Bible Quiz in Telugu Topic wise: 163 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఇశ్రాయేలీయుల నాల్గవ రాజు" అంశము పై బైబిల్ క్విజ్)

1. సొలొమోను తర్వాత అతనికుమారుడైన ఎవరిని రాజుగా పట్టాభిషేకము చేసిరి?
ⓐ అబీయాము
ⓑ దానియేలు
ⓒ రెహబాము
ⓓ యెషయా
2. సొలొమోను యెహోవాకు విరోధముగా చేసిన పాపము వలన దేవుడు యరొబాముకు ఎన్ని గోత్రముల నిచ్చెను?
ⓐ రెండు
ⓑ ఐదు
ⓒ ఏడు
ⓓ పది
3. యరొబాము పదిగోత్రములకు రాజు అవుతున్నాడని ఏ ప్రవక్త తెలిపెను?
ⓐ యెహు
ⓑ అహీయా
ⓒ గాదు
ⓓ నాతాను
4. యరొబామును ఎవరు తమకు రాజుగా పట్టాభిషేకము చేసిరి?
ⓐ యూదావారు
ⓑ బెన్యామీను వారు
ⓒ ఇశ్రాయేలీయులు
ⓓ షిమ్యోనీయులు
5. యరొబాము యెహోవాను విసర్జించి ఇశ్రాయేలీయులు పూజించుటకు ఏమి చేయించెను?
ⓐ విగ్రహములు
ⓑ ప్రతిమలు
ⓒ ఇత్తడి సర్పము
ⓓ రెండుబంగారుదూడలు
6. యెహోవా ఎవరిని హేయమైన బలిపీఠము దగ్గర నున్న యరొబాము నొద్దకు పంపెను?
ⓐ దైవజనుడిని
ⓑ ప్రవక్తను
ⓒ దీర్ఘదర్శిని
ⓓ సేవకుడిని
7. బలిపీఠము నొద్ద ప్రకటించుచున్న దైవజనుడిని పట్టుకొనవలెనని యరొబాము చేయి చాపగా అది ఏమాయెను?
ⓐ విరిగిపోయెను
ⓑ వంగిపోయెను
ⓒ ఎండిపోయెను
ⓓ ముక్కలయ్యెను
8. ఇంత జరిగినను యరొబాము ఏమి విడిచిపెట్టలేదు?
ⓐ పాపమును
ⓑ దుర్మార్గమును
ⓒ అహంకారమును
ⓓ దోషమును
9. సామాన్యజనులలో తన కిష్టమైన వారిని యరొబాము ఎవరిగా నియమించెను?
ⓐ ప్రవక్తలుగా
ⓑ న్యాయాధిపతులుగా
ⓒ యాజకులుగా
ⓓ సేవకులుగా
10. యరొబాము కుమారుడైన ఎవరు కాయిలాపడెను?
ⓐ యెహూ
ⓑ అబీరాము
ⓒ నింష
ⓓ అబీయా
11. యెహోవాను బొత్తిగా ఏమి చేసి యరొబాము ఆయనకు కోపము పుట్టించెను?
ⓐ విసర్జించి
ⓑ త్రోసివేసి
ⓒ నెట్టివేసి
ⓓ గెంటివేసి
12. యరొబాము సంతతిలో శేషించిన వారిని దేవుడు ఏమి చేయును?
ⓐ తీసివేయును
ⓑ లాగివేయును
ⓒ త్రోసివేయును
ⓓ ఊడ్చివేయును
13. యరొబాము సంతతి వారి మీద యెహోవా ఏమి రప్పించును?
ⓐ ఉపద్రవము
ⓑ కీడు
ⓒ శాపము
ⓓ నాశనము
14. యరొబాము సంబంధులలోమరణమగు వారిని ఏమి తినును?
ⓐ కుక్కలు
ⓑ పందులు
ⓒ నక్కలు
ⓓ తోడేళ్ళు
15. యరొబాము ఏలిన దినము లెన్ని?
ⓐ ఇరువది సంవత్సరములు
ⓑ ముప్పదిసంవత్సరములు
ⓒ ఇరువది రెండుసంవత్సరములు
ⓓ నలువదిసంవత్సరములు
Result: