Bible Quiz in Telugu Topic wise: 13 || తెలుగు బైబుల్ క్విజ్ ("Day of Forgiveness" సందర్భంగా బైబిల్ క్విజ్)

1. క్షమాపణ అనగా నేమి?
ⓐ మరచిపోవుట
ⓑ మన్నించుట
ⓒ ప్రేమించుట
ⓓ పైవన్నీ
2 . క్షమాపణ అను పదము పరిశుద్ధగ్రంధములో ఎన్ని సార్లు కలదు?
ⓐ 538
ⓑ 138
ⓒ 485
ⓓ 623
3 . దయాళుడైన ప్రభువు క్షమించుటకు ఏమి గలవాడు?
ⓐ ఆశ
ⓑ సిద్ధమనస్సు
ⓒ శాంతము
ⓓ ఓపిక
4 . యెహోవా ఇశ్రాయేలీయుల యొక్క వేటిని క్షమించి వారి పాపములను జ్ఞాపకము చేసికొనననెను?
ⓐ తప్పులు
ⓑ అన్యాయములు
ⓒ దోషములు
ⓓ సణుగులు
5 . యెహోవాకు విరోధముగా ఏమి చేసిన గాని ఆయన కృపాక్షమాపణ గల దేవుడై యుండెను?
ⓐ అతిక్రమములు
ⓑ పాపములు
ⓒ అధర్మములు
ⓓ తిరుగుబాటు
6. యెహోవా తన యొక్క దేనిలో శేషించిన వారి దోషములు పరిహరించి అతిక్రమములు క్షమించెను?
ⓐ స్వాస్థ్యములో
ⓑ గుడారములో
ⓒ నివాసములో
ⓓ వినికిడిలో
7 . పాపక్షమాపణ నిమిత్తము ఎవరి రక్తము చిందించబడెను?
ⓐ యేసుక్రీస్తు
ⓑ కోడెల
ⓒ మేకల
ⓓ ఎద్దుల
8 . పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్యకుమారునికి ఏమి కలదు?
ⓐ ఆజ్ఞ
ⓑ అధికారము
ⓒ నియమము
ⓓ నిబంధన
9 . ఎవరిని దూషించువానికి పాపక్షమాపణ లేదు?
ⓐ ప్రవక్తలను
ⓑ మనుష్యకుమారుని
ⓒ పరిశుద్ధాత్మను
ⓓ దూతలను
10 . దేవుని యొక్క దేనిని బట్టి క్రీస్తురక్తము వలన మన అపరాధములకు క్షమాపణ కలిగియున్నది?
ⓐ దయాళుత్వమును
ⓑ మంచితనమును
ⓒ కనికరమును
ⓓ కృపామహదైశ్వర్యమును
11. మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏమి పొంవలెను?
ⓐ రక్షణ
ⓑ బాప్తిస్మము
ⓒ నిరీక్షణ
ⓓ హస్తనిక్షేపణము
12 . మన పాపములను ఒప్పుకొనిన యెడల దేవుడు క్షమించి దేని నుండి పవిత్రులనుగా చేయును?
ⓐ కల్మషము
ⓑ కపటము
ⓒ సమస్తదుర్నీతి
ⓓ అసూయ
13 . ఒకనినొకడు ఏమి చేసికొనుచు క్షమించుకొనవలెను?
ⓐ ఆదరించుచు
ⓑ ఓదార్చుచు
ⓒ శాంతపరచుచు
ⓓ సహించుచు
14 . ఒకని మీద మనకేది యున్నప్పుడు ప్రార్ధన చేయునప్పుడెల్ల వానిని క్షమించవలెను?
ⓐ పగ
ⓑ కక్ష
ⓓ విరోధము
ⓓ కోపము
15 . రక్తము చిందించిన యేసు పాపక్షమాపణ ఇచ్చి ఏమి మనకు అనుగ్రహించెను?
ⓐ వాగ్ధానము
ⓑ నిబంధన
ⓒ కృపావరము
ⓓ నిత్యజీవము
Result: