల్లార్చువాడు
ⓓ పోగొట్టువాడు
8. "అల్లరి" చేయు ఐగుప్తీయుల సమూహము గూర్చి ఎవరిని అంగలార్చుమని యెహోవా సెలవిచ్చెను?
ⓐ యెషయాకు
ⓑ యిర్మీయాకు
ⓒ జెకర్యాకు
ⓓ యెహెజ్కేలునకు
9. యోవాబు రాజసేవకుడైన ఎవరు గొప్ప "అల్లరి" జరుగుట చూచితినని దావీదుతో అనెను?
ⓐ అహిమయస్సు
ⓑ కూషీ
ⓒ షిమ్యా
ⓓ యెరెదు
10. యూదులు మత్సరపడి దుష్టులను వెంటపెట్టుకొని గుంపుకూర్చి "అల్లరి"చేయుచు ఎవరి ఇంటిమీద పడిరి?
ⓐ ఆకుల
ⓑ యాసోను
ⓒ ఫిలిప్పు
ⓓ తీతు
11. ప్రధానయాజకులును శాస్త్రులును ఎలా యేసును పట్టుకొని చంపుదుమనుకొని ప్రజలలో "అల్లరి"కలుగునేమో అని పండుగలో వద్దనుకొనిరి?
ⓐ కపటము చేత
ⓑ దురాలోచనచేత
ⓒ మాయోపాయము చేత
ⓓ మోసము చేత
12. నేడు జరిగిన "అల్లరి" గూర్చి విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నదని ఎవరు ఎఫెసీయులతో అనెను?
ⓐ దేమేత్రియ
ⓑ యన్నే
ⓒ స్కెవయ
ⓓ కరణము
13. "అల్లరి" నిమిత్తము చెరసాలలో వేయబడిన బరబ్బను విడుదల చేసి యేసును ప్రజలకు అప్పగించినదెవరు?
ⓐ పిలాతు
ⓑ హేరోదు
ⓒ అన్న
ⓓ కయప
14. నేను గుంపుకూర్చి యుండలేదు, నా వలన "అల్లరి" కాలేదని ఎవరు అధిపతితో చెప్పెను?
ⓐ యాకోబు
ⓑ పౌలు
ⓒ యూదా
ⓓ పేతురు
15. ఎవరి సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని "అల్లరికి"కర్త కాడు?
ⓐ పవిత్రుల
ⓑ అపొస్తలుల
ⓒ పరిశుధ్దుల
ⓓ నిష్కపటుల
Result: