Bible Quiz in Telugu Topic wise: 160 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఇంటర్నేషనల్ యూత్ డే సందర్బంగా" బైబిల్ క్విజ్)

1"యౌవనస్థులు" దేనిచేత తమ నడతను శుద్ధిపరచుకొందురు?
A తమ జ్ఞానము
B వివేకము
C దేవుని వాక్యము
D స్వబుద్ది
2. "యౌవన" కాలమున కాడి మోయుట ఎవరికి మేలు?
A ధీరునికి
B నరునికి
C దేవునికి
D వైరునికి
3Q. కుమారులు "యౌవన" కాలమందు ఎదిగిన దేనివలె ఉన్నారు?
A చిగురువలె
B అంకురమువలె
C మొక్కలవలె
D ముండ్లపొదలవలె
4Q. "యౌవనస్థులు" ఎవరిని జయించియున్నారు?
A వీరుని
B దేవుని
C దుష్టుని
D శూరుని
5Q. క్రీస్తు "యుక్త" కాలమున ఎవరి కొరకు చనిపోయెను?
A అవిశ్వాసులకొరకు
B భక్తిహీనులకొరకు
C నీతిమంతులకొరకు
D విశ్వాసులకొరకు
6Q. "యౌవన" కాలమందు పుట్టిన కుమారులు ఎవరి చేతిలోని బాణములవంటివారు?
A దీర్ఘాయుష్మంతుని
B బలవంతుని
C మహాన్నతుని
D ఐశ్వర్యవంతుని
7. "యౌవన"పురుషులు ఏమిగలవారై యుండవలెను ?
A ఉపకారబుద్ధి
B స్వస్థబుద్ది
C నిబ్బర బుద్ధి
D విపరీత బుద్ధి
8Q. పక్షిరాజు "యౌవనము" వలె మన యౌవనము ఏమగును?
A రక్షణార్థమైనదగును
B చెడ్డదగును
C క్రొత్తదగును
D పాతదగును
9Q. ఎవరు పెద్దల ఆలోచనను త్రోసివేసి, "యౌవనస్థులు" చెప్పిన ప్రకారము చేసెను?
A రాజైన అదోనీయా
B రాజైన రెహబాము
C రాజైన అబీమెలెకు
D రాజైన సొలొమోను
10Q. మహా బలాఢ్యుడుగు "యౌవనుడు" ఎవరు?
A యరొబాము
B రెహబాము
C అబీయాము
D యాషాబాము
11Q. బహు సౌందర్యము గల " యౌవనుడు" ఎవరు?
A తిమోతి
B సౌలు
C యోనా
D పౌలు
12Q. పరాక్రమశాలియైన "యౌవనుడు" ఎవరు?
A సాదోకు
B సంసోను
C బారాకు
D ఇస్సాకు
13Q. మోయాబీయురాలైన "యౌవనురాలు" ఎవరు?
A యోకొల్య
B బెరుహ
C రూతు
D నయమా
14 Q. ఇశ్రాయేలు యొక్క "యౌవనకాలము" మొదలుకొని పగవారు అతనికి ఏమి కలుగజేయుచు వచ్చిరి?
A అధిక విచారము
B అధిక యుద్ధములు
C అధిక శోకము
D అధిక బాధలు
15Q. "యౌవనస్థులారా" మీరు బలవంతులు, ఏది మీయందు నిలుచుచున్నది?
A యెహోవా భయము
B దేవుని వాక్యము
C యెహోవా సత్యము
D ఆదేవుని పరిచర్య
Result: