1. బయెషా చనిపోయిన తర్వాత అతని కుమారుడైన ఎవరు ఇశ్రాయేలీయులకు రాజాయెను?
2. ఏలా తన గృహనిర్వహకుడగు ఎవరి ఇంట యుండెను?
3. ఎవరు ఏలా మీద కుట్ర చేసెను?
4. ఏలా, అతని తండ్రి బయెషా తాము పెట్టుకొనిన వేటి చేత యెహోవాకు కోపము పుట్టించెను?
5. ఏలా, అతని తండ్రియైన బయెషా తామే పాపము చేసి ఎవరు పాపము చేయుటకు కారకులైరి?
6. జిమీ వేటి అర్ధభాగముల మీద అధికారియై యుండెను?
7. జిమ్రీ రాజైన ఏలాను ఏమి చేసెను?
8. జిమ్రీ ఏలాను చంపి ఇశ్రాయేలీయులకు ఏమాయెను?
9. ఏలా ఎన్ని సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను?
10. జిమీ రాజు అవుటతోడనే బయెషా సంతతి వారిని మిగుల నియ్యక అందరిని ఏమి చేసెను?
11. యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జిమ్రీ బయెషా సంతతిని ఏమి చేసెను?
12. జిమ్రీ ఎంత కాలము ఇశ్రాయేలీయులను ఏలెను?
13. జిమ్రీ కుట్ర చేసి ఏలాను చంపెనను వార్త ఎవరికి తెలిసెను?
14. ఇశ్రాయేలు జనులు ఎవరిని రాజుగా చేసెను?
15. పట్టణము పట్టబడెనని విని జిమ్రీ ఎక్కడికి జొచ్చెను?
Result: