Bible Quiz in Telugu Topic wise: 142 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఆరంభము-2" అను అంశముపై బైబిల్ క్విజ్)

1. ఎవరు పుట్టిన తరువాత యెహోవా నామమున ప్రార్థన చేయుట "ఆరంభమైనది"?
Ⓐ︎ హేబేలు
Ⓑ︎ హనోకు
Ⓒ︎ నోవహు
Ⓓ︎ ఎనోషు
2. యేసు ఎవరిని వెంటబెట్టు కొనిపోయి, మిగుల విభ్రాంతి నొందుటకును చింతా క్రాంతుడగుటకును "ఆరంభించెను"?
Ⓐ︎ యోహాను
Ⓑ︎ పేతురు
Ⓒ︎ యాకోబు
Ⓓ︎ పైవారందరూ
3. యూదారాజైన సిద్కియా యేలుబడి "ఆరంభములో" యెహోవా వాక్కు ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమై ఎవరిగూర్చి సెలవిచ్చెను?
Ⓐ︎మోయాబు
Ⓑ︎ఏలాము
Ⓒ︎ కేమోషు
Ⓓ︎అర్నోను
4. యూదులు తాము "ఆరంభించిన" దానిని ఎవరు తమకు వ్రాసిన ప్రకారముగా నెరవేర్చుదుమని యొప్పుకొనిరి?
Ⓐ︎ అహష్వేరోషు
Ⓑ︎ హామాను
Ⓒ︎ ఎస్తేరు
Ⓓ︎ మోర్దకై
5. తాను "ఆరంభించిన" ప్రతిపని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను?
Ⓐ︎ హిజ్కియా
Ⓑ︎ సొలొమోను
Ⓒ︎ ఊదావీదు
Ⓓ︎ యోహు
6. మోయాబు దేశము నుండి యవలకోత "ఆరంభము"లో బేత్లహేము చేరిన వారెవరు?
Ⓐ︎ ఓర్పా, రూతు
Ⓑ︎ నయోమి, ఓర్పా
Ⓒ︎ నయోమి, రూతు
Ⓓ︎ పైవారందరూ
7. ఎవరు చెప్పిన ప్రకారము ఏడు కరవు సంవత్సరములు "ఆరంభ"మాయెను?
Ⓐ︎ యోసేపు
Ⓑ︎ దానియేలు
Ⓒ︎ ఏలీయా
Ⓓ︎ ఎలీషా
8. నిమ్రోదు భూమిమీద ఏమైయుండుటకు "ఆరంభించెను"?
Ⓐ︎ విలుకాండ్రు
Ⓑ︎ పరాక్రమశాలి
Ⓒ︎ విద్వాంసుడు
Ⓓ︎ మంత్రగాండ్రు
9. "మొదట ఆత్మానుసారముగా "ఆరంభించి", యిప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా?" అని పౌలు ఏ సంఘముతో పలికెను?
Ⓐ︎ కొరింథీ
Ⓑ︎ గలతీ
Ⓒ︎ ఫిలిప్పీ
Ⓓ︎ ఎఫెసీ
10. "దావీదు పక్షముగా నేను దేవుని యొద్ద విచారణచేయుట నేడే "ఆరంభిం"చితినా?" అని ఎవరు ఎవరితో పలికెను?
Ⓐ︎ సౌలు, సమూయేలుతో
Ⓑ︎ శ్రీ సమూయేలు, సౌలుతో
Ⓒ︎ అహీమెలెకు, సౌలుతో
Ⓓ︎ సౌలు, యోనాతానుతో
11. ఇశ్రాయేలు రాజైన ఎవరు చేయించిన వాద్యములను వాయించుటతో యెహోవాకు స్తుతి గానము "ఆరంభ"మాయెను?
Ⓐ︎ ఆహాబు
Ⓑ︎ సొలొమోను
Ⓒ︎ దావీదు
Ⓓ︎ హిజ్కియా
12. యేసు తనకు చేసిన దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును, ఆ సంగతి ప్రచురము చేయుటకును ఎవరు "ఆరంభించెను"?
Ⓐ︎ కుష్ఠురోగి
Ⓑ︎ గ్రుడ్డివాడు
Ⓒ︎ కుంటివాడు
Ⓓ︎ పక్షవాయువు గలవాడు
13. సహోదరులారా, "ఆరంభ"మందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడేర్పరచుకొనెనని మీకు తెలియునని ఎవరు పలికెను?
Ⓐ︎ పౌలు
Ⓑ︎ లూకా
Ⓒ︎ పేతురు
Ⓓ︎ యోహాను
14.యూదారాజునగు యెహోయాకీము ఏలుబడి "ఆరంభము"లో యెహోవా యొద్దనుండి వాక్కు ప్రత్యక్షమై ఎవరికి సెలవిచ్చెను?
Ⓐ︎ యెషయా
Ⓑ︎ దానియేలు
Ⓒ︎ యిర్మీయా
Ⓓ︎ యెహెజ్కెలు
15.ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశము నుండి బయలు దేరిననాడే మూడవనెల "ఆరంభ"దినమందే, వారు ఏ అరణ్యమునకు వచ్చిరి?
Ⓐ︎ జీఫు
Ⓑ︎ పారాను
Ⓒ︎ యెరూవేలు
Ⓓ︎ సీనాయి
Result: