Bible Quiz in Telugu Topic wise: 159 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఆహారము" అను అంశముపై బైబిల్ క్విజ్)

1Q. దేవుడు భూమిమీద నరులను సృష్టించక మునుపే వారి కొరకు ముందే దేనిని సృజించెను?
A ఆహారమును
B పాదరక్షలను
C వస్త్రములను
D వస్తువులను
2 Q. ఏమి అనుకొనకుండా సమృద్ధియైన ఆహారము గల దేశములోనికి ఎవరు తన ప్రజలను నడిపించెను?
A కష్టము - దేవుడు
B బాధ - యెహోవా
C కరవు - యెహోవా
D నష్టము - దేవుడు
3. దేనిని బలపరచు ఆహారమును దేవుడు పుట్టించెను?
A నరుల శరీరమును
B నరుల నరములను
C నరుల ఎముకలను
D నరుల హృదయమును
4Q. అరచుచుండు పిల్లకాకులతో పాటు దేవుడు వేటికి ఆహారము ఇచ్చెను?
A మొక్కలకు
B పశువులకు
C నరులకు
D పక్షులకు
5. నిత్యజీవమునిచ్చు ఎటువంటి ఆహారము దేవుడు అనుగ్రహించును?
A అక్షయమైన
B రుచియైన
C శ్రేష్టమైన
D గొప్పదైన
6 Q. భూమి రాబడియైన దేనిని యెహోవా అనుగ్రహించును?
A పంటను
B సస్యమును
C ఆహారద్రవ్యమును
D ధనధాన్యమును
7. జీవాహారము ఎవరు?
A యెహోవా
B యేసుక్రీస్తు
C దూతలు
D సెరాపులు
8 Q. దేవుడు పరలోకము నుండి ఎటువంటి ఆహారమిచ్చును?
A నిత్యమైన
B దేవదూతల
C నిజమైన
D మంచిదైన
9 Q. దేవుడు తన ప్రజల ఆహారమును దేనితో నింపును?
A నూనెతో
B క్రొవ్వుతో
C రుచితో
D నేతితో
10. ఆహారము కొరకు దేవుడు తన జనులకు ఎటువంటి వాటిని ఇచ్చెను?
A పవిత్రమైనవి
B బలమైనవి
C పుష్టికరమైనవి
D బలహీనమైనవి
11. ఆహారమును ఎక్కడవేసి ఏడుగురికి, ఎనమండుగురికి ఏమి పంచిపెట్టాలి?
A నీళ్ళు - వంతు
B భూమి - భాగము
C నీళ్ళు - భాగము
D నేల- వంతు
12. ఎవరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి?
A శిష్యులు
B అపొస్తలులు
C ఇశ్రాయేలీయులు
D ప్రవక్తలు
13. మనుష్యకుమారుని శరీరము అను ఆహారము తినుట వలన ఏమి కలుగును?
A బలము
B శక్తి
C ధైర్యము
D జీవము
14: ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన జూచుచున్నవి?
A పక్షులు
B జంతువులు
C సింహపు పిల్లలు
D వృక్షములు
15 Q. ఆహారము వలన గాక దేనివలన ప్రతి మనుష్యుడు బ్రదుకును?
A విశ్వాసము
B బలమ
C నీతి
D యెహోవా మాట
Result: