1. ప్రవక్తయైన ఏలీయా ద్వారా యెహోవా చెప్పిన మాటలను బట్టి ఆహాబు ఏమి కట్టుకొనెను?
2. ఆహాబు గోనెపట్ట మీద పరుండి ఏమి పడుచుండెను?
3. ఆహాబు తనకు భయపడి ఎలా ప్రవర్తించెనని యెహోవా అనెను?
4. ఆహాబు యెహోవాకు భయపడి వినయముగా ప్రవర్తించుట వలన ఏది అతని కాలములో సంభవింపకుండా దేవుడు ఆపెను?
5. తమదైన ఏది సిరియనుల చేతిలో నుండి తీసుకోవాలని ఆహాబు తన సేవకులతో చెప్పెను?
6. రామోల్గిలాదు మీదికి ఎవరిని తనతో యుద్ధమునకు రమ్మని ఆహాబు అడిగెను?
7. ఆహాబు దగ్గర యెహోవా ప్రవక్తలమని చెప్పుకొనే అబద్ధ ప్రవక్తలు ఎంతమంది కలరు?
8. యెహోవా సెలవిచ్చునది ఆయన జీవముతోడు ప్రకటించే ప్రవక్త ఎవరు?
9. యెహోవా మీకాయా ద్వారా సెలవిచ్చినను, అతని మాట వినక ఆహాబు ఎక్కడికి పోయెను?
10. ఆహాబు యుద్ధమునకు ఎలా వెళ్ళెను?
11. ఇశ్రాయేలు రాజుతో మాత్రమే యుద్ధము చేయమని సిరియరాజు ఎవరితో చెప్పెను?
12. సిరియనులలో ఒకడు గురి చూడకయే విసిరిన విల్లు ఆహాబుకు ఎక్కడ తగిలెను?
13. యుద్ధము ఎలా జరుగుచుండగా ఆహాబును సిరియనుల యెదుట నిలువబెట్టిరి?
14. ఆహాబు రాజు ఎప్పుడు మరణమాయెను?
15. ఆహాబు యొక్క రక్తము ఎక్కడ మడుగు కట్టెను?
Result: