1. ప్రయాసపడి గాలివానచేత కొట్టబడి "ఆదరణ" లేక యున్నదానా, నేను దేనితో నీ కట్టడమును కట్టుదును?
2. పౌలు - క్రీస్తు యొక్క ఏవి మాయందేలాగు విస్తరించుచున్నవో, ఆలాగే క్రీస్తు ద్వారా "ఆదరణ" యు మాకు విస్తరించుచున్నది?
3. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు "ఆదరణ"యు కలుగునట్లు, ప్రవచించువాడు ఎవరితో మాటలాడుచున్నాడు?
4. పౌలు ఫిలేమోనుతో ఎవరి హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమనుబట్టి నాకు విశేషమైన ఆనందమును "ఆదరణ" యు కలిగెననెను?
5. సుమెయోను ఎవరియొక్క "ఆదరణ" కొరకు కనిపెట్టు వాడైయున్నాడు?
6. నా అంతరంగమందు ఏవి హెచ్చగా దేవుని గొప్ప "ఆదరణ" నా ప్రాణమునకు నెమ్మది కలుగ జేయుచున్నది?
7. "ఆదరణ" కర్త అనగా?
8. పౌలు - సహోదరులారా, మా యిబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను దేనిని చూసి "ఆదరణ" పొందితిమనెను?
9. ఓర్పువలనను, లేఖనములవలనను,"ఆదరణ" వలనను మనకు ఏమికలుగును?
10. ఏది నాకు " ఆదరణ" ఇచ్చునని నేననుకొన్నానని యోబు పలికెను?
11. యెహోవా ఎవరితో మాటలాడిన దూతకు "ఆదరణ" యైన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను?
12. ఎవరియందు భయమును పరిశుద్ధాత్మ "ఆదరణ"యు కలిగి నడుచుకొనుచు విస్తరించవలెను?
13. సంపూర్ణులై యుండి "ఆదరణ" కలిగియుండి, ఏమిగలవారై సమాధానముగా ఉండవలెను?
14. మీరందరు దేనికి కర్తలుగాని "ఆదరణ"కు కర్తలుకారని యోబు పలికెను?
15. పౌలు ఎవరిని బ్రదికించినప్పుడు జనములలో విశేషమైన "ఆదరణ" కలిగెను?
Result: