1. అహజ్యా చనిపోయిన తర్వాత ఎవరు రాజాయెను?
2. యెహోరాము ఎవరి కుమారుడు?
3. యెహోరాము ఎవరు నిలిపిన బయలు దేవతాస్తంభమును తీసివేసెను?
4. యెహోవా దృష్టికి యెహోరాము ఏమి చేయుట మానలేదు?
5. మోయాబు రాజైన ఎవరు ఇశ్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేసెను?
6. నీవు వచ్చి నాతో కూడా మోయాబీయులతో యుద్ధము చేసెదవా,అని యెహోరాము యూదా రాజైన ఎవరి నడిగెను?
7. ఇశ్రాయేలు దేశమును సిరియారాజైన ఎవరు తన సైన్యముతో ముట్టడి వేసెను?
8. యెహోరాము యేలుబడిలో షోమ్రోనులో ఏమి కలిగెను?
9. షోమ్రోనులో క్షామకాలమున గాడిద యొక్క తల ఎన్ని రూపాయలకు అమ్మబడెను?
10. షోమ్రోనులో గొప్పక్షామము కలుగగా అయిదు రూపాయలకు అమ్మబడినదేమిటి?
11. షోమ్రోనును సిరియనులు అంత ఏ విధముగా ముట్టడివేసిరి?
12. షోమ్రోనులో క్షామము ఎవరు తమ బిడ్డలను తినేంత గొప్పదిగా నున్నది?
13. యెహోరాము ఎవరి తలను అతని మీద నిలిచియుండనియ్యననెను?
14. ఎలీషా రేపు షోమ్రోను ద్వారమున రూపాయి ఒకటింటికి ఏ పిండి అమ్మబడుననెను?
15. షోమ్రోను ద్వారమున రెండు మానికల యవలు ఎంతకు అమ్మబడునని ఎలీషా రాజుతో చెప్పెను?
Result: