1. ఆపద్దినమందు అపవాదిని ఎదిరించుటకును దేవుడిచ్చు దేనిని ధరించుకొనవలెను?
2. యేసు- మీరు దేనియందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరనెను?
3. పాదములకు ఎటువంటి జోడు తొడుగుకొని నిలువ బడవలెను?
4. ఎవరు సర్వసత్యములోనికి నడిపించును?
5. దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు దేనిని పట్టుకొనుట వలన శక్తిమంతులవుదురు?
6. మీరు దేనిని నమ్ముట వలన రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను?
7. రక్షణయను దేనిని ధరించు కొనవలెను ?
8. సత్యము మిమ్మును ఎలా చేయును?
9. ఎటువంటి ఖడ్గమును ధరించుకొనుడి?
10. ప్రభువు యొక్క దేనిని బట్టి ఆయనయందు బలవంతులైయుండవలెను?
11. "యేసు - నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు". ఈవాక్యము యొక్క రిఫరెన్స్ తెలపండి?
12. మీ నడుమునకు ఏమి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొనవలెను?
13. ఏ విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించుము?
14. సత్యవర్తనుడైతే తన క్రియలు ఎవరి మూలముగా చేయబడును?
15. దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు దేనిని పట్టుకొనుట వలన శక్తిమంతులవుదురు?
Result: