1. మెనహేము నిద్రించిన తర్వాత అతని కుమారుడైన ఎవరు రాజాయెను?
2. పెకహ్యా కూడా యరొబాము వలె యెహోవా దృష్టికి ఏమి చేసెను?
3. పెకహ్యా క్రింద అధిపతి యైన ఎవరు అతని మీద కుట్ర చేసెను?
4 . పెకహు దగ్గర ఎంతమంది గిలాదీయులుండెను?
5. పెకహు ఆరోబు, అరీహేనుతో కలిసి పెకహ్యాను రాజనగరులో ఎక్కడ చంపెను?
6. పెకహ్యా ఎన్ని సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను?
7 . ఇశ్రాయేలీయులకు ఎవరు రాజుగా నుండెను?
8 . పెకహు దినములలో అష్టూరు రాజైన ఎవరు ఇశ్రాయేలుల పట్టణములను పట్టుకొనెను?
9 . ఇశ్రాయేలీయుల ఎన్ని పట్టణములను తిగ్లత్పిబేసెరు చెరగా తీసుకొనిపోయెను?
10 . ఎవరు పెకహు మీద కుట్ర చేసెను?
11. పెకహు ఎన్ని సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను?
12. యూదా రాజైన ఎవరి మీదికి యెహోవా పెకహును పంపెను?
13 . హోషేయా మీదికి అష్షూరు రాజైన ఎవరు యుద్ధమునకు వచ్చెను?
14 . హోషేయా అష్షూరు రాజుకు దాసుడై ఏమి ఇచ్చువాడాయెను?
15 . హోషేయా ఐగుప్తు రాజైన ఎవరి యొద్దకు సంధికోసము దూతలను పంపెను?
Result: