Bible Quiz in Telugu Topic wise: 177 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఇశ్రాయేలీయుల రాజు యెహోయాజు" అంశము పై బైబిల్ క్విజ్)

1. యెహు తర్వాత అతని కుమారుడైన ఎవరు ఇశ్రాయేలీయులకు రాజాయెను?
ⓐ యోవాషు
ⓑ యోషీయా
ⓒ యెహోయాహాజు
ⓓ యెహోయాదా
2. ఎవరి మార్గమును విడువక యెహోయాహాజు వాటిని అనుసరించెను?
ⓐ యరొబాము
ⓑ జిమ్రీ
ⓒ ఆహాబు
ⓓ ఒమ్రీ
3. యెహోయాహాజు యెహోవా దృష్టికి ఏమి జరిగించెను?
ⓐ దుష్టత్వము
ⓑ దుర్నీతి
ⓒ దుర్మార్గము
ⓓ చెడుతనము
4. యెహోవా కోపము ఎవరి మీద రగులుకొనెను?
ⓐ యెహోయాహాజు
ⓑ యాజకుల
ⓒ ఇశ్రాయేలీయుల
ⓓ ప్రధానుల
5. యెహోవా ఇశ్రాయేలీయులను ఏ దేశపురాజుకు అప్పగించెను?
ⓐ ఎదోము
ⓑ సిరియా
ⓒ మోయాబు
ⓓ అష్టూరు
6.యెహోయాహాజు యెహోవాను ఏమి చేసెను?
ⓐ మోకరించెను
ⓑ ప్రార్ధించెను
ⓒ వేడుకొనెను
ⓓ అడిగెను
7. యెహోవా ఇశ్రాయేలీయులను ఏమిచేసి యెహోయాహాజు మనవి నంగీకరించెను?
ⓐ దయయుంచి
ⓑ కనికరించి
ⓒ కటాక్షించి
ⓓ ప్రేమయుంచి
8. యెహోవా ఇశ్రాయేలీయులకు ఎవరిని అనుగ్రహించెను?
ⓐ అధిపతిని
ⓑ మంత్రిని
ⓒ రక్షకుని
ⓓ సేనాధిపతిని
9. ఇశ్రాయేలీయులు సిరియనుల వశములో నుండి తప్పించుకొని ఎక్కడ కాపురముండిరి?
ⓐ షోమ్రోనులో
ⓑ రాజనగరులో
ⓒ గుడారములో
ⓓ స్వస్థానములలో
10. యెహోయాహాజు కాలములో ఏది షోమ్రోనులో నిలిచియుండెను?
ⓐ మూగవిగ్రహము
ⓑ కదలని ప్రతిమ
ⓒ దేవతాస్థంభము
ⓓ బొమ్మలు
11. యెహోయాహాజు యొద్ద ఎంతమంది కాల్బలము మిగిలి యుండెను?
ⓐ పదివేలు
ⓑ ఇరువదివేలు
ⓒ అయిదువేలు
ⓓ రెండువేలు
12. ఎంతమంది రౌతులు యెహోయాహాజు నొద్ద నుండిరి?
ⓐ వంద
ⓑ యేబది
ⓒ వేయి
ⓓ పదివేలు
13. యెహోయాహాజు నొద్ద రధములు ఎన్ని కలవు?
ⓐ వేయి
ⓑ వంద
ⓒ పది
ⓓ ఇరువది
14. మిగిలిన వారిని సిరియనులు దుళ్ళగొట్టిన దేని వలె నాశనము చేసెను?
ⓐ పంట
ⓑ దుమ్ము
ⓒ ధూళి
ⓓ పొగ
15. యెహోయాహాజు ఎన్ని సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను?
ⓐ ఇరువది
ⓑ ముప్పది
ⓒ నలువది
ⓓ పదునైదు
Result: