Bible Quiz in Telugu Topic wise: 133 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఆకాశము" అనే అంశము పై బైబిల్ క్విజ్)

1. పైనున్న విశాలమునకు దేవుడు ఏమని పేరు పెట్టెను?
ⓐ భూమి
ⓑ ఆకాశము
ⓒ సముద్రము
ⓓ పర్వతము
2. మీది ఆకాశములేమిటి?
ⓐ ఆకాశమండలము
ⓑ మధ్యాకాశము
ⓒ మహా ఆకాశము
ⓓ పైవన్నియు
3. ఆకాశమున యెహోవా ఎవరికి గుడారము వేసెను?
ⓐ సూర్యునికి
ⓑ చంద్రునికి
ⓒ ఉల్కలకు
ⓓ నక్షత్రములకు
4. దేవుని ఊపిరి వలన ఆకాశవిశాలములకు ఏమి వచ్చెను?
ⓐ రూపము
ⓑ అందము
ⓒ వైశాల్యము
ⓓ కొలత
5. ఆకాశము యెహోవాకు ఏమై యున్నది?
ⓐ రాజ్యము
ⓑ కోట
ⓒ సింహాసనము
ⓓ దుర్గము
6. ఆకాశములు దేవుని యొక్క దేనిని వివరించుచున్నవి?
ⓐ క్రియలను
ⓑ మాటలను
ⓒ ఆజ్ఞలను
ⓓ మహిమను
7. యెహోవా ఆకాశము నుండి ఎవరిని పరిశీలించెను?
ⓐ భూమిని
ⓑ నరులను
ⓒ వృక్షములను
ⓓ జంతువులను
8. యెహోవా తన మాటను ఏమి చేయుమని ఆకాశమునకు చెప్పుచున్నాడు?
ⓐ ఆలకించుమని
ⓑ వినమని
ⓒ చెవి యొగ్గమని
ⓓ చాటమని
9. ఆకాశములు దేనివలె పాతగిలును?
ⓐ వెండివలె
ⓑ ఇత్తడివలె
ⓒ వస్త్రము వలె
ⓓ రాగివలె
10. ఆకాశమండలము ఏమి కురిపించును?
ⓐ నీతిని
ⓑ వర్షమును
ⓒ శాంతిని
ⓓ హిమమును
11. దేవాదిదేవునికి ఏమి పట్టజాలవు?
ⓐ భూమిరేణువులు
ⓑ ఆకాశమహాకాశములు
ⓒ సముద్రజలములు
ⓓ వృక్షములు
12. ఆకాశవైశాల్యము దేనివలె చుట్టబడును?
ⓐ పొరల వలె
ⓑ ఆకుల వలె
ⓒ కాగితపుచుట్టవలె
ⓓ వస్త్రము వలె
13. దేవుని చేతిపనిని ఏమి ప్రచురపరచుచున్నవి?
ⓐ మేఘము
ⓑ అంతరిక్షము
ⓒ భూమి
ⓓ నదులు
14. ఆకాశమండలము కంటే హెచ్చయిన వారెవరు?
ⓐ యేసుక్రీస్తు
ⓑ మహాదూతలు
ⓒ ప్రధానదూతలు
ⓓ పరలోకపెద్దలు
15. ప్రభువును ఎదుర్కొనుటకు, సజీవులమైన మనము ఆకాశమండలమునకు ఎలా కొనిపోబడుదుము?
ⓐ వాయువుపై
ⓑ అగ్నిపై
ⓒ జలముపై
ⓓ మేఘములపై
Result: