1. ఇశ్రాయేలీయులను ఏలిన పదహారవ రాజు ఎవరు?
2. ఇశ్రాయేలీయుల పదియేడవ రాజు పేరేమిటి?
3. ఇశ్రాయేలీయుల పదునెనిమిదవ రాజును తెల్పుము?
4. ఇశ్రాయేలీయులను ఏలిన పంతొమ్మిదవ రాజు ఎవరు ?
5. ఇశ్రాయేలీయులను ఏలిన రాజులు ఎంతమంది?
6. ఇశ్రాయేలీయుల రాజులందరు ఎవరిని అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము చేసిరి?
7 . యరొబాము తండ్రి పేరేమిటి?
8 . ఇశ్రాయేలీయులు ఎక్కడ యున్న యెహోవా మందిరమునకు బలులు అర్పించుటకు పోవుచుండిరి?
9 . యెరూషలేమునకు వెళుతున్న జనుల హృదయము యూదా రాజైన ఎవరి వైపునకు తిరుగునని యరొబాము అనుకొనెను?
10. రాజ్యము మరల ఎవరి సంతతి వారిదగునని యరొబాము అనుకొనెను?
11 . యరొబాము ఆలోచన చేసి ఏమి చేయించెను?
12 . జనులను పిలిచి యరొబాము, యెరూషలేముకు వెళ్ళుట మీకు ఏమగునని చెప్పెను?
13 . జనులకు రెండు బంగారు దూడలను చూపించి,ఎక్కడనుండి అవి వారిని రప్పించిన దేవుడని యరొబాము చెప్పెను?
14 . రెండు బంగారు దూడలను యరొబాము ఎక్కడెక్కడ యుంచెను?
15 . దాను వరకు జనులు ఒకదానిని ఏమి చేయుట వలన యరొబాము వారు పాపము చేయుటకు కారకుడాయెను?
Result: