1. యెహోరాము తర్వాత ఎవరు ఇశ్రాయేలీయులకు రాజాయెను?
2. యెహును రాజుగా పట్టాభిషక్తుని చేసినది ఎవరు?
3. ఎవరి కుటుంబమును యెహోవా యెహుకు ఆప్పగించెను?
4. యెహు ఏ ఊరికి వచ్చెను?
5. యెహు యెజ్రేయేలుకు వచ్చి ఎవరిని హతము చేయించెను?
6. యెహు ఆహాబు యొక్క ఎంతమంది కుమారుల తలలు తీయించి చంపెను?
7. యూదా రాజైన అహజ్యా సహోదరులను ఎంతమందిని యెహు చంపించెను?
8. యెహు ఎవరిని కుశల ప్రశ్నలడిగెను?
9. బయలుకు మ్రొక్కువారిని ఏమి చేయుటకు యెహు కపటోపాయము చేసెను?
10. యెహు ఇశ్రాయేలు దేశమంతటికి బయలు పండుగకు రమ్మని ఏమి పంపెను?
11. యెహు బయలునకు మ్రొక్కు వారందరికి ఏమి బయటకు తెప్పించమని అధికారికి చెప్పెను?
12. ఎవరులలో ఒకనినైనను బయలు గుడిలో లేకుండా జాగ్రత్త పడమని యెహు అనెను?
13. యెహు ఎంతమందిని బయలుకు మ్రొక్కువారు తప్పించుకోకుండా కాపలాపెట్టెను?
14. బయలుకు మ్రొక్కు వారిని హతము చేసి, ప్రతిమను, గుడిని క్రింద పడగొట్టి దానిని యెహు ఎలా చేయించెను?
15. షోమ్రోనులో యెహు ఎంతకాలము ఇశ్రాయేలీయులను ఏలెను?
Result: