Bible Quiz in Telugu Topic wise: 15 || తెలుగు బైబుల్ క్విజ్ ("Day of King David" సందర్భంగా బైబిల్ క్విజ్)

1. దావీదు తండ్రి పేరేమిటి?
ⓐ యెషయా
ⓑ యోషీయా
ⓒ యోవాషు
ⓓ యెష్షయి
2. దావీదు యొక్క తల్లి పేరేమిటి?
ⓐ హన్నా
ⓑ హెప్సిబా
ⓒ హనాను
ⓓ హెజెరు
3. "దావీదు" అను పేరునకు అర్ధము ఏమిటి?
ⓐ గొప్పవాడైన
ⓑ నమ్మకమైన
ⓒ ఉన్నతమైన
ⓓ విధేయుడైన
4. దావీదు ఎర్రనివాడును చక్కని నేత్రములునుగలవాడునై, చూచుటకు ఎలా యుండెను?
ⓐ సుందరమైనవాడునై
ⓑ మనోహరుడై
ⓒ బలాఢ్యుడై
ⓓ ఎత్తరియై
5. దావీదు దేనిని చమత్కారముగా వాయింపగలడు?
ⓐ సానికను
ⓑ సీతారాము
ⓒ తంబురను
ⓓ తాళములను
6. దావీదు ఎవరికి అల్లుడాయెను?
ⓐ హూషైకు
ⓑ అహీమెలెకుకు
ⓒ సౌలునకు
ⓓ మీకాయాకు
7. దావీదు ఏమిగలవాడై ప్రవర్తించుచుండెను?
ⓐ తెలివి
ⓑ వివేచన
ⓒ జ్ఞానము
ⓓ సుబుద్ధి
8. బాలుడైన దావీదు వేటిని చంపి తన గొర్రెలను విడిపించెను?
ⓐ కుక్కలను, నక్కలను
ⓑ తోడేళ్ళను, నాగుపామును
ⓒ సింహమును, ఎలుగుబంటిని
ⓓ భుజంగమును, చిరుతపులిని
9. ఎవరి కంటే దావీదు బలాఢ్యుడై యుండెను?
ⓐ తన అన్నల
ⓑ ఫిలిష్తీయుని
ⓒ ఇశ్రాయేలీయుల
ⓓ సౌలు
10. సౌలు దావీదును చంపజూచినపుడు అతను ఫిలిష్తీయుల దేశములో ఎంతకాలము కాపురముండెను?
ⓐ ఒక సంవత్సరము నాలుగు నెలలు
ⓑ రెండు సంవత్సరములు
ⓒ మూడు సంవత్సరముల ఒక నెల
ⓓ ఆరు సంవత్సరములు
11. రాజైన తరువాత దావీదు ఎన్ని సంవత్సరములు పరిపాలన చేసెను?
ⓐ ముప్పది
ⓑ నలువది
ⓒ ఇరువది
ⓓ పదియేడు
12. వివేకము గల ఆలోచన కర్తయైన తన పినతండ్రియైన ఎవరిని శాస్త్రిగా దావీదునియమించెను?
ⓐ యోనాతానును
ⓑ యోవాబును
ⓒ యెహీయాను
ⓓ యెబూసును
13. సైన్యములకధిపతి యగు యెహోవా దావీదుకు తోడై యుండగా అతడు ఏమగుచుండెను?
ⓐ గొప్పవాడు
ⓑ అధికుడు
ⓒ ఘనుడు
ⓓ ప్రఖ్యాతిగలవాడు
14. దావీదునొద్ద నుండిన పరాక్రమశాలురు ఎంతమంది?
ⓐ అరువది
ⓑ డెబ్బది
ⓒ ముప్పది
ⓓ నలువది
15. దావీదు ఇశ్రాయేలీయులకు ఏమై యుండెను?
ⓐ కాంతియై
ⓑ మార్గమై
ⓒ రక్షణయై
ⓓ దీపముయై
Result: