Bible Quiz in Telugu Topic wise: 156 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఆశ్రయపురములు" అనే అంశము పై బైబిల్ క్విజ్)

1. ఆశ్రయపురములు అనగా ఏమిటి?
ⓐ దాగుచోటు
ⓑ రక్షణనివాసము
ⓒ కాపాడేగుడారము
ⓓ పైవన్నియు
2. యెహోవా మోషే నోట పలికిన మాట చొప్పున ఎవరిని ఆశ్రయపురములు ఏర్పర్చమనెను?
ⓐ కాలేబును
ⓑ ఫీనెహాసును
ⓒ యెహోషువాను
ⓓ ఈతామారును
3. ఎన్ని ఆశ్రయపురములను ఇశ్రాయేలీయులు నియమించిరి?
ⓐ నాలుగు
ⓑ యేడు
ⓒ అయిదు
ⓓ ఆరు
4. తెలియకయే పొరపాటున ఒకని చంపిన ఎవరి కొరకు ఆశ్రయపురములు ఏర్పాటు చేయమని యెహోవా సెలవిచ్చెను?
ⓐ మనుష్యుని
ⓑ నరహంతకుని
ⓒ కోపిష్టిని
ⓓ నరుని
5. నఫ్తాలి, ఎఫ్రాయిము మన్యములలోని ఆశ్రయపురముల పేర్లేమిటి?
ⓐ కిర్మోను - మెయిలాను
ⓑ మోరాము - షేయీలూను
ⓒ కెదెషు - షెకెము
ⓓ బేసెరు - నెకీము
6. యూదా మన్యము, రూబేనీయుల గోత్రములో గల ఆశ్రయపురముల పేర్లేమిటి?
ⓐ రెజీను - జెరెషూను
ⓑ బోనీకీము - హెల్లెసరు
ⓒ న్రీజీను - కేయీనాను
ⓓ కిర్యాతర్భా- బేసెరు
7. గాదీయులు, మనషేయుల గోత్రములలో నుండి ఏర్పర్చిన ఆశ్రయపురముల పేర్లేమిటి?
ⓐ రామోతు - గోలాను
ⓑ బేసెరు - ఆదుల్లాము
ⓒ హెబ్రోను - బెనీము
ⓓ గెర్షను హాయి
8. హత్యకు బదులు ఏమి చేయువాడు ఆశ్రయపురములోనికి రాకూడదు?
ⓐ పగ
ⓑ ప్రతిహత్య
ⓒ కక్ష
ⓓ దండన
9. కెదెషు, షెకెములు అనగా అర్ధము ఏమిటి?
ⓐ రోదన - వేదన
ⓑ హర్షము - ఆనందము
ⓒ పరిశుద్ధత - భుజము
ⓓ పవిత్రము - కృప
10. కిర్యాతర్బా, బేసెరులు అనగా అర్ధము ఏమిటి?
ⓐ సంఘము - ఐక్యత
ⓑ పరిచర్య - ఏకత్వము
ⓒ కూడుట - పంచుకొనుట
ⓓ సహవాసము - దుర్గము
11. రామోతు, గోలానులు అనగా అర్ధము తెల్పుము?
ⓐ ఘనత - ఆదరణ
ⓑ ప్రభావము - పరిశోధన
ⓒ మహిమోన్నతము - స్వస్థత
ⓓ సంకటము - దయ
12. నరహంతకుడు ఎవరికి సూచనగా యుండెను?
ⓐ పాపులైన మనుష్యులకు
ⓑ దేవదూతలకు
ⓒ కెరూబులకు
ⓓ ఆకాశసైన్యమునకు
13. ఆశ్రయపురములు ఎవరికి సాదృశ్యము?
ⓐ దేవునికి
ⓑ రాజులకు
ⓒ న్యాయాధిపతులకు
ⓓ ప్రధానులకు
14. ఆశ్రయమైన దేవాదిదేవుడు పాపులమైన మనలను విడిపించుటకు ఏమి చెల్లించెను?
ⓐ పన్నును
ⓑ జుల్మానాను
ⓒ బకాయిలను
ⓓ విమోచనక్రయధనమును
15. విమోచన క్రయధనము ఏమిటి?
ⓐ క్రీస్తు రక్తము
ⓑ క్రీస్తు జీవము
ⓒ క్రీస్తు శరీరము
ⓓ పైవన్నియు
Result: