Bible Quiz in Telugu Topic wise: 16 || తెలుగు బైబుల్ క్విజ్ ("Day of LEBNON" సందర్భంగా బైబిల్ క్విజ్)

1. "లెబానోను" అను మాట పరిశుద్ధ గ్రంధములో ఎన్నిసార్లు కలదు?
ⓐ డెబ్బది ఐదు
ⓑ అరువది యేడు
ⓒ ఎనుబది
ⓓ యాబదియారు
2. లెబానోనుకు మహానది ఏమిటి?
ⓐ యొర్దాను
ⓑ యూఫ్రటీస్
ⓒ నిమ్రీము
ⓓ నైలు
3. దేనికి లెబానోను చాలకపోవును?
ⓐ మైదానమునకు
ⓑ పర్వతములకు
ⓒ సమిధలకు
ⓓ కట్టెలకు
4. లెబానోను ప్రదేశము ఏమైన పొలమగును?
ⓐ పంటలు గల
ⓑ సారవంతమైన
ⓒ మంచినేల యైన
ⓓ ఫలభరితమైన
5. లెబానోను మ్రానుతో మంచమొకటి ఎవరు చేయించుకొనెను?
ⓐ దావీదు
ⓑ ఉజ్జీయా
ⓒ సొలొమోను
ⓓ ఓగు
6. ఎవరు లెబానోను మీద దేవదారు వృక్షము వలె ఎదుగుదురు?
ⓐ పరిచారకులు
ⓑ నీతిమంతులు
ⓒ బుద్దిమంతులు
ⓓ ప్రవక్తలు
7. ఎవరు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండెను?
ⓐ అష్షూరీయులు
ⓑ ఇశ్రాయేలీయులు
ⓒ ఐగుప్తీయులు
ⓓ రేకాబీయులు
8. లెబానోను దేవదారు వృక్షములు ఏమి కలిగి అతిశయించును?
ⓐ ఫలములు
ⓑ ఔన్నత్యము
ⓒ పొడవు
ⓓ ఎత్తు
9. లెబానోను పొలములోని ఎక్కడ హిమము యుండక మానదు?
ⓐ చెట్లమీద
ⓑ నేల మీద
ⓒ బండమీద
ⓓ గడ్డి మీద
10. యెహోవా నాటిన లెబానోను దేవదారు వృక్షములు ఏమి పొందుచున్నవి?
ⓐ మేలు
ⓑ సారము
ⓒ పుష్టి
ⓓ తృప్తి
11. సొలొమోను లెబానోను యొక్క దేనిని కట్టించెను?
ⓐ అరణ్యపు నగరిని
ⓑ కోటలను
ⓒ గోపురములను
ⓓ పట్టణములను
12. దేనికి లెబానోను సౌందర్యము కలుగును?
ⓐ పట్టణమునకు
ⓑ అడవికి
ⓒ నగరునకు
ⓓ నదులకు
13. దేనికి లెబానోను దేవదారు మ్రాను తెప్పించి ఓడకొయ్యలు చేయుదురు?
ⓐ ఎదోమునకు
ⓑ తూరు పట్టణమునకు
ⓒ సిరియ దేశమునకు
ⓓ అష్షూరు రాజ్యమునకు
14. పరిశుద్ధాలయపు దేని నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములు తేబడును?
ⓐ గుమ్మముల
ⓑ గదుల
ⓒ అలంకారముల
ⓓ అంతస్థుల
15. ఎవరిని బట్టి నరుకువాడెవడును మామీదికి రాలేదని లెబానోను దేవదారు వృక్షములు హర్షించును?
ⓐ ఎదోము
ⓑ తూరు
ⓒ ఫిలిష్తీయ
ⓓ బబులోను
Result: