1. "Occupation" అనగా ఏమిటి?
2. ఎవరి ఉద్యోగము తిరిగి మరల వచ్చునని యోసేపు కల భావము చెప్పెను?
3. "ఔషధజ్ఞాని" ఎవరు?
4. వస్త్రశాలకు "విచారణకర్త"గా ఎవరు యుండెను?
5. వివేకము ఆలోచన గల తన పినతండ్రియైన ఎవరిని దావీదు "శాస్త్రి"గా నియమించెను?
6. "అడవులను కాయు అధికారియైన" ఎవరికి తాకీదు ఇయ్యుడని నెహెమ్యా రాజును అడిగెను?
7. ఏ పట్టణముయొక్క సగమునకు "అధిపతి" యైన షల్లూము ప్రాకారమును బాగుచేసెను?
8. యోషీయా కాలములో "పట్టణాధిపతి"ఎవరు?
9. కోటకు "అధిపతి"యైన ఎవరికి నెహెమ్యా యెరూషలేము పైన అధికారము ఇచ్చెను?
10. దేవుడు "నపుంసకుల అధిపతి"యైన ఎవరి దృష్టికి దానియేలునకు కృపాకటాక్షము నొంద ననుగ్రహించెను?
11. యోసేపు "వృత్తి" ఏమిటి?
12. పౌలు యొక్క "వృత్తి" ఏమిటి?
13. "సుంకపు గుత్తదారుడైన" ఎవరు యేసును చూడగోరెను?
14. కొర్నేలి ఏ పటాలములో "శతాధిపతి"?
15. పౌలు మీద వచ్చిన ఫిర్యాదును ఏ "న్యాయవాది"అధిపతికి తెలియజేసెను?
Result: