1. ప్రభువా, నీ "కటాక్షము"నా మీద నున్నయెడల నన్ను దాటిపోవద్దని ఎవరు అనెను?
2. దేని చూచినట్లు నిన్ను చూచితిని, నీ "కటాక్షము" నా మీద వచ్చినదని యాకోబు ఏశావుతో అనెను?
3. నీమీద నాకు "కటాక్షము"కలిగినది,నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని యెహోవా ఎవరితో చెప్పెను?
4. యెహోవా "కటాక్షము"వలన తృప్తి నొందినదెవరు?
5. ఏమియైన నా మీద లక్ష్యముంచునట్లు నీకు నా "కటాక్షము"కలిగెనో యని రూతు బోయజుతో అనెను?
6. యెహోవాను కనుగొనినవాడు ఆయన "కటాక్షము" నొంది ఏమి కనుగొనును?
7. యెడల నీకు "కటాక్షము"కలిగిన యెడల ఒక సూచన కనుపరచుమని ఎవరు యెహోవా దూతతో అనెను?
8. తన సహోదరుల కంటే "కటాక్షము"నొందునదెవరు?
9. అనేకులు ఎవరి "కటాక్షము"వెదుకుదురు?
10. యెహోవా తన "కటాక్షము"చొప్పున ఎవరికి మేలు చేయును?
11. రాజు "కటాక్షము" ఎప్పటి వానమబ్బు?
12. తన దాసురాలి దీనస్థితిని "కటాక్షించెనని"ఎవరు అనెను?
13. దేవునిని ఏమి చేసిన యెడల ఆయన "కటాక్షించును"?
14. కోపపడి నిన్ను కొట్టితిని గాని "కటాక్షించి" నీ మీద ఏమి పడుచున్నానని యెహోవా అనెను?
15. ఇశ్రాయేలీయులను యెహోవా "కటాక్షించి"నందున ఆయన యొక్క ఏమి వారికీ విజయము కలుగజేసెను?
Result: