1. దేవుడు దేనితో నరులకు అవయవనిర్మాణము చేసి రూపించెను?
2. అవయవములు ఎక్కడ మనకు కలవు?
3. శరీరము ఎలా యుండును?
4. ఒక అవయవము శ్రమపడితే ఏమి శ్రమపడును?
5. శరీరములో ఏమి లేక అవయవములన్నీ ఒకదానికొకటి పరామర్శించుకుంటాయి?
6. ఒక అవయవము ఘనత పొందిన మిగత అవయవములు ఏమి చేయును?
7. మనము క్రీస్తులో ఏమై యున్నాము?
8. క్రీస్తులో ఒక శరీరముగానున్న మనము ఒకరికొకరము ఎటువంటి అవయవములమై యున్నాము?
9. సర్వశరీరము ప్రభులోచక్కగా అమర్చబడి ప్రతి అవయవము దేని చొప్పున పనిచేయుచున్నది?
10. మనము క్రీస్తు శరీరమునకు ఏమై యున్నాము?
11. క్రీస్తు శరీరములో అవయవములుగా ఉన్న మనకు తన కృప చొప్పున ఏమి అనుగ్రహించెను?
12. సంఘ అవయవములైన మనకు అనుగ్రహింపబడిన కృపావరములలో వేటిని ఆసక్తితో ఆపేక్షించాలి?
13. దేవుడు అవయవములలో ప్రతి దానిని ఎలా శరీరములో యుంచెను?
14. క్రీస్తు తన శరీరములో అవయవములైన మనలను ఏమి చేయుచున్నాడు?
15. దేవత్వము యొక్క సర్వసంపూర్ణత శరీరములో క్రీస్తునందు నివసించునట్లుగా, అవయవములైన మనముకూడాఎలా ఉన్నాము?
Result: