Bible Quiz in Telugu Topic wise: 148 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఆలోచన-2" అనే అంశము పై బైబిల్ క్విజ్)

1. ఎవరి హృదయములో "ఆలోచనలు" అనేకములుగా పుట్టును?
ⓐ యెహోవా
ⓑ విశ్వాసి
ⓒ నరుని
ⓓ దూతల
2. నేను నీకొక "ఆలోచన" చెప్పెదనని ఎవరు ఎవరితో అనెను?
ⓐ మోషే యెహోషువతో
ⓑ దావీదు యోనాతానుతో
ⓒ యిత్రో మోషేతో
ⓓ నాతాను దావీదుతో
3. యేసుక్రీస్తును ధరించుకొనినవారై, వేటిని నెరవేర్చుకొనుటకు దాని విషయమై "ఆలోచన" చేసికొనకూడదు?
ⓐ కోరికలను
ⓑ శరీరేచ్ఛలను
ⓒ లోకాశలను
ⓓ వాగ్దానములను
4. "ఆలోచన" చెప్పువారు లేని చోట ఏవి వ్యర్థమగును?
ⓐ విచారములు
ⓑ తలంపులు
ⓒ ఉద్దేశములు
ⓓ కలహములు
5. తమ "ఆలోచనలు" యెహోవాకు కనబడకుండ లోపల వాటిని మరుగుచేయ జూచువారికి ఏమి కలుగును?
ⓐ మేలు
ⓑ జ్ఞానం
ⓒ కీడు
ⓓ శ్రమ
6. ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని ఎవరు యూదులకు "ఆలోచన" చెప్పెను?
ⓐ పేతురు
ⓑ యాకోబు
ⓒ పౌలు
ⓓ కయప
7. ఎవరి యొక్క "ఆలోచనను" చెడగొట్టుమని దావీదు ప్రార్థన చేసెను?
ⓐ సిబ్బెకై
ⓑ అహీతోపెలు
ⓒ ఇష్మయా
ⓓ అబ్షాలోము
8. ఎవరి "ఆలోచన" పనికిమాలినది?
ⓐ భక్తిహీనుల
ⓑ సాత్వికుల
ⓒ స్వార్ధప్రియుల
ⓓ అబద్ధికుల
9. దావీదు పినతండ్రియైన ఎవరు వివేకముగల "ఆలోచన" కర్తయై యుండెను?
ⓐ యోనాతాను
ⓑ అబ్యాతారు
ⓒ యెహీయేలు
ⓓ యహశీయేలు
10. నరుని హృదయములోని "ఆలోచన" దేని వంటిది?
ⓐ మరణము
ⓑ వేగము
ⓒ లోతు నీళ్ల
ⓓ వివేకము
11. యెహోవా ఎవరి "ఆలోచనను" తలక్రిందు చేయును?
ⓐ భక్తిహీనుల
ⓑ డాంబికుల
ⓒ అజ్ఞానుల
ⓓ కపటుల
12. నీవు ముందుకు జ్ఞానివగుటకై "ఆలోచన" విని దేనిని అంగీకరించుము?
ⓐ ప్రవచనము
ⓑ ఉపదేశము
ⓒ ఉపాయము
ⓓ ఆత్మఫలమును
13. పెద్దల "ఆలోచనను" త్రోసివేసిన రాజు ఎవరు?
ⓐ సొలొమోను
ⓑ రెహబాము
ⓒ యెరోహాము
ⓓ యరోబాము
14. హృదయముయొక్క తలంపులను "ఆలోచనలను" శోధించునది ఏది?
ⓐ నరుని నీతి
ⓑ దేవుని కోపము
ⓒ లోక మహిమ
ⓓ దేవుని వాక్యము
15. నీ "ఆలోచన" చేత నన్ను నడిపించెదవని ఎవరు అనెను?
ⓐ దావీదు
ⓑ ఆసాపు
ⓒ కోరహు
ⓓ యెతాము
Result: