1. యెహోయాహాజు నిద్రించిన తర్వాత అతని కుమారుడైన ఎవరు రాజాయెను?
2. యెహోయాషు ఎక్కడనుండి ఇశ్రాయేలీయులను పాలించెను?
3. యరొబాము వలె యెహోయాషు దేనిని విడువలేదు?
4. యెహోయాషు యెహోవా దృష్టికి ఏమి జరిగించెను?
5. సిరియారాజైన ఎవరి చేతిలో నుండి ఇశ్రాయేలు పట్టణములను యెహోయాషు తీసుకొనెను?
6. యెహోయాషు సిరియా రాజైన బెన్హదదును ఎన్నిమార్లు జయించెను?
7. యూదా రాజైన ఎవరు యెహోయాషును దర్శించమనెను?
8. ఏమి వద్దని యెహోయాషు యూదారాజైన అమజ్యాకు వర్తమానము పంపెను?
9. యూదా రాజైన అమజ్యా యెహోయాషుతో ఎక్కడికి యుద్ధమునకు వచ్చెను?
10. యూదా వారు ఇశ్రాయేలీయుల యెదుట ఏమి పొందిరి?
11. ఇశ్రాయేలీయుల యెదుట నుండి యూదావారు తమ యొక్క ఎక్కడికి పారిపోయిరి?
12. యెహోయాషు యూదా రాజైన అమజ్యాను పట్టుకొని ఎక్కడికి వచ్చెను?
13. యెరూషలేము ప్రాకారమును ఎన్ని మూరల పొడుగును యెహోయాషు పడవేసెను?
14. యెహోవా మందిరము, రాజనగరులో నున్న ఏమేమి తీసుకుని యెహోయాషు షోమ్రోనుకు వచ్చెను?
15. యెహోయాషు ఇశ్రాయేలీయులను ఎన్ని సంవత్సరములు ఏలెను?
Result: