1ప్ర.నీ ఇంటిని గూర్చిన "ఆసక్తి" నన్ను భక్షించుచున్నదని ఎవరు అనెను?
2ప్ర. కృపావరములలో ఎటువంటివి "ఆసక్తితో" ఆపేక్షించవలెను?
3ప్ర. ఏది పరిపూర్ణమగు నిమిత్తము ఇదివరకు కనుపరచిన "ఆసక్తిని"కనుపరచవలెను?
4 ప్ర. దేవాసక్తితో పౌలు ఏ సంఘము యెడల "ఆసక్తి" కలిగియుండెను?
5 ప్ర."ఆసక్తి" విషయములో ఏమి కాక యుండవలెను?
6 ప్ర. ప్రభువు యొక్క దేని యందు ఎప్పటికిని "ఆసక్తులై" యుండవలెను?
7ప్ర. సత్ క్రియల యందు "ఆసక్తి"గల ప్రజలను తన కోసరము ఏమి చేసుకొని తన సొత్తుగా చేసుకొనుటకు యేసు తన్నుతాను అప్పగించుకొనెను?
8 ప్ర. మంచి విషయములలో "ఆసక్తి"గల వారైతే మీకు హానిచేయువాడెవడని, ఎవరు అనెను?
9ప్ర. ఆత్మసంబంధమైన వరముల విషయమై "ఆసక్తి" గలవారు గనుక సంఘమునకు ఏమి కలుగునిమిత్తము వాటిని విస్తరింపచేయునట్లు ప్రయత్నము చేయవలెను?
10 . ఎవరు దేవుని యందు "ఆసక్తి"గలవారని పౌలు సాక్ష్యమిచ్చెను?
11: ఎవరు దేవుని యందు "ఆసక్తి"గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను?
12. ఘనులై యున్న ఎవరు "ఆసక్తితో" వాక్యమును అంగీకరించిరి?
13. ఏమి చేయుట "ఆసక్తితో" ఆపేక్షించవలెను?
14. ఎవరిలో విశ్వాసులైనవారు ధర్మశాస్త్రమందు "ఆసక్తి"గలవారు?
15. యెహోవాను గూర్చి నాకు కలిగిన "ఆసక్తిని" చూచుటకు నాతో కూడా రమ్మని ఎవరితో యెహూ అనెను?
Result: