1. "Thinking"అనగా అర్ధము ఏమిటి?
2. నాకు మరణము రావలెనని నాతో వాదించువారు నా మీద చేసిన "ఆలోచన"అంతయు నీకు తెలిసేయున్నదని ఎవరు యెహోవాతో అనెను?
3. ఇశ్రాయేలు వారు తాము చేసిన "ఆలోచనలకు" సిగ్గు తెచ్చుకొనుటకు ఏ దేశములోనికి కొనిపోబడుదురని యెహోవా అనెను?
4. నీ "ఆలోచన"కర్తలు నశించిపోవుట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా? అని యెహోవా ఎవరితో అనెను?
5. సమాధానపరచుటకై "ఆలోచన" చెప్పువారు ఏమగుదురు?
6. భాధపడువారి "ఆలోచనను"ఎవరు తృణీకరించుదురు?
7. ఎవరి "ఆలోచనలు"వ్యర్ధములని యెహోవాకు తెలిసియున్నవి?
8. తమ "ఆలోచనలకు" ఫలితమైన దేనిని జనుల మీదికి రప్పింతునని యెహోవా అనెను?
9. జ్ఞానము లేని మాటలు చెప్పి "ఆలోచనను"చెరుపు చున్న వీడెవడు?అని యెహోవా ఎవరి గురించి అనెను?
10. యెహోవాకు ఏమైన "ఆలోచన"నిలువదు?
11. నా యొక్క ఎవరి "ఆలోచన"నెరవేర్చువాడను అని యెహోవా అనెను?
12. చాలా జనములను ఏమి చేయవలెనని అష్షూరు రాజు "ఆలోచన"అని యెహోవా అనెను?
13. నీవు పూర్వకాలమున చేసిన నీ "ఆలోచనలు"నెరవేర్చితివి అని యెహోవాతో ఎవరు అనెను?
14. నాకు "ఆలోచన"కర్త యైన యెహోవాను స్తుతించెదనని ఎవరు అనెను?
15. "ఆలోచన"విషయములో నీవే గొప్పవాడవు అని ఎవరు యెహోవాతో అనెను?
Result: