Bible Quiz in Telugu Topic wise: 173 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఇశ్రాయేలీయుల రాజు ఆహాబు" అంశము పై బైబిల్ క్విజ్)

1. ఒమ్రీ తన పితరులతో నిద్రించిన తర్వాత అతని కుమారుడైన ఎవరు రాజాయెను?
ⓐ అహజ్యా
ⓑ అమాజ్యా
ⓒ ఆహాబు
ⓓ ఆహజు
2. ఆహాబు తన పూర్వికులను మించునంతగా యెహోవా దృష్టికి ఏమి చేసెను?
ⓐ పాపము
ⓑ దోషము
ⓒ అపరాధము
ⓓ చెడుతనము
3. ఆహాబు సీదోనీయుల రాజైన ఎవరి కుమార్తెను పెండ్లి చేసుకొనెను?
ⓐ మేరమేను
ⓑ ఎత్బయలు
ⓒ ఎగ్లీను
ⓓ యెరీము
4. ఆహాబు భార్య పేరేమిటి?
ⓐ యెజూమా
ⓑ యెక్జీమా
ⓒ యెజెబెలు
ⓓ యెరెబీలు
5. యెజెబెలు పూజించే ఏ దేవతను ఆహాబు పూజించి దానికి మ్రొక్కెను?
ⓐ దాగోను
ⓑ బయలు
ⓒ గాదు
ⓓ ఆషేరాదేవి
6. ఆహాబు ఎక్కడ బయలుకు మందిరము కట్టి దానిలో బలిపీఠము కట్టించెను?
ⓐ షోమ్రోనులో
ⓑ సీదోనులో
ⓒ యెక్రోనులో
ⓓ మోయాబులో
7. ఏ ప్రవక్త ఆహాబు నొద్దకు వచ్చెను?
ⓐ యెహు
ⓑ ఏలీయా
ⓒ ఎలీషా
ⓓ ఏలీ
8. ఆహాబు కాలములో ఎన్ని సంవత్సరములు కరవు వచ్చెను?
ⓐ నాలుగు
ⓑ మూడు
ⓒ నాలుగున్నర
ⓓ మూడున్నర
9. కరవు కాలములో ఇశ్రాయేలు దేశములో ఏమి పడదని ఏలీయా ప్రకటించెను?
ⓐ మంచైనను
ⓑ వర్షమైనను
ⓒ పైరెండూ
ⓓ పైవేమీకాదు
10. ఆహాబు ఎవరి ద్రాక్షతోటను ఆశించెను?
ⓐ ఆహజ్యా
ⓑ కిల్యాబు
ⓒ నాసోను
ⓓ నాబోతు
11. నాబోతు తన ద్రాక్షాతోటను ఇవ్వవల్లపడదనగా ఆహాబు ఏమి ముడుచుకొనెను?
ⓐ మూతి
ⓑ చేతులు
ⓒ కాళ్ళు
ⓓ ముఖము
12. నాబోతును వేటితో కొట్టించి ఆ ద్రాక్షాతోటను యెజెబెలు ఆహాబుకు ఇచ్చెను?
ⓐ కొరడాతో
ⓑ కర్రలతో
ⓒ రాళ్ళతో
ⓓ త్రాళ్ళతో
13. నాబోతును రాళ్ళతో కొట్టించి చంపిన తర్వాత ఆహాబు అతని ద్రాక్షాతోటను ఏమి చేసికొనెను?
ⓐ ఆవరించెను
ⓑ విడిచెను
ⓒ స్వాధీనము
ⓓ పాడు చేసెను
14. ఆహాబు తన భార్యయైన యెజెబెలు యొక్క దేని చేత యెహోవా దృష్టికి కీడు చేసెను?
ⓐ ఒత్తిడి
ⓑ ప్రేరేపణ
ⓒ బలవంతము
ⓓ నడవడి
15. ఎవరి ఆచారముల రీతిగా విగ్రహము పెట్టుకొని ఆహాబు బహుహేయముగా ప్రవర్తించెను?
ⓐ మోయాబీయులు
ⓑ అమ్మోనీయులు
ⓒ సిరియనులు
ⓓ అమోరీయులు
Result: