1. తన్ను ఏమి ఏమి చేయువాని విషయము "ఆలస్యము"చేయక బహిరంగముగా యెహోవా దండన విధించును?
2. ఏది చూచునట్లు ధ్వజము ఎత్తి పారిపోవుటకు "ఆలస్యము"చేయకుడని యూదా యెరూషలేములో చాటించమని యెహోవా సెలవిచ్చెను?
3. నీవు దేవునికి ఏమి చేసికొనిన యెడల దానిని చెల్లించుటకు "ఆలస్యము"చేయకూడదు?
4. ఏ పట్టణముబహు మంచిదని "ఆలస్యము" చేయక బయలుదేరి ప్రవేశించుడని దాని చూచిన మనుష్యులు తమ జనులతో చెప్పిరి?
5. రాజును నగరునకు తోడుకొని రాకుండ మీరెందుకు "ఆలస్యము"చేయుచున్నారని ఎవరు సాదోకునకు అబ్యాతారునకు వర్తమానము పంపెను?
6. నేనిచ్చు మాట యికను "ఆలస్యము"లేక జరుగునని యెహోవా ఏమి చేయువారితో అనెను?
7. దర్శనవిషయము "ఆలస్యముగా" వచ్చినను దాని కొరకు కనిపెట్టుమని యెహోవా ఎవరికి సెలవిచ్చెను?
8. "ఆలస్యము" చేయక యెహోవాను ఏమి చేయుటకు పోదము రండి అని ఒక పట్టణపు వారు మరియొక పట్టణపు వారితో చెప్పెదరు?
9. ఎజ్రా ఏదైన అడిగిన యెడల "ఆలస్యము"కాకుండ దాని చేయుమని ఏ రాజు ఖజానాదారులకు ఆజ్ఞ ఇచ్చెను?
10. నీవు "ఆలస్యము"చేయక దబ్బున రమ్మని ఎవరు తన పనివానిని పిలిచెను?
11. ప్రభువా "ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుమని ఎవరు యెహోవాకు ప్రార్ధించెను?
12. దేని నుండి తప్పించుకొనినవారిని "ఆలస్యము"చేయక వెళ్ళుమని యెహోవా సెలవిచ్చెను?
13. తన యజమానుడు వచ్చుటకు "ఆలస్యము"చేయుచున్నాడని అనుకొనిన దాసుడు తిని త్రాగి మత్తులో ఉండసాగితే అతను వచ్చి ఎవరితో వానికి పాలు నియమించును?
14. ప్రభువు తన యొక్క దేని గురించి "ఆలస్యము"చేయువాడు కాడు?
15. ఇక "ఆలస్యము"ఉండదు గాని దేవుడు తన దాసులగు ఎవరికి తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును?
Result: