①. అహరోను ఎవరికి అన్న?
②. అహరోను యొక్క తండ్రితల్లి ఎవరు?
③ అహరోను అనగా అర్ధము ఏమిటి?
④. అహరోను యొక్క భార్య పేరు ఏమిటి?
⑤. అహరోను మోషేకు ఎలా యుండునని యెహోవా చెప్పెను?
⑥. యెహోవా మోషేను ఎదుర్కొనుటకు ఎక్కడికి వెళ్లుమని అహరోనుతో చెప్పెను?
⑦. ఫరోతో మాటలాడినపుడు అహరోనుకు ఎన్ని ఏండ్లు?
⑧. ఏమి చేయుటకు అహరోనును అతని కుమారులను యెహోవా ఏర్పర్చుకొనెను?
⑨. అహరోను పరిశుద్ధస్థలములోనికి వెళ్ళునపుడు దేనిలోని ఇశ్రాయేలీయుల పేళ్లను నిత్యము భరింపవలెను?
①⓪. అహరోనును మోషే దేని ద్వారము నొద్ద యాజకునిగా ప్రతిష్టించెను?
①①. యెహోవా సన్నిధిని యుంచినకర్రలలో అహరోను కర్ర చిగిర్చి పువ్వులు పూసి ఏమి పండ్లు గలదాయెను?
①②. నీవును నీకుమారులును నీ తండ్రి కుటుంబమును దేని సేవలోని దోషములకు ఉత్తరవాదులు అని యెహోవా అహరోనుతో అనెను?
①③. అహరోను అతని కుమారులును వారి యొక్క దేని దోషములకు ఉత్తరవాదులు అని యెహోవా అతనితో అనెను?
①④ యెహోవా తన యొక్క వేటిని కాపాడు పని అహరోనుకు ఇచ్చెను?
①⑤ అహరోను ఎన్ని ఏండ్ల యీడుగలవాడై హోరు కొండ మీద మృతినొందెను?
Result: